Tuesday, June 18, 2013

మీ వయసును మైనస్ చేయాలంటే...?

వయసు పెరిగే కొద్ది శరీరంలో మార్పులొస్తాయి. ముఖం ఛాయ తగ్గడం, నుదుటి మీద ముడతలు పడుతాయి. కళ్ల కింద నల్లని చారలు ఏర్పడతాయి. పెదవులు పొడిబారి పేలవంగా కనిపిస్తాయి. బుగ్గలు ఎండిపోతాయి. మెడ కింద చర్మం ముడతలు పడుతుంది. వీటి నివారణ కొరకు కొన్ని చిట్కాలు పాటించండి.

అవకాడో అనే మెక్సికో దేశానికి చెందిన చెట్టులో వయస్సును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది. అధిక రక్తపోటును నిలువరిస్తుంది. అదేవిధంగా తృణధాన్యాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మధుమేహం, హృద్రోగం రాకుండా కాపాడతాయి. వయసు మీద పడకుండా చూడటంలో వీటి పాత్ర కీలకం.

వారానికి రెండుసార్లు చేపలు తినేవారి ఆయుష్షు పెరిగిందని పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి. పండ్లు కూరగాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ శక్తి కనుక లేకపోతే, శరీరం త్వరగా శుష్కించి, ముడతలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment