బి.పి ఎక్కువగా ఉంటే మందులు
వాడటం అవసరం. లేకపోతే అది అనేక వ్యాధులను కలుగజేస్తుంది. మందులు కాకుండా
బి.పిని కంట్రోల్ చేసుకోవాలంటే, రోజూ 5 తులసీ దళాలు, అర చెంచా తేనెలో
ముంచుకుని బుగ్గన ఉంచుకుని నములుతూ ఉండండి. అది బి.పిని నియంత్రిస్తుంది.
ఇలా చేస్తూనే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించండి. చక్కని నిద్రను
ఎంతమాత్రం దూరం చేసుకోవద్దు.
Showing posts with label విటమిన్లు. Show all posts
Showing posts with label విటమిన్లు. Show all posts
Tuesday, June 18, 2013
ఆరోగ్యమైన గుండెకోసం ఈ ఐదు సూత్రాలు పాటించండి!
* ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఫాట్, ఉప్పు అధికంగా గల పదార్థాలను తీసుకోకండి
* దానిమ్మ పండు జ్యూస్‌ను అప్పడప్పుడు తీసుకోండి. దీనిని తీసుకోవడం ద్వారా ఫాట్ తగ్గిస్తుంది. ఎండిన కొత్తిమీర, జీలకర్రను పొడిచేసుకుని ఆహారంలో తీసుకోవాలి.
* గుండె సమస్యలున్నాయని తెలిస్తే.. 72 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే.
* చేదు పదార్థాలు అంటే కాకర కాయల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది.
* అధికంగా నవ్వడం, మానసిక ఇబ్బందులు వంటివి గుండెకు చేటు చేస్తాయి. అందుకే ఎప్పుడూ సంతోషమైనా, దుఃఖమైనా సమపాళ్లలో ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రోజుకో యాపిల్ తినండంతో రక్తహీనత నివారణ
యాపిల్ రక్తహీనతను నివారిస్తుంది. సాఫీగా విరోచనం అవుతుంది. కడుపులో మలాన్ని కరిగిస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.
రక్త, బంక విరోచనాలవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండిపదార్థాలు విరోచనాలలోని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరోచనాలు తగ్గుతాయి. యాపిల్ ముక్కల్ని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.
చంటి పిల్లలకు విరోచనాలవుతున్నపుడు ఒక చెంచాయాపిల్ జ్యూస్ తాగిస్తే విరోచనాలు అరికడతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనే కూడా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పుల్లని తేనుపులు, గుండెల్లో మంట నివారిస్తాయి.
Subscribe to:
Posts (Atom)