ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి ఒక ప్రణాళిక తయారు చేయండి. ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలో కంట్రోల్ ఉంటుంది.
ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతో రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు.
ఉద్యోగ రీత్యా మీరు గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం తరువాత 15 నుంచి అరగంట సమయం నడవడం మంచిది. ఒక రోజులో ఒక కప్పు టీ త్రాగటం ఉత్తమం. మీరు బ్రెక్ ఫాస్ట్‌ను ఉదయం 8 గంటలకు ముందు తీసుకోవాలి. ఈ భోజనం కూరగాయలతో ఉంటే ఇంకా మంచిది. తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి.
వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటినుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయలను వాడండి. భోజనం తరువాత ఒక కప్పు హెర్బల్ టీ త్రాగి 20 నిమిషాలు నడవండి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా అవుతుంది.
రాత్రిపూట త్వరగా నిద్రపోయి, ప్రొద్దునే త్వరగా మేల్కొండి. అప్పుడు మీ పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 8 గంటలకు, లంచ్ మద్యాహ్నం 1 గంటకు, డిన్నర్ రాత్రి 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు.
No comments:
Post a Comment