Showing posts with label ఆరోగ్య చిట్కాలు. Show all posts
Showing posts with label ఆరోగ్య చిట్కాలు. Show all posts

Tuesday, June 18, 2013

బరువు తగ్గాలా...?

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఊబకాయ సమస్య రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు.

ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి ఒక ప్రణాళిక తయారు చేయండి. ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలో కంట్రోల్ ఉంటుంది.

ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతో రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు.

ఉద్యోగ రీత్యా మీరు గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం తరువాత 15 నుంచి అరగంట సమయం నడవడం మంచిది. ఒక రోజులో ఒక కప్పు టీ త్రాగటం ఉత్తమం. మీరు బ్రెక్ ఫాస్ట్‌ను ఉదయం 8 గంటలకు ముందు తీసుకోవాలి. ఈ భోజనం కూరగాయలతో ఉంటే ఇంకా మంచిది. తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి.

వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటినుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయలను వాడండి. భోజనం తరువాత ఒక కప్పు హెర్బల్ టీ త్రాగి 20 నిమిషాలు నడవండి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా అవుతుంది.

రాత్రిపూట త్వరగా నిద్రపోయి, ప్రొద్దునే త్వరగా మేల్కొండి. అప్పుడు మీ పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 8 గంటలకు, లంచ్ మద్యాహ్నం 1 గంటకు, డిన్నర్ రాత్రి 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు.

విటమిన్ 'డి' వలన పుట్టబోయే పిల్లలకు అనారోగ్యాలు వస్తాయా...?

గర్భిణి స్త్రీలు అధికంగా విటమిన్ 'డి' ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన పుట్టబోయే పిల్లల్లో ఫుడ్ అలెర్జీలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువలన గర్భిణి స్త్రీలు అధికంగా విటమిన్ 'డి 'ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు.

వాషింగ్టన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో గర్భీణి స్త్రీల రక్తంలో ఎక్కువ స్థాయిలో 'డి' విటమిన్ ఉన్నవారికి పుట్టిన బిడ్డలకు మొదట రెండు సంవత్సరాలు అధికంగా ఫుడ్ అలెర్జీలు వచ్చాయని. తక్కువ స్థాయి 'డి' విటమిన్ ఉన్న వారికి పుట్టిన బిడ్డలలో కొన్ని సందర్భాలలో మాత్రమే ఫుడ్ అలెర్జీలతో భాదపడ్డారని వారు వివరించారు.

అందువలన మధ్యాహ్నం సూర్యకాంతికి దూరంగా ఉండాలి, బయట ఎక్కువ సమయం గడపకూడదు. ముఖ్యంగా గుడ్డులో ఉన్న తెల్లని పదార్థం, పాలు, గోధుమ పిండితో తయారు చేసిన ఆహారాలు, వేరుశెనగ లేదా సోయా చిక్కుళ్ళు ఎక్కువుగా తీసుకోకూడదు. ఇటువంటి ఆహారాన్ని విస్మరించడం 

మందులతో కాకుండా బి.పిని తగ్గించుకునే మార్గం ఉందా..?

బి.పి ఎక్కువగా ఉంటే మందులు వాడటం అవసరం. లేకపోతే అది అనేక వ్యాధులను కలుగజేస్తుంది. మందులు కాకుండా బి.పిని కంట్రోల్ చేసుకోవాలంటే, రోజూ 5 తులసీ దళాలు, అర చెంచా తేనెలో ముంచుకుని బుగ్గన ఉంచుకుని నములుతూ ఉండండి. అది బి.పిని నియంత్రిస్తుంది. ఇలా చేస్తూనే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించండి. చక్కని నిద్రను ఎంతమాత్రం దూరం చేసుకోవద్దు.

ప్లాస్టిక్ వస్తువులలో ఆహారాన్ని భద్రపరుస్తున్నారా...?

ప్లాస్టిక్ పదార్థాలలో బిస్ ఫినాల్ ఏ (BPA), పాల్థాలేట్ అనే రెండు రకాల రసాయన పదార్థాలు కలిసి ఉంటాయి. అందువలన ఇటువంటి వాటిలో ఉంచిన ఆహారాన్ని తినడం వలన ఆ రసాయన పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురిచేస్తాయి. అందువలన అటువంటి వాటిలో ఆహారాన్ని భద్రపరచటం, లేదా తయారు చేయటం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మైక్రోవేవ్‌ల ద్వారా తయారు చేసిన ఆహారంలో, ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే శీతలపానియాలలో ఈ రసాయన పదార్థాలు సులభంగా కలిసిపోతాయి. అదే విధంగా ఈ రసాయన పదార్థాలు ఆటోమెబైల్ పరికరాలు, వైద్య పరికరాలు, పరిమళ ద్రవ్యాలు, దుస్తుల్లో కూడా ఉంటాయి. అందువలన వీలైనంత వరకూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుని మనల్ని, మన పరిశరాలను కాపాడుకుందాం.  

ఆరోగ్యమైన గుండెకోసం ఈ ఐదు సూత్రాలు పాటించండి!

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా.. మీ గుండెను సమస్యల నుంచి దూరం చేసుకోవాలంటే ఈ ఐదు సూత్రాలు పాటించండి.

* ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఫాట్, ఉప్పు అధికంగా గల పదార్థాలను తీసుకోకండి

* దానిమ్మ పండు జ్యూస్‌ను అప్పడప్పుడు తీసుకోండి. దీనిని తీసుకోవడం ద్వారా ఫాట్ తగ్గిస్తుంది. ఎండిన కొత్తిమీర, జీలకర్రను పొడిచేసుకుని ఆహారంలో తీసుకోవాలి.

* గుండె సమస్యలున్నాయని తెలిస్తే.. 72 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే.

* చేదు పదార్థాలు అంటే కాకర కాయల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది.

* అధికంగా నవ్వడం, మానసిక ఇబ్బందులు వంటివి గుండెకు చేటు చేస్తాయి. అందుకే ఎప్పుడూ సంతోషమైనా, దుఃఖమైనా సమపాళ్లలో ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జిమ్‌కు వెళ్ళకుండా వ్యాయామం ఎలా చేయాలి?

వ్యాయామం చేయడానికి జిమ్‌లు, వ్యాయామ పరికరాలు అవసరం లేదు. ప్రతీరోజూ వ్యాయమం చేయాలని సంకల్పించుకుని క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తే ఫలితం కనబడుతుంది. ఉదాహరణకు ఇంట్లో ఒకేచోట ఉండి నడవడానికి ఎలాంటి పరికరాలు అక్కర్లేదు. వాకింగ్ లేదా స్లో రన్నింగ్, జాగింగ్‌ను కాడా చేయవచ్చు. అలాగే బరవు 85 కిలోలు పైన ఉంటే వాకింగ్, జాగింగ్ కాకుండా సైక్లింగ్ చేయాలి.

అలాగే బరువును ఆసారగా తీసుకునే వ్యాయామాలైన దండీలు, బస్కీలతో పాటు వేలాడుతూ పైకి లేచే చిన్ అప్ ఎక్సర్‌సైజ్‌లను చేయవచ్చు. మోకాళ్లు ఎలాంటి నొప్పులు లేకపోతే మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఇంట్లో వాటర్ బాటిల్ సహాయంతో డంబెల్ ఎక్సర్‌‌సైజులు వంటివి చేయవచ్చు. ఇంకా ఇంటిపనులు అంటే... ఇల్లు శుభ్రం చేయడం, ఇంట్లో మొక్కలు పెంచడం వంటి పనులు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పనులు కూడా పూర్తవుతాయి.

రోజుకో యాపిల్ తినండంతో రక్తహీనత నివారణ

యాపిల్ పండ్లు ఇంచు మించుగా అన్ని సీజన్లలో దొరుకుతాయి. యాపిల్ పండులో మంచి విటమిన్లున్నాయి. ఒక యాపిల్‌లో ఒక మిల్లీగ్రాము ఇనుము, పధ్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్పరస్, పది మిల్లీగ్రాముల కాల్షియం, ఏ విటమిన్లున్నాయి. రోజుకొక యాపిల్‌నైనా తింటే ఆరోగ్యంగా వుంటారు.

యాపిల్ రక్తహీనతను నివారిస్తుంది. సాఫీగా విరోచనం అవుతుంది. కడుపులో మలాన్ని కరిగిస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.

రక్త, బంక విరోచనాలవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండిపదార్థాలు విరోచనాలలోని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరోచనాలు తగ్గుతాయి. యాపిల్ ముక్కల్ని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.

చంటి పిల్లలకు విరోచనాలవుతున్నపుడు ఒక చెంచాయాపిల్ జ్యూస్ తాగిస్తే విరోచనాలు అరికడతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనే కూడా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పుల్లని తేనుపులు, గుండెల్లో మంట నివారిస్తాయి.