Wednesday, August 15, 2012

పేదవాడి ఆకలి తీర్చండి

ఆకలి చావు . . . ఈ మాట వినగానే ఒళ్ళు జలదరిస్తుంది.ఏమి చేయలేమ? పరిస్తితిని మార్చలేమా?. . . అన్న ఆలోచనతో మనసు బరువెక్కుతుంది.

కానీ అలా భాధపదనక్కరలేదు. ఇంటర్నెట్ ముందు కూర్చొని freerice.com website open చేసి మీకు ఓపిక ఉన్నంత సేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగెయ్యండి. దానంతట అదే ఆకలి కడుపులకు చేరి పోతుంది.ఇదేలాగో చూద్దాం.

 ఏమిటి ఈ ఆట?

ఈ వెబ్సైటు హోం పేజి ఓపెన్ చేయగానే ఓ ఆంగ్లపదం, దాని క్రింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి.పై పదానికి సమానార్ధం వచ్చే పదం మీద క్లిక్ చేయగానే (అది రైట్ అయితే పది బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి.తప్పు ఐతే మరో సరి ప్రయత్నం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ బియ్యం పోగెయ్యండి.అలాగే మిగతా subjects కూడా..ఇక మీ ఓపిక - తీరిక..

ఎవరు చెల్లిస్తారు?

ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసినప్పుడు ఆ వెబ్ పేజి అడుగున స్పేస్ పొందే ప్రకటన కర్తలు అబియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు.ఆంగ్ల పద జాలాన్ని నేర్వడం, ఆకలి తీర్చడం ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్ లో ఆపిల్, తోషిబా వంటి వాటితో పాటు  ఎన్నెన్నో కంపినీలు ముందుకొచ్చాయి.

ఆలోచన వెనుక. . . . . .

జాన్ బ్రిన్ అమెరిక దేశీయుడు.వెబ్ సైట్ ల రూపకర్త. ఓ ఆన్ లైన్ గేమ్ తయారు చేయాలనుకున్నాడు.ఏదో ఆషా మాషి గేమ్ లా కాకుండా  దానికో ప్రయోజనం ఉంటె బాగుంటుంది అనుకున్నాడు.దాని ఫలితమే ఈ సైట్ రూపకల్పన.

ఈ గేమ్ ఆడి చూడండి. పేదవాడి ఆకలి తీరుతుంది. మన జ్ఞాన దాహం కూడా తీరుతుంది. దీని లింక్ కోసం(పైన )   చూడండి.

No comments:

Post a Comment