Tuesday, June 18, 2013

మీ కళ్ళు తాజాగా వుండాలంటే ఏం చేయాలి?

ఆపిల్ పండు ముక్కలను మరిగించి వడకట్టి చల్లారిన తర్వాత తేనెకలిపి ఆ నీటిని కంటిని శుభ్రపరిచేందుకు వాడుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి. ఆపిల్ రసము తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది.

అలాగే హృదయ రుగ్మతలకు అక్రోట్ అంజూ పండ్లు తీసుకుంటే హృదయశూల తగ్గుతుంది. కమలాపండు రసం తాగితే దంతాలలో ఏర్పడే రంధ్రాలను తొలగిస్తుంది. లేత మామిడి చిగురు పంటి నొప్పులు, దగ్గులను తగ్గిస్తుంది.

మ్యాంగ్ షెల్‌లను రోజుకు రెండుసార్లు తాగితే బరువు పెరుగుతారు. ఇక నారింజ పెచ్చులు నాలుగు గ్రాములను రెండు కప్పుల నీటితో కాచి ఆ కషాయాన్ని సేవిస్తే గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది.

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలా?! ఇవిగోండి చిట్కాలు

నోటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ప్రతి సారీ తప్పక నాలుక గీచుకోవాలి. నాణ్యమైన నాలుక బద్దతో ఆ పని చేయాలి.

1. పెరుగుతున్న నోటి దుర్వాసన ఆగిపోవాలంటే రోజులో ఒకసారి అయినా పెరుగును తినండి.
2. విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా కలిగిన కాయగూరలు, పండ్లు ఎక్కువుగా తినండి. క్యారెట్, యాపిల్, బత్తాయివంటి పండ్లు, కూరలు మంచివి.

3. టీ తాగడం వలన టీలోని రసాయనాలు నోటి దుర్వాసనను పెరగకుండా అవుతాయి.
4. నోటిని ఎండిపోయిన స్థితిలో వుంచవద్దు. నీరు ఎక్కువగా తీసుకోవాలి. నోటిలో వుమ్మి వుంటే వాసన తగ్గుతుంది.

5. నోటి దుర్వాసనకు విరుగుడుగా మౌత్‌వాష్‌ని వాడతారు. అయితే మౌత్‌వాష్‌లో తప్పకుండా ఆల్కహాల్ వుంటుంది. ఆ ఆల్కహాల్ వల్ల నోరు ఎండిపోయినట్లు అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ లేనటువంటి మౌత్‌వాష్‌ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

కీళ్లనొప్పులా... అయితే ఈ చిట్కాలు పాటించండి

 40 ఏళ్లు దాటాయా... కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా అయితే ఈ చిట్కాలు పాటించండి. రోజూ మీరు తీసుకునే ఆహారంలో చింతపండును తగ్గించండి. కొత్త చింతపండును ఆహారంలో తక్కువగా తీసుకుంటే.. అది మన శరీరంలోని ఎముకల చుట్టూ ఉన్న కార్డిలేజ్‌కు ఎలాంటి ముప్పు తలపెట్టదు.

అలాగే బంగాళాదుంపలు వంటివి ఆహారంలో ఎక్కువగా చేర్చుకోకండి. పసుపు పొడి, వెల్లుల్లి పాయలను తీసుకుని బాగా పేస్ట్ చేసుకుని మోకాలి పట్టిస్తే కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు. ఇంకా కూల్‌డ్రింక్స్‌ను తీసుకోవడం ద్వారా ఎముకలు బలహీన పడతాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను తాగడం ఆపేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గాలా...?

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఊబకాయ సమస్య రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు.

ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి ఒక ప్రణాళిక తయారు చేయండి. ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలో కంట్రోల్ ఉంటుంది.

ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతో రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు.

ఉద్యోగ రీత్యా మీరు గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం తరువాత 15 నుంచి అరగంట సమయం నడవడం మంచిది. ఒక రోజులో ఒక కప్పు టీ త్రాగటం ఉత్తమం. మీరు బ్రెక్ ఫాస్ట్‌ను ఉదయం 8 గంటలకు ముందు తీసుకోవాలి. ఈ భోజనం కూరగాయలతో ఉంటే ఇంకా మంచిది. తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి.

వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటినుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయలను వాడండి. భోజనం తరువాత ఒక కప్పు హెర్బల్ టీ త్రాగి 20 నిమిషాలు నడవండి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా అవుతుంది.

రాత్రిపూట త్వరగా నిద్రపోయి, ప్రొద్దునే త్వరగా మేల్కొండి. అప్పుడు మీ పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 8 గంటలకు, లంచ్ మద్యాహ్నం 1 గంటకు, డిన్నర్ రాత్రి 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు.

భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగితే.. ఏమౌతుంది?

నగరాల్లో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసే వారు ఐస్ వాటర్ సేవించడం ఫ్యాషనైపోయింది. అయితే ఐస్ వాటర్ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శొంఠి పొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా విందుల్లో ఫుల్‌గా లాగించారా.. అయితే ఒక గ్లాసు వేడినీరు తాగేస్తే చాలు.. అజీర్ణ సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మృదువైన చర్మం కోసం బార్లీ పౌడర్ ఒక టేబుల్స్ స్పూన్ వేసి కాచిన నీటిని అప్పుడప్పుడు తాగడం మంచిది. కాళ్లు, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే వేడి నీటిలో తగినంత ఉప్పు వేసి.. ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే కాళ్ల నొప్పులుండవు. పాదాల నొప్పులు, పగుళ్లకు ఈ నీటిలో 15 నిమిషాల పాటు మీ పాదాలను ఉంచితే మంచి ఫలితముంటుంది.

దాహం వేస్తే చల్లటి నీరు తాగడం కంటే వేడినీటిని తాగితే శరీరంలోని మలినాలంతా తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు వేడినీరు తాగితే శరీర బరువు తగ్గుతుంది. ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కంటిచూపు, కండరాల దృఢత్వానికి ములగ

ములగ ఆకుల్లోనూ, కాడల్లోనూ, క్యాల్షియం, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలకు బలం కలిగిస్తుంది. నేత్రవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకులను దంచి రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనే, లేక చక్కెర కలిపి రోజూ సేవిస్తే కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు అమోఘంగా ఉంటుంది. చర్మరోగాలు రాకుండా నివారితమవుతాయి. దీని ఆకుల్ని పప్పులో కలిపి ఉడికించి తింటారు. కాడల్ని సాంబారులో వేస్తారు.

ఈ కాడల్లోని విత్తులు తినడం వల్ల కడుపులోని క్రిములు నశిస్తాయి. ఈ గింజల్ని ఎండించి, చూర్ణంగా తయారుచేసి, సస్యంలాగ పీలిస్తే, దీర్ఘకాలపు శిరశ్శూలలు దూరమౌతాయి. ఒక చెంచా మునగ ఆకుల రసంలో ఒక చెంచా ఉల్లిపాయరసం కలిపి, రెండు పూటలా బహిష్టు సమయంలో తాగితే స్త్రీలలో వచ్చే బహిష్టు కడుపునొప్పి తగ్గుతుంది.

ఆకులముద్దను నువ్వుల నూనెతో కలిపి, పట్టు వేస్తే వాపులు, సెగ్గడ్డలు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు వేళ్లను దంచి, రసం తీసి ఒక చెంచా మోతాదులో పాలతో రోజూ రెండు పూటలా తాగితే మూత్ర పిండంలో రాళ్లు కరిగిపోతాయి. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్లు కూడా తగ్గుతాయన్న పరిశీలన కూడా ఉంది.

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణిలు తింటే?

తేనె వాడటం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.

ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది. అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.

ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది. తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం. తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.