Tuesday, June 18, 2013

అలసటకు తక్షణ విరుగుడు అరటి..!

మీరు బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తారు. వెంటనే భోజనం చేసే అవకాశం లేకపోతే అరటిపండు తినడం మంచిది. ఈ పండులో పోటాషియమ్ లవణాలు మీ ఆకలిని వెంటనే భర్తీ చేస్తుంది. అంతేకాదు మరిన్ని ఖనిజాలు మినరల్స్‌కు ప్రధాన వనరు అరటిపండు. మీరు గమనించారా అందుకే క్రీడాకారులు తాము కోల్పోయే లవణాలను తక్షణం భర్తీ చేసుకోవడానికి అరటి పండు తింటుంచారు.

చక్కెరను నిరోధించే చిలగడదుంప..
మధుమేహ వ్యాధిగ్రస్థులకు డాక్టర్లు ఒక ఆరోగ్య సూత్రం చెబుతుంటారు. భూమిలో పండే దుంపలు తినవద్దని, అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులకు అవి మంచివి కావని సలహా ఇస్తారు. అయితే చిలగడదుంపను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే దీనినుంచి విడుదలయ్యే చక్కెర పాళ్లు చాలా తక్కువ. పైగా ఇందులో విటమిన్- ఏ కూడా ఎక్కువ. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు నిరభ్యంతరంగా తినదగ్గేదే ఈ చిలగడ దుంప.

No comments:

Post a Comment