పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కాని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కొవ్వుతో నిండిన పాలు తాగకపోవడం మంచిది. నెలరోజులు వీటికి దూరంగా ఉంటే, తేడా మీకే తెలుస్తుంది.
చాలామంది భోజనానంతరం తీపి పదార్థాలు తీసుకుంటారు. దాని వల్ల శరీరానికి పోషక విలువల కంటే చక్కెర శాతం ఎక్కువ అందుతుంది. ఎక్కువ తీపి వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
భోజనం వేళలు పాటించనివారు విరామ సమయంలో అధిక కార్బొహైడ్రేట్లు లభించే శాండ్‌విచ్, సమోసా, బర్గర్ల వంటివి తీసుకోవడం వల్ల ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుపోయి, ఊబకాయానికి దారితీయడంతో పాటు ఉదరసంబంధ సమస్యలూ వస్తాయి.
ప్రోటీన్లు లభించే ఎండుఫలాలు, నట్స్ అల్పాహారంగా తీసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది. దాంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
నూనెలో దోరగా వేయించిన బంగాళాదుంప అధిక బరువుకు కారణమవుతుంది. ఈ దుంపలకు బదులుగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. కావాలంటే దుంపలను మితంగా తీసుకోవచ్చు.
No comments:
Post a Comment