Wednesday, June 19, 2013

రక్తదానంతో గుండెను పదిలంగా ఉంచుకోండి..!!

* రోజూ ఆటలాడటం వల్ల క్యాన్సర్, గుండెపోటుకు గుడ్ బై చెప్పినట్టే. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి.

* నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం నిద్రపోవాలి.

* వ్యాయామం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, మధు మేహం వంటివి తగ్గుతాయి. వ్యాయామం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

* మీరు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తే మీ గుండెకు చాలా మంచిదన్న విషయాన్ని మర్చిపోకండి.

* మెట్లెక్కడం, తోటపని వంటివి గుండెకు మంచి చేస్తాయి. ఇంకా ఉతికిన బట్టలు ఆరేయడం, ఆరిన తర్వాత మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం లాంటి ఇంటి పనులు గుండె జబ్బుల రిస్క్‌ని తగ్గిస్తాయి.

* ప్రతిరోజూ కనీసం 30-60 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఒక పూట భోజనం పూర్తిగా అరిగిపోయేలా చేస్తుంది. అంటే దాంతో కొవ్వులు శరీరంలోకి చేరదు. అలా కొవ్వులు చేరకపోవడం గుండెకు చాలా మంచిది.

* క్రమంగా వ్యాయామం చేయడాన్ని ఒకేసారి ఆపకూడదు. క్రమంగా వ్యాయామం చేయడంలోని తీవ్రతను తగ్గించుకుంటూ రావాలి. దీనివల్ల రక్తపోటు, గుండెకొట్టుకునే ప్రక్రియ ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటాయి.

* వ్యాయామం వల్ల రక్తప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వులు తగ్గుతాయి. ఎముకలు బలంగా మారుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది గుండె ఆరోగ్యానికి పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మేలు చేస్తుంది.

No comments:

Post a Comment