ప్రతీ మనిషికి కనీసం రాత్రి సమయంలో ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. యోగ సాధన, ప్రార్థన మనఃపూర్వకంగా చేసే వారికి ఆరుగంటలు నిద్ర చాలు. బి.పి, షుగరువ్యాధిలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర కోసం మత్తు పదార్థాలు, నిద్రమాత్రలు అలవాటు చేసుకోవడం మంచిది కాదు.
ఎందుకంటే వాటిని తరచుగా వాడటంవల్ల స్తబ్ధత, బద్ధకం వస్తాయని పరిశోధనలో తేలింది. మనం ఎన్నెన్నో సమస్యలు మానసిక ఒత్తిళ్ళు, అనేక ఆలోచనలతో నిద్రపోతాం. ఈ ఒత్తిడులన్నీ ముందే వదిలించుకొని యోగాభ్యాసంతో నిద్రించే నిద్ర, యోగనిద్ర ఇది ఆరోగ్యకరమైనది.
నిద్రకు ఉపక్రమించే ముందు పోరాటం, యుద్ధం, భయంకర దృశ్యాల కథలు కాకుండా ఆహ్లాదభరితమైన పుస్తకం పడుకునే ముందు చదవటం అలవాటు చేసుకుంటే చక్కటి నిద్రవస్తుంది.
No comments:
Post a Comment