పిల్లలకు గానీ, పెద్దలకుగానీ అనుకోకుండా, అశ్రద్ధ వలన
చిన్న చిన్న దెబ్బలు తగిలే పరిస్ధితి ఏర్పడుతుంది. ప్రతి చిన్న దెబ్బకీ
వైద్యుని దగ్గరకు వెళ్ళడానికి కుదరకపోవచ్చు. చిట్కా వైద్యాలు చేస్తే తగిలిన
చిన్న చిన్న దెబ్బలు మానిపోవచ్చు. అదేవిధంగా కొద్ది పాటి జబ్బులుకీ చిట్కా
వైద్యాలు చేస్తే జబ్బులూ నయమవుతాయి.
ఫ్లూ జ్వరం: ఈ జ్వరం
సాధారణంగా కొందరికి వస్తుంది. అది నివారణ అవడం కోసం ధనియాలుతో కషాయం
పెట్టి, అందులో పసుపు వేసి ఆ కషాయాన్ని రెండు మూడు సార్లు త్రాగిన చాలు,
అదే విధంగా ధనియాలు, పసుపు, బెల్లం కలిపి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలు
చేసి మింగుతూ ఉన్నప్పటికీ ఫ్లూ జ్వరం తగ్గిపోతుంది.
నీళ్ళవిరోచనాలు: ఇవి తగ్గి పోవాలంటే ' టీ ' పొడితో చిక్కని డికాషన్ తీసి పంచదార కలపకుండా సేవించిన చాలు, అది వెగటు అనిపిస్తే డికాషన్ త్రాగిన తదుపరి అర చెంచా పంచదార నోటిలో వేసుకుని చప్పరించినా చాలు. డికాషిన్‌తో గుణం కుదరకపోతే వైద్యుని కలవాల్సిందే.
నెత్తురు బంక విరోచనాలు: బెల్లం జిలేబీ వండిన అనంతరం చివరిగా మిగిలిన మడ్డిని త్రాగినట్లయితే గుణమిస్తుంది. అది లభ్యమవ్వకపోతే బెల్లం జిలేబీ కాని, పంచదార జిలేబీ కానీ తినాలి. పంచదార జిలేబీ కన్నా బెల్లం జిలేబీ బెస్టు.
తలనొప్పి: శొంఠి కొమ్ము అరగతీసి ఆ గంధమును తలకు పట్టువేసినచో తలనొప్పి తగ్గిపోతుంది. లేదా కుంకుడికాయ - కణతలకు అంటించినా తలనొప్పి తగ్గిపోతుంది.
కడుపు నొప్పి: వాము + మెత్తని ఉప్పు బాగా కలిపి తిన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. లేదా వాము వాటర్ రెండు మూడు పర్యాయములు చిన్న సైజు గ్లాసుడు చొప్పున త్రాగినా కడుపు నొప్పిపోతుంది.
కంట్లో నలక: కంట్లో నలక పడి బాధ పెడుతూ ఉంటుంది. ఆ నలక బయటకు రావాలీ అంటే వెడల్పాటి బేసిన్ నిండా నీరు పోసి ఆ నీరు కళ్ళకు అందేట్లు, కళ్ళు తెరిచి నీళ్ళమీద ఆనిస్తే చాలు - నలుసు దూరమవుతుంది.
మాడు నొప్పి: కొందరు మాడు నొప్పితో బాధపడుతుంటారు. ఆ బాధ నివారణ కోసం వైద్యున్ని సంప్రదిస్తారు. అవసరమే! అయితే వైద్యుని వద్దకు వెళ్ళే ముందే ఆముదపు ఆకులుకి కొబ్బరినూనె గానీ, నువ్వులనూనె గానీ, ఆముదం గానీ పూసి, ఆ ఆకులు తలకు ఎక్కించి కట్టు కట్టినట్లయితే తెల్లవారే సరికి మాడు నొప్పి తగ్గి పొతుంది.
నోటి పూతకు: ఈతాకు నమిలి ఎండుకొబ్బరి నమిలినా, కొబ్బరి నూనె నాలుక మీద లోపల భాగంలో దవడలుకీ రాచినట్లయితే నోటి పూత తగ్గిపోతుంది.

- తుప్పు పట్టిన లేదా మామూలుమేకుగానీ కాళ్ళలో గుచ్చుకున్న, గాజు పెంకు గుచ్చుకున్న ఏ విధమైన ఇనుము గీసుకున్న, నల్ల జీడిగింజకు కంతపెట్టి ఆ పొగను వేసినా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉండదు.
No comments:
Post a Comment