Tuesday, June 18, 2013

మంచి గంధాన్ని అరగదీయండి.. చర్మానికి రాసి వేసవి స్నానం చేయండి

వేసవి వచ్చిందంటే అధికంగా చమట పట్టడం... ఫలితంగా చర్మం పేలి ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ సమస్యనుంచి బయటపడటానికి ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరి... చర్మం పేలకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత మంచి గంధాన్ని అరగదీసి చేతులు, వీపు, మెడ, నడుముకు రాసుకోవాలి.

అలాగే స్నానం చేసే ముందు తులసి ఆకులు, తమలపాకులు కలిపి దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని ఓ గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చమట కాయల సమస్య నుంచి బయటపడవచ్చు.

వేసవిలో ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు మేలు చేస్తాయి. అలాగే ఉదయంవేళల్లో ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్ధాలు తీసుకుంటే మంచిది.

No comments:

Post a Comment