Showing posts with label విరోచనాలు. Show all posts
Showing posts with label విరోచనాలు. Show all posts

Tuesday, June 18, 2013

రోజుకో యాపిల్ తినండంతో రక్తహీనత నివారణ

యాపిల్ పండ్లు ఇంచు మించుగా అన్ని సీజన్లలో దొరుకుతాయి. యాపిల్ పండులో మంచి విటమిన్లున్నాయి. ఒక యాపిల్‌లో ఒక మిల్లీగ్రాము ఇనుము, పధ్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్పరస్, పది మిల్లీగ్రాముల కాల్షియం, ఏ విటమిన్లున్నాయి. రోజుకొక యాపిల్‌నైనా తింటే ఆరోగ్యంగా వుంటారు.

యాపిల్ రక్తహీనతను నివారిస్తుంది. సాఫీగా విరోచనం అవుతుంది. కడుపులో మలాన్ని కరిగిస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.

రక్త, బంక విరోచనాలవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండిపదార్థాలు విరోచనాలలోని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరోచనాలు తగ్గుతాయి. యాపిల్ ముక్కల్ని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.

చంటి పిల్లలకు విరోచనాలవుతున్నపుడు ఒక చెంచాయాపిల్ జ్యూస్ తాగిస్తే విరోచనాలు అరికడతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనే కూడా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పుల్లని తేనుపులు, గుండెల్లో మంట నివారిస్తాయి.