పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు.
కావలసిన పదార్ధాలు
శనగ పప్పు - పావుకిలో
బెల్లం లేదా చక్కెర - పావుకిలో
మినప పప్పు - అర్ధాపావుకిలో
మెత్తని బియ్యం పిండి - పావుకిలో
ఎండు కొబ్బరి ముక్కలు
ఏలకులు - తగినన్ని
తయారుచేయు విధానం
- బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి; గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి.
- శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి సూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు.
- ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి.
- పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.
- పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు.
చిట్కాలు
బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగాక బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి.
బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగాక బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి.
No comments:
Post a Comment