Showing posts with label ఆరోగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యం. Show all posts

Tuesday, June 18, 2013

బరువు తగ్గాలా...?

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఊబకాసమస్య రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు.

ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి ఒక ప్రణాళిక తయారు చేయండి. ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలో కంట్రోల్ ఉంటుంది.

ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతో రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు.

ఉద్యోగ రీత్యా మీరు గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం తరువాత 15 నుంచి అరగంట సమయం నడవడం మంచిది. ఒక రోజులో ఒక కప్పు టీ త్రాగటం ఉత్తమం. మీరు బ్రెక్ ఫాస్ట్‌ను ఉదయం 8 గంటలకు ముందు తీసుకోవాలి. ఈ భోజనం కూరగాయలతో ఉంటే ఇంకా మంచిది. తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి.

వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటినుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయలను వాడండి. భోజనం తరువాత ఒక కప్పు హెర్బల్ టీ త్రాగి 20 నిమిషాలు నడవండి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా అవుతుంది.

రాత్రిపూట త్వరగా నిద్రపోయి, ప్రొద్దునే త్వరగా మేల్కొండి. అప్పుడు మీ పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 8 గంటలకు, లంచ్ మద్యాహ్నం 1 గంటకు, డిన్నర్ రాత్రి 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు.

ప్లాస్టిక్ వస్తువులలో ఆహారాన్ని భద్రపరుస్తున్నారా...?

ప్లాస్టిక్ పదార్థాలలో బిస్ ఫినాల్ ఏ (BPA), పాల్థాలేట్ అనే రెండు రకాల రసాయన పదార్థాలు కలిసి ఉంటాయి. అందువలన ఇటువంటి వాటిలో ఉంచిన ఆహారాన్ని తినడం వలన ఆ రసాయన పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురిచేస్తాయి. అందువలన అటువంటి వాటిలో ఆహారాన్ని భద్రపరచటం, లేదా తయారు చేయటం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మైక్రోవేవ్‌ల ద్వారా తయారు చేసిన ఆహారంలో, ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే శీతలపానియాలలో ఈ రసాయన పదార్థాలు సులభంగా కలిసిపోతాయి. అదే విధంగా ఈ రసాయన పదార్థాలు ఆటోమెబైల్ పరికరాలు, వైద్య పరికరాలు, పరిమళ ద్రవ్యాలు, దుస్తుల్లో కూడా ఉంటాయి. అందువలన వీలైనంత వరకూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుని మనల్ని, మన పరిశరాలను కాపాడుకుందాం.