Thursday, August 16, 2012

సామెతలు

1. అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట
2. అక్క మనదైతే బావ మనవాడా?
3. అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
4. అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
5. అగ్నికి వాయువు తోడైనట్లు
6. అగ్రహారాలన్నీ పోతే పోయాయి గానీ, ఆక్టు బాగా తెలిసిందన్నాడు
7. అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ
8. అటునుండి నరుక్కు రా
9. అడకత్తెరలో పోకచెక్క
10. అడగందే అమ్మ అయినా పెట్టదు
11. అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు
12. అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
13. అడుక్కుతినేవాడికి అర్ధరాజ్యమిచ్చినా అడుక్కుతినేచిప్ప కడుక్కుదాచుకున్నడట
14. అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
15. అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
16. అడుక్కున్నమ్మకు అరవై కూరలట, వండుకున్నమ్మకు ఒకటే కూరట
17. అడుసు తొక్కనేల కాలు కడగనేల
18. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
19. అతగాడే ఉంటే మంగలెందుకు
20. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న
21. అద్దం అబద్ధం చెప్పదు
22. అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు
23. అద్దం లో నీడకు ఆశ పడరాదు
24. అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు
25. అధికమైతే అమృతం కూడా విషమే
26. అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు
27. అధికాశ లోకదరిద్రం
28. అనగా అనగా రాగం తినగా తినగా రోగం
29. అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది
30. అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు
31. అనుమానం పెనుభూతం
32. అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది
33. అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది
34. అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ
35. అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
36. అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
37. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు
38. అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్ల పొత్తు పెద్దప్పుడు
39. అన్నదానం కన్నా విద్యాదానం మిన్న
40. అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు
41. అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు
42. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
43. అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
44. అన్నానికి ఆధారం లేదుగానీ, అందరికి పంక్తి భోజనమట
45. అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు
46. అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు
47. అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం
48. అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
49. అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు
50. అన్నీ ఉన్నాయి, అంచుకు తొగరే లేదు.
51. అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట
52. అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు
53. అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు
54. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు
55. అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం
56. అప్ప ఆరటమేగాని....బావపెట్టిసచ్చిందిలేదు
57. అప్పిచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్లు
58. అప్పిచ్చువాడు వైద్యుడు
59. అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును
60. అప్పు నిప్పులాంటిది...
61. అప్పుచేసి పప్పు కూడు
62. అప్పులున్నవాడి వెంట, చెప్పులున్నవాడి వెంట పోరాదు
63. అప్పులేనివాడు అధిక బలుడు
64. అబద్ధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు
65. అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాలి
66. అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
67. అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల
68. అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట
69. అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నాడుట
70. అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ
71. అభ్యాగతి,ఆదివిష్ణు
72. అభ్యాసము కూసువిద్య
73. అమరం నెమరుకు వస్తే కావ్యాలను కాల్చివేయనా.
74. అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు
75. అమావాస్యకు అట్లు, పున్నానికి బూరెలు
76. అమెరికా ఎక్కడరా అంటె ఆ మెరక దాటితె అమెరికాయెరా అన్నాడట.
77. అమ్మ అదృష్టాన నడిచే పిల్లలు పాకిరేరుట
78. అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
79. అమ్మ కన్న ఆరుగురూ సంగీత పాఠకులే
80. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
81. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననివ్వదు
82. అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు
83. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
84. అమ్మబోతె అడవి కొనబోతె కొరివి
85. అమ్మాయి గడప దాటి చెడిద్ది, అబ్బాయి గడప దాటక చెడతాడు
86. అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
87. అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు
88. అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ
89. అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనష్టమే
90. అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
91. అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
92. అయిన పెండ్లికి మేళమా?
93. అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు
94. అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
95. అయోమయం....జగన్నాథం!
96. అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట
97. అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం
98. అయ్య వచ్చేవరకూ అమావాస్య ఆగుతుందా?
99. అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది
100. అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు
101. అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని అమ్మకి సవతి పోరని ఎఱగడు
102. అయ్యలు మియ్యలు తెకతెయ్యలు
103. అయ్యలు, మియ్యలు, తక తైయ్యలు
104. అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే
105. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు
106. అయ్యవారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
107. అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను
108. అయ్యేదాకా అరిసెల పాకం అయినతరవాత బూరెలపాకం
109. అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది
110. అర చేతిలో బెల్లం పెట్టి మోచెయ్యి నాకించినట్టు
111. అరకాసు పనికి ముప్పాతిక బాడిగ
112. అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
113. అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు
114. అరచేత్తో సూర్యుని కిరణాలు ఆపలేవు
115. అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
116. అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
117. అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు
118. అరిచే కుక్క కరవదు
119. అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది
120. అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది
121. అర్థబలం కంటే, అంగబలం ఎక్కువ
122. అర్థరాత్రి మద్దెల దరువు
123. అర్థశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట
124. అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు
125. అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా
126. అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట
127. అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
128. అలిగిన ఆలు, తడిసిన మంచము బిగుసుకుంటవి
129. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
130. అల్పనరులకెల్ల నతివలపై చింత
131. అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద
132. అల్పుడికి ఐశ్వరం వస్తే అర్ధరాత్రి గొడుగు తీసుకుని రమ్మన్నాడుట
133. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
134. అల్లుడి ఆశా తీరింది .. అత్త అప్పూ తీరింది
135. అసలు అయిదు మూరలు చాలు కొసరు పది మూరలు కావాలన్నాడట.
136. అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి అట
137. అసలు లేని బావ కంటే గుడ్డి బావే మేలు
138. అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
139. అసలుకంటె కొసరే ముద్దు.
140. అసలుకే ఎసరు పెట్టినట్లు
141. అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు
142.  అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
143. ఆ తాను ముక్కే
144. ఆ తానులో గుడ్డే
145. ఆ మొద్దు లోదే ఈ పేడు
146. ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్లుంది
147. ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
148. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
149. ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
150. ఆకలేస్తే రోకలి మింగు..అరగక పోతే తిరగలి మింగు
151. ఆకారపుష్టి నైవేద్యనష్టి
152. ఆకాశానికి హద్దే లేదు
153. ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
154. ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
155. ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
156. ఆడదాని వయసు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు
157. ఆడది అనుకుంటే గడపకు తెలియకుండా దాటుతుంది
158. ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడు
159. ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
160. ఆడబోయిన తీర్థమెదురైనట్లు
161. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
162. ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు
163. ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
164. ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు
165. ఆత్రగాడికి బుద్ది మట్టం
166. ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
167. ఆదిలోనే హంసపాదు
168. ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు
169. ఆపదలో మొక్కులు, సంపదలో మరపులు
170. ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
171. ఆమరకా ఈమరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
172. ఆయనే ఉంటే మంగలి ఎందుకు?
173. ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే
174. ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
175. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
176. ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు
177. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
178. ఆరేసుకోబోయి పారేసుకున్నట్టు
179. ఆరోగ్యమే మహాభాగ్యం
180. ఆలస్యం అమృతం విషం
181. ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
182. ఆలి మరు కవాటం, ఇల్లు ఇరు కవాటం
183. ఆలి శుచి ఇల్లు చెపుతుంది
184. ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
185. ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే, చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
186. ఆలూ మగల కలహం ఆకు వక్క నమిలినంత సేపే
187. ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
188. ఆలూలేదూ చూలూలేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్ ( ఇది లేటెస్టు సామెత)
189. ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు
190. ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలబడలేదు
191. ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా ?
192. ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు
193. ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
194. ఆవు తొలిచూలు, గేదె మలిచూలు
195. ఆవు నలుపైతే పాలు నలుపా?
196. ఆవు పాలు అరవై ఆరు పిండి వంటలతో సమానము.
197. ఆవు పాలు అరవై ఆరు పిండి వంటలతో సమానము.
198. ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నాయి
199. ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
200. ఆవునిచ్చి పలుపుతాడు దాచినట్లు
201. ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు
202. ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు
203. ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
204. ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు
205. ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి
206. ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
207. ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
208. ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు
209. ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు
210. ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు
211. ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
212. ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు
213. ఆశకి అంతం లేదు
214. ఆశకు దరిద్రానికి లంకె
215. ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు
216. ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
217. ఆశగా దోసెలేసుకుంటె అల్లుడొచ్చి లాక్కుతిన్నాడట.
218. ఆస్తి మూరెడు ఆశ బారెడు
219. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
220. ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు
221. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
222. ఇంటి పేరూ కస్తూరి వారు ఇంటినిండా గబ్బిలాల కంపు.
223. ఇంటికన్నా గుడి పదిలం
224. ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
225. ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు
226. ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన
227. ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు
228. ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట
229. ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది
230. ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు
231. ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు
232. ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు
233. ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే
234. ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు
235. ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు
236. ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు
237. ఇంటెద్దుకు బాడిగలేదు
238. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
239. ఇంట్లో మొగుడు కొడితే వీధిలో మాధాకవళంవాడు కొడతాడు
240. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
241. ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు
242. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
243. ఇంతోటి పెళ్ళికీ ఈ ఒక్క మొగుడేనా
244. ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు
245. ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు
246. ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి
247. ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు
248. ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట
249. ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి
250. ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి
251. ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత
252. ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం
253. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం
254. ఇద్దరు ముద్దు, ఆపై వద్దు
255. ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
256. ఇరుగు ఇంగలం,పొరుగు మంగలం.
257. ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు
258. ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు
259. ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
260. ఇల్లలకగానే పండగకాదు
261. ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
262. ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
263. ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
264. ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి
265. ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు
266. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చూరులో చుట్ట కాలి ఇంకోడు ఏడ్చాడుట
267. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
268. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
269. ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు
270. ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
271. ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం
272. ఇవాళ వచ్చి, రేపు వెళ్ళి (ఒరియా సామెత)
273. ఇవాళ వచ్చి, రేపు వెళ్ళి (ఒరియా సామెత)
274. ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
275. ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?
276. ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం
277. ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
278. ఇసుకతో తాడు పేమి(/ని)నట్లు
279. ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట
280. 'ఇ'(ఇవ్వు) అన్నది ఈ ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది
281. ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
282. ఈ ఊరుకి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరు నుంచి ఈ ఊరు అంతే దూరం
283. ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు) , దాతలెవరంటే చాకళ్ళు
284. ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, అయితే ఈ చేను ఆ చేను బీడు
285. ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట
286. ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
287. ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు
288. ఈ మొహానికా సేరు పసుపు?
289. ఈ మొహానికా సేరు పసుపు?
290. ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం?
291. ఈకలు లేవుగానీ, వింజమూరి పుంజే
292. ఈకెలు తోకలు దులిపి, నూకలలో కలిపినట్లు
293. ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు
294. ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది
295. ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు
296. ఈడు చూసి పిల్లనివ్వాలి, పిడి చూసి కొడవలి కొనాలి
297. ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ
298. ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు
299. ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాక్కున్నట్టు
300. ఈత చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు
301. ఈతకు మించిన లోతు లేదు
302. ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి
303. ఈతవచ్చిన వానికే జలగండం
304. ఈనగాచి నక్కలపాలు చేసినట్లు
305. ఈనాడు ఇంటిలో, రేపు మంటిలో
306. ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి
307. ఈనిన పులికి ఆకలెక్కువ
308. ఈపిలేని చోట పేలు వెతికినట్లు
309. ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది
310. ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది
311. ఈవేళ చస్తే రేపటికి రెండు
312. ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు
313. ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు
314. ఉంటే అమీరు లేదా పకీరు
315. ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
316. ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
317. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
318. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు
319. ఉన్న మాటంటే ఉలుకెక్కువ
320. ఉన్న లోభి కంటే లేని దాత నయం
321. ఉన్న శాంతం ఊడ్చుకుపోయింది గానీ కోపమే లేదు
322. ఉన్నదాన్ని వదిలి లేనిదానికోసం వెదుకులాడినట్లు
323. ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టె
324. ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినవాడు కాటికి పెద్ద
325. ఉన్నవాడు ఖర్చు పెట్టకపోతే అంటారు, లేనివాడు ఖర్చు పెడితే అంటారు
326. ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోయినట్లు
327. ఉపాయం ఉన్నవాడు ఊరిమీద పడి బ్రతుకుతాడు
328. ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడట
329. ఉపాయం లేని వాడు, ఉపవాసంతో చచ్చాడు
330. ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదు
331. ఉప్పు పులుసు కారము తినే శరీరానికి ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది కామము
332. ఉప్పుతినకురా..అప్పులపాలు కాకురా..
333. ఉప్పుతిన్న వాడు నీరు తాగక తప్పదు
334. ఉప్పువాడూ ఏడ్చి పప్పువాడూ ఏడిస్తే కొబ్బరి బొండాలవాడు పొర్లి పొర్లి ఏడ్చేడుట.
335. ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలి
336. ఉయ్యాల్లో పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
337. ఉరిమిన మబ్బు తరిమిన పాము ఊరకే పోవు
338. ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
339. ఉలిపికట్టెకేలరా ఊళ్ళో పెత్తనాలు?
340. ఊక ఊకే నూక నూకే!
341. ఊక ఊకే నూక నూకే!
342. ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
343. ఊపిరి పట్టితే బొజ్జ నిండునా?
344. ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
345. ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
346. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట
347. ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టుకోను చోటులేదు
348. ఊరకున్న దేవుడికి ఉపారాధన లెట్లు వస్తాయి?
349. ఊరికళ గోడలే తెలుపుతాయి
350. ఊరు ఉసిరికాయంత, తగవు తాటికాయంత
351. ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
352. ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
353. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
354. ఊరున్నది, చిప్ప ఉన్నది, నాకేంతక్కువ అన్నట్లు
355. ఊరుమాసినా పేరు మాయదు
356. ఊరులేక పొలిమేర ఉండునా?
357. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
358. ఊళ్ళోవాళ్ళ ఉసురోసుకొని, నూరేండ్లు బ్రతకమన్నట్లు
359. ఊహలు ఊళ్ళేలుతుంటె, ఖర్మం కట్టెలు మోయిస్తున్నది
360. ఋణము, రణము ఒకటే
361. ఋణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచరాదు
362. ఋణానుబంధ రూపేణా,పశు పత్ని ఇత్యాదులు
363. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
364. ఎంగిలాకులు ఎత్తమంటే, వచ్చినవాళ్ళను లెక్కపెట్టినాడట
365. ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
366. ఎంత చెట్టుకి అంత గాలి
367. ఎంత తిన్నా పరగడుపే
368. ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు
369. ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే
370. ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక
371. ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే
372. ఎంత ప్రాప్తో అంత ఫలం
373. ఎంత సంపదో అంత ఆపద
374. ఎంతవారలైనా కాంత దాసులే
375. ఎక్కడ వేసిన గొంగళి (/గొంగడి) అక్కడే ఉన్నట్లు.
376. ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది
377. ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు
378. ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు
379. ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
380. ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
381. ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు
382. ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు
383. ఎగిరెగిరి దంచినా అంతేకూలి, ఎగరక దంచినా అంతేకూలి
384. ఎగిరే గాలిపటం వేలికి తగిలిందంట
385. ఎగిరే పిట్టకి మసాలా నూరినట్టు...
386. ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
387. ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
388. ఎత్తు పీట వేయడము
389. ఎదుట లేకుంటే ఎదలో ఉండదు
390. ఎదురుగా వస్తున్నందుకే ఏడుస్తూ ఉంటే ఎత్తుకోమని మొత్తుకున్నట్లు ఉంది.
391. ఎదురుగుండా ఉన్నవాడే పెళ్ళికొడుకూ అందిట
392. ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
393. ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
394. ఎద్దు పుండు కాకికి ముద్దు
395. ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
396. ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
397. ఎద్దురా అంటే గిద్దెడు చాలన్నాట్ట
398. ఎన్ని గులాబీలో అన్ని ముళ్ళు
399. ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి తన పట్టు వదలదు
400. ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
401. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
402. ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు
403. ఎవరికి వారే యమునా తీరే
404. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు
405. ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
406. ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
407. ఏ బాధ లేని వాడికి అన్నం తింటమే ఒక బాధ
408. ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
409. ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
410. ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
411. ఏడుస్తూ వ్యవసాయం చేస్తె తాళ్ళు మోకులు దొంగ లెత్తుకెళ్ళారుట
412. ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
413. ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
414. ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
415. ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
416. ఏనుగు మీద దోమ వాలినట్లు
417. ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
418. ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
419. ఏమండీ కరణంగారూ...? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట
420. ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది
421. ఏరు దాటి తెప్ప కాల్చే రకం
422. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
423. ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య
424. ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు
425. ఐరావతమంత మనిషే కానీ, ఆవగింజంత మనసు లేదు
426. ఐశ్వర్యానికి అంతము లేదు
427. ఒక దెబ్బకు రెండు పిట్టలు
428. ఒక సెల్ కు రెండు సిమ్ములు
429. ఒకరికి పుట్టే, ఇద్దరికి పుట్టే, అర్ధరాత్రివేళ అందరికీ పుట్టే
430. ఒడ్డున కూర్చొని గడ్డలు వేసేవాడికి ఏం తెలుసు ఈదే వాడి బాధ
431. ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
432. ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
433. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
434. ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
435. ఓర్చినమ్మకు తేట నీరు
436. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
437. అంగట్లో అరువు తలమీద బరువు
438. అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు
439. అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
440. అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
441. అంచు డాబే కాని, పంచె డాబు లేదు
442. అంచు డాబే గానీ పంచె డాబు గాదు
443. అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
444. అంటు, సొంటు లేని మేనమామ కొడుకు పొగడ చెట్టు కింద కూర్చుని పక్కలెగరేసాడట
445. అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
446. అంత పెద్ద పుస్తకం చంకలో ఉంటే, పంచాంగం చెప్పలేవా అన్నాట్ట.
447. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
448. అంతా అయినోళ్ళేగానీ అన్నం పెడతానని ఒక్కరూ అనరు
449. అంతా మనమంచికే.
450. అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు
451. అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
452. అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
453. అందని ద్రాక్ష పుల్లన
454. అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
455. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
456. అందరూ అంటారని ఆపసోపాలు పడ్డట్టు
457. అందరూ శ్రీవైష్ణవులే- బుట్టలో చేపలన్నీ మాయం.
458. అందితే జుట్టు అందకపోతే కాళ్లు
459. అందితే తల, అందకపోతే కాళ్లు
460. అంధుడికి అద్దం చూపించినట్లు
461. అంధుని ముందు అందాలు ఒలకబోసినట్లు
462. అంబలి ఏరై వస్తోంది అత్తా అంటే కొలబుర్ర చేతిలోనే ఉంది కోడలా అందిట.
463. అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకడు
464. అంబలి త్రాగేవాడికి మీసాలొత్తేవాడొక
465. కంగారులో హడావుడి అన్నట్లు
466. కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
467. కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
468. కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందట
469. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
470. కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
471. కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
472. కంటికి రెప్ప కాలికి చెప్పు
473. కంటికి రెప్ప దూరమా
474. కండలేని వానికే గండం
475. కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
476. కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
477. కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
478. కంపలో పడ్డ గొడ్డు వలె
479. కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
480. కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు
481. కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
482. కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
483. కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
484. కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
485. కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
486. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
487. కడుపు తీపి, కన్న కడుపు తీయ దనము, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూచుట
488. కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
489. కణత తలగడ కాదు. కల నిజం కాదు
490. కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు
491. కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
492. కన్నొక్కటి లేదు గాని,కంతుడు కాడే?!
493. కన్య,కీర్తి,కనకం ఇవే మగవాడి వెంట పడాలి కానీ,మగవాడు వీటి వెంట పడకూడదు
494. కబళే కబళే, గోవిందా!
495. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
496. కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
497. కలసి ఉంటే కలదు సుఖం
498. కలిపి కొట్టరా!కావేటి రంగా!
499. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
500. కల్లు త్రాగిన కోతిలా
501. కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
502. కష్టే ఫలీ
503. కాకి కావ్ మంటే - కాంతుని కౌగిలించుకున్నట్లు.
504. కాకి పిల్ల కాకికి ముద్దు
505. కాకిని తెచ్చి పంజరములో ఉంచితే చిలకవలె పలుకునా ?
506. కాకిముక్కుకి దొండపండు
507. కాకిలా కలకాలం ఉండేకంటే, హంసలా కొద్దికాలమున్నా మేలు
508. కాగల కార్యం గంధర్వులే తీర్చారు
509. కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
510. కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
511. కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
512. కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
513. కాలు కాలిన పిల్లిలా
514. కాలు జారితె తీసుకోగలము కాని, నోరు జారితె తీసుకోలేము
515. కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
516. కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
517. కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
518. కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
519. కుక్క కాటుకి చెప్పు దెబ్బ
520. కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
521. కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
522. కుక్కతోక వంకరన్నట్లు...!
523. కుట్టేవాడికి కుడి వైపు....చీదే వాడికి ఎడమవైపు ఉండొద్దన్నారు...
524. కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
525. కుమ్మర వీధిలో కుండలు అమ్మినట్లు
526. కూచమ్మ కూడబెట్టింది మాచమ్మ మాయం చేసింది
527. కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
528. కూనను పెంచితే గండై కరవ వచ్చినట్లు
529. కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
530. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
531. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
532. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు
533. కొండపైకి కట్టెపుల్లలు మోసుకెళ్లినట్లు
534. కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
535. కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
536. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి
537. కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
538. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
539. కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
540. కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
541. కోటి విద్యలు కూటి కోసమే
542. కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
543. కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
544. కోతిగంతులు...సాయిబు వసూళ్ళు
545. కోతీ కోతీ ఎందుకు పుట్టావ్ అంటే చక్కనోడిని వెక్కిరించడానికి అని చెప్పిందంట!
546. కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
547. కోస్తే తెగదు కొడితే పగలదు
548. క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
549. 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి పుట్టే' అందిట.
550. గంగిగోవు పాలు గరిటడైన చాలు
551. గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
552. గంతకు తగ్గ బొంత
553. గంతలు కట్టి,(= కట్టుకుని ) సూర్య నమస్కారములు అన్నట్లుగా.
554. గచ్చకాయలకు తెచ్చిన గుర్రము అగడ్తదాటునా?
555. గజ ఈతగాడు గెడ్డలో పడి చచ్చాడట
556. గట్టు దాటే దాకా ఓడ మల్లన్న...గట్టు దాటాక బోడి మల్లన్న
557. గతి లేనమ్మకు గంజే పానకము
558. గాజుల బేరం భోజనానికి సరి
559. గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
560. గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
561. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
562. గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
563. గుంపులో గోవిందా
564. గుంభనం గునపంలాంటిది, బయటే వాడుకోవాలి, కడుపులో ఉంటే పోట్లు పొడుస్తుంది.
565. గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్లు
566. గుడిలో పిత్తకుండా ఉంటే నైవేద్యం పెట్టినంత ఫలితం
567. గుడ్డి కన్నా మెల్ల నయము కదా
568. గుడ్డి గుఱ్ఱానికి పళ్ళు తోముట
569. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
570. గుడ్డెద్దు చేలో పడినట్లు
571. గుడ్డోడికి కుంటోడి సాయం
572. గుడ్ల మీద కోడిపెట్టలా
573. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
574. గురివింద గింజ తన నలుపెరగదంట
575. గురువుకి పంగనామాలు పెట్టినట్లు
576. గురువుని మించిన శిష్యుడిలా
577. గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
578. గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
579. గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
580. గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
581. గూటిలో కప్ప పీకితే రాదు
582. గొడ్డు గోతిలో పడితే తలొక బెడ్డా విసిరినట్లు
583. గోటితో పోయేదానికి గొడ్డలి వాడినట్లు
584. గోడకి చెవులుంటాయ్
585. గోడకేసిన సున్నం
586. గోతి కాడ నక్కలా
587. గోరంత ఆలస్యం కొండొంత నష్టం
588. గోరుచుట్టు మీద రోకలిపోటు
589. ఘంటా కర్ణుని వద్ద శంఖము ఊదినట్లు.
590. ఘట కుటీ ప్రభాతము
591. ఘటం చింద్యాత్, పటం చింద్యాత్
592. ఘడియ తీరిక లేదు గవ్వ ఆమ్దానీ లేదు
593. చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
594. చక్కనమ్మ చిక్కినా అందమే
595. చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
596. చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు
597. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
598. చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
599. చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
600. చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
601. చద్దికంటె ఊరగాయ ఘనం
602. చనిపోయిన వారి కళ్ళు చారెడు
603. చల్లకొచ్చి ముంత దాచినట్లు
604. చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
605. చాప క్రింది నీరులా
606. చారలపాపడికి దూదంటి కుచ్చు
607. చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
608. చింత చచ్చినా పులుపు చావనట్టు
609. చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన
610. చిత్తశుద్ది లేని శివపూజలేల
611. చిన్న వాళ్ళు తింటే చిరుతిండి, పెద్దవాళ్ళు తింటే పలహారం
612. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
613. చిలికి చిలికి గాలి వాన అయినట్లు
614. చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
615. చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
616. చూరు క్రింద నీరు త్రాగి, చల్ల త్రాగామని చెప్పినట్లు
617. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
618. చెట్టు మీద పిట్టవాలె పిట్టవాలితే పట్టుకొంటే పట్టుకొంటే గిచ్చుపెట్టే గిచ్చుపెడితే విడిచిపెడితి
619. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
620. చెప్పుతినే కుక్క చెరకు తీపి ఎరుగునా
621. చెప్పేవాడికి వినేవాడు లోకువ
622. చెప్పేవి నీతులు - తీసేవి గోతులు
623. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
624. చెముడా అంటే మొగుడా అన్నట్టు
625. చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు
626. చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
627. చెవిటి పెద్దమ్మా చాంతాడేది ? అంటే మా పుట్టిల్లు బెజవాడ అందిట !
628. చెవిటి ప్రియురాలికి ఆశుకవిత్వం చెప్పినట్లుంది
629. చెవిటోడి పెళ్ళికి మూగోడి కచేరీ
630. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
631. చెవిలో జోరీగ
632. చేతకాక మంగళవారమన్నాడంట
633. చేతకాని వాడు వేటకెళ్తే....పిట్ట బ్యాక్ చూపిందట
634. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
635. చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
636. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ
637. చేసేవి శివ పూజలు, చెప్పేవి అబద్దాలు.
638. చొప్పదంటు ప్రశ్న
639. ఛాయా, తోయం, వసన మశనం
640. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
641. జన్మకో శివరాత్రి అన్నట్లు
642. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
643. జరిగినమ్మ జల్లెడు తోనైనా నీళ్ళు తెస్తుంది
644. జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
645. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి
646. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి, కంటికో చూపు
647. జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
648. జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు
649. జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
650. జోడు గుఱాలపై స్వారీ చేసినట్లు.
651. జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
652. టోపీ పెట్టుకుని తోటలోకి వెళుతుంటే, తాటి ఇచ్చి అడుక్కోమన్నారు ఊరిలో జనం
653. డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
654. డబ్బు కోసం గడ్డి తినే రకం
655. డబ్బుకు లోకం దాసోహం
656. డబ్బూ పోయే శనీ పట్టే
657. డబ్బే దైవము.
658. డౌలు డస్తు పగలు పస్తు
659. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
660. తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
661. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
662. తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
663. తడి గుడ్డతో గొంతు కొయ్యడం
664. తన సొమ్ము అల్లం, పెరవారి సొమ్ము బెల్లం
665. తన సొమ్ము కాసుబెట్టడు కానీ పరులసొమ్ము హరింప (కాజేయ) బ్రహ్మకాయ
666. తనకి తింటానికి తిండి లేకపోతే ముండ వచ్చి మటన్ బిర్యాని అడిగిందంట
667. తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
668. తనవాసి తప్పితే తన వన్నె తరుగుతుంది
669. తనువు తాను కాదనువానికి తపసుచేయనేల?
670. తనువు వెళ్ళినా దినము వెళ్ళదు
671. తన్నితే తల పగులుతుంది, కొడితే కొప్పెర పగలాలి అంటాడు
672. తన్ను తప్పించి, ఆకాశమంత పిడుగు పడమన్నట్లు
673. తన్నుగట్ట తాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు
674. తన్నే కాలికి రోకలి అడ్డమైనట్లు
675. తపము పండినమీద జడలు తాల్చడమెందుకు?
676. తప్పతాగి కులము మఱచినట్లు
677. తప్పించబోయి తగిలించుకొన్నట్లు
678. తప్పు చేసినవానికి అప్పు చేసిన వానికి ముఖం చెల్లదు
679. తప్పుడు దండుగకు తలో యింత
680. తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు
681. తప్పూ ఒప్పూ దైవమెఱుగును, పప్పూ కూడూ బాపడెరుగును
682. తప్పెటకొట్టిన వాడు దాసరి, శంఖమూదినవాడు జంగము
683. తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రువులగుట
684. తమ వంశగౌరవాన్ని గుర్తుంచుకొననివి గాడిదలు మాత్రమే
685. తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
686. తరి పట్టిన కఱ్ఱ, చెరపట్తిన కుఱ్ఱ
687. తల ఊపినందుకు తంబూరా బుఱ్ఱ ఇచ్చిపొమ్మన్నట్లు
688. తల ప్రాణం తోకకి వచ్చినట్లు
689. తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
690. తలంత బలగమే కానీ తలలో పెట్టువారు లేరు
691. తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
692. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
693. తా వలచినది రంభ, తా మునిగింది గంగ
694. తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
695. తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
696. తాటాకు చప్పుళ్ళకు కుండేళ్ళూ బెదరునా?
697. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
698. తాటిచెట్టు ఎక్కలేవు, తాటిగెల కోయాలేవు తాతా నీకెందుకోయ్ పెండ్లాము
699. తాటిపండు తింటావా తలకొట్టుకుంటావా
700. తాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రునికి గంజన్నము (గంజికూడు)
701. తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
702. తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
703. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
704. తాడినెక్కేవాడిని ఎంతదాకా ఎగసనదోత్తారు?
705. తాడుతెంచను ముహూర్తమెందుకు?
706. తాత తవ్విన చెరువని దూకుతారా?
707. తాతకు దగ్గులు నేర్పినట్టు
708. తాతదిన్న బొచ్చె తరతరా లుంతురా?
709. తాతపోతే బొంత నాది
710. తాదూర సందు లేదు, మెడకో డోలు
711. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు
712. తాను దూర సందు లేదు తలకో కిరీటమట
713. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
714. తామరాకు మీద నీటిబొట్టులా
715. తాళ్ళపాక వారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత
716. తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
717. తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయి
718. తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
719. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
720. తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
721. తిట్టను పోరా గాడిదా అన్నట్టు
722. తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
723. తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
724. తినకపోతే నీరసం...తింటే ఆయాసం...
725. తినగ తినగ వేము తియ్యగనుండు
726. తినబోతూ రుచులు అడిగినట్లు
727. తిన్నింటి వాసాలు లెక్కేయటం
728. తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
729. తిరిగేకాలు తిట్టేనోరు ఊరుకోవు
730. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
731. తీయగా తీయగా రాగం, మూల్గ గా మూల్గ గా రోగం
732. తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
733. తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
734. తెలిసే వరకూ బ్రహ్మవిద్య, తెలిశాక కూసువిద్య
735. తేలు కుట్టిన దొంగలా
736. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
737. తోక తెగిన కోతిలా
738. తోక ముడుచుట
739. తోచీ తోచనమ్మ తోడి కోడలి పుట్టింటికి వెళ్ళిందిట
740. తోటెమ్మ తొడకోసుకుంటే తాను మెడకోసుకుందిట
741. దంచినమ్మకు బొక్కిందే కూలిట
742. దండం దశగుణం భవేత్
743. దక్కేవి దక్కక మానదు... దక్కనివి ఎప్పటికీ దక్కవు
744. దప్పిక అయినపుడు బావి తవ్వటం మొదలెట్టినట్లు
745. దమ్మిడీ ముండకి యాగాణి క్షవరం
746. దయగల భార్య తలుపు దగ్గరకు వేసి తిడుతుంది
747. దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
748. దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొడతాడట
749. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
750. దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...
751. దాసుని తప్పు దండంతో సరి
752. దిగితేనేగాని లోతు తెలియదు
753. దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
754. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
755. దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
756. దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
757. దున్నపోతు మీద వానకురిసినట్లు
758. దురాశ దుఃఖానికి చేటు
759. దూకు దూకు మనేవాళ్ళు గాని, దూకే వాడు ఒక్కడూ లేడు
760. దూరపుకొ౦డలు నునుపు
761. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
762. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అన్నట్టు
763. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడు అన్నట్టు
764. దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే!
765. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు
766. దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
767. దొరికితే దొంగలు లేకుంటే దొరలు
768. ధరణికి గిరి భారమా?
769. ధర్మో రక్షతి రక్షితః
770. ధైర్యే సాహసే లక్ష్మి
771. నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
772. నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
773. నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
774. నలుగురితో నారాయణా
775. నల్లటి కుక్కకు నాలుగు చెవులు
776. నవ్విన నాప చేనే పండిందంత
777. నాగస్వరానికి లొంగని తాచు
778. నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
779. నిండా మునిగిన వానికి చలేంటి
780. నిండు కుండ తొణకదు
781. నిజం చెప్పులేసుకొనేలోగా అబద్ధం అవని చుట్టొస్తుంది
782. నిజం నిప్పులా౦టిది
783. నిజం నిలకడమీద తెలుస్తుంది
784. నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
785. నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
786. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
787. నిప్పులేనిదే పొగరాదు
788. నివురు గప్పిన నిప్పులా
789. నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
790. నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
791. నీచేతిమాత్ర వైకుంఠయాత్ర
792. నీటిలో జాడలు వెతికినట్టు
793. నీటిలో రాతలు రాసినట్లు
794. నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
795. నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
796. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
797. నూరు చిలుకల ఒకటే ముక్కు
798. నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
799. నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
800. నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
801. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
802. నేతిబీరలో నేతి చందంలా
803. నేల విడిచి సాము చేసినట్లు
804. నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
805. నోటికొచ్చిన మాట ముడ్డికొచ్చిన పిత్తు
806. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు
807. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
808. నోరుంటే తలకాస్తుంది
809. పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
810. పంచాంగం పోతే నక్షత్రాలు ఉండవా?
811. పంచామృతములో పాలి (=వాటా).
812. పండంటి కొడుకును కంటాను అంటే వద్దనే అత్తగారు ఉంటుందా అన్నట్టు
813. పండగ నాడు కూడా పాత మొగుడేనా?
814. పండిత పుత్ర పరమ శుంఠ
815. పండితపుత్రుడు... కానీ పండితుడే...
816. పందికేంతెలుసు పన్నీరు వాసన
817. పక్కలో బల్లెం
818. పగవాణ్ని పంచాంగం అడిగితె మధ్యాహ్నానికి మరణం అన్నాట్ట.
819. పచ్చి కంకులే పుల్లయ్యా అంటే రాలిన కాడికే గోవిందా అన్నాడట
820. పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టు
821. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడు
822. పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
823. పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
824. పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయ్
825. పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
826. పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
827. పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
828. పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
829. పాటిమీది గంగాలమ్మకి కూటిమీదే చింత
830. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
831. పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
832. పాలు, నీళ్ళలా కలిసిపోయారు
833. పావలా కోడికి ముప్పావలా దిష్టి
834. పిండి కొద్దీ రొట్టె
835. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
836. పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
837. పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
838. పిచ్చోడి చేతిలో రాయి
839. పిచ్చోడికి పింగే లోకం
840. పిల్ల నచ్చిందా అల్లుడూ అంటే...నువ్వే నచ్చావత్తా అన్నాడంట
841. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
842. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించ లేదనుకొందట
843. పిల్లికి బిచ్చం పెట్టనివాడు
844. పుండుకు పుల్ల మొగుడు
845. పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
846. పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
847. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
848. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
849. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
850. పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
851. పూచింది ఒకెత్తు,
852. కాచింది ఒక ఎత్తు.
853. పెట్టిన రోజు పెళ్ళి కూడు,పెట్టని రోజు పిండా కూడు
854. పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
855. పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
856. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
857. పెనం మీద పెసరట్టు...పొయ్యిలో పడ్డట్టు
858. పెరటి (పెఱటి)చెట్టు వైద్యానికి పనికి రాదు.
859. పెరుగుట విరుగుట కొరకే
860. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
861. పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
862. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
863. పేరు గొప్ప ఊరు దిబ్బ
864. పైన పటారం, లోన లొటారం
865. పొట్టోడికి పుట్టెడు బుద్దులు
866. పొద్దల్లా బారెడు నేసేను దివ్వె తెండి దిగనేస్తా అన్నట్టు
867. పొయ్యి దగ్గర పోలీసు
868. పొరుగింటి పుల్లకూర రుచి
869. పోచమ్మ పోగేస్తుంటే మాచమ్మ మాయం చేస్తున్నట్టు
870. పోతూ పోతూ అత్తా నీకొడుకు ఆకలిగొట్టువాడు సుమా అన్నట్లు
871. పోనిలే అని పాత చీర ఇస్తే ఇంటి వెనుకల కి వెల్లి మోరలేసిందంట
872. బట్ట తలకాయాకి పాపిట తియ్యమన్నట్లు
873. బట్టకి పెట్టినదీ బానిసకి పెట్టినదీ ఒకటి.
874. బడాయి బచ్చె కూడు లేక చచ్చె
875. బతకలేక బడి పంతులని
876. బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
877. బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
878. బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందట
879. బలవంతుడికి గడ్డిపరక కూడా ఆయుధమే
880. బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
881. బాల వాక్కు బ్రహ్మ వాక్కు
882. బావిలో కప్పకి లోకమేమి తెలుసు
883. బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ
884. బుగ్గ గిల్లి జోల పాడటం
885. బూడిదలో పోసిన పన్నీరు
886. బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
887. బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
888. బెల్లం చుట్టూ ఈగల్లా
889. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
890. బొండు మల్లెలు బోడి తలకెందుకు?
891. బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
892. బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు
893. బ్రహ్మ కైన తిరుగు రిమ్మ తెగులు
894. బ్రహ్మకైన తిరుగు రిమ్మ తెగులు
895. బ్రాహ్మణా భోజన ప్రియ
896. బ్రాహ్మణుడి నోరూ, ఏనుగు తొండమూ ఊరుకోవు
897. భక్తి మనదే! భుక్తి మనదే!
898. భక్తిలేని పూజ పత్రి చేటు
899. భాషలు వేరైనా భావమొక్కటే
900. భోజనానికి ముందు ఉండాలి, కొట్లాటలకు వెనుక ఉండాలి
901. మంగలిని చూసి గాడిద కుంటినట్లు
902. మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
903. మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
904. మంచోళ్ళకు మాటలతోనూ, మొండోళ్ళకు మొట్టికాయలతోనూ చెప్పాలి
905. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
906. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన
907. మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
908. మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
909. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
910. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
911. మహారాజా వారని మనవి చేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట!
912. మా ఇంటికొస్తే ఏమి తెస్తావ్...మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావ్..
913. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
914. మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
915. మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
916. మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
917. మాటలో చక్కెర,మనసులో కత్తెర
918. మాను పిల్లి అయినా, మట్టి పిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి(మార్జాలం).
919. మామగారు జానివాకర్ తాగితే అల్లుడుగారు చివాస్ రీగల్ తాగుతాడా?
920. మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
921. మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
922. మింగ లేక మంగళవారం అన్నాడట
923. మిన్ను కురవక చేను పండదు....కన్ను కురవక బ్రతుకు పండదు
924. ముంజేతి కంకణానికి అద్దమేల ?
925. ముందు నుయ్యి వెనుక గొయ్యి
926. ముందుంది ముసళ్ళ పండుగ
927. ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
928. ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
929. మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
930. ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
931. మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
932. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
933. మొండివాడు రాజు కన్నా బలవంతుడు
934. మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
935. మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
936. మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
937. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
938. మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
939. మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
940. మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
941. మొరిగే కుక్క కరవదు
942. మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
943. మోరెడు ముందుకు పోయి బారెడు వెనుకకి రాకూడదు
944. మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
945. మౌనం అర్ధాంగీకారం
946. యధార్ధవాదీ, బంధు విరోధీ
947. యెల్లమ్మను ఎంచనక్కరలేదు, పోలమ్మను పొగడనక్కరలేదు.
948. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
949. రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొత్తబుద్ది అవుతుంది
950. రాజుల సొమ్ము రాళ్ళ పాలు
951. రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
952. రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?
953. రాతి కుండని చూసి మట్టికుండ పారిపోయిందన్నట్టు
954. రానివారిని పిలవ వేడుక....బోడితల అంట వేడుక
955. రామాయణంలో భీముడెందుకు లేడు అన్నాడంట.
956. రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
957. రుచిమరిగిన పిల్లి ఉట్టిమీద కెగిరినట్లు
958. రూపాన అరిష్ఠి, గుణాన పాపిష్ఠి
959. రెంటికీ చెడిన రేవడి చందాన
960. రెక్కాడితే గానీ డొక్కాడదు
961. రెడ్డొచ్చె మొదలాడు
962. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
963. రొయ్యకు లేదా బారెడు మీసం...
964. రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
965. రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
966. రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
967. రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
968. రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
969. రోషం లేని మూతికి మీసమెందుకు?
970. రౌతు కొద్ది గుర్రం
971. రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
972. లంఖణం పరమౌషధం
973. లక్క వంటిది తల్లి, రాయి వంటి ( రాయంటి) కొడుకు
974. లేడికి లేచిందే పరుగు
975. లేని దాత కంటే ఉన్న లోభి నయం
976. లోకం పోకడ
977. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
978. వంక పెట్టనిదే వెన్నపూస కూడా కొనరు
979. వంకరటింకర పోతుంది పాము కాదు
980. వంగుతున్న కొద్దీ ఇంకా వంచాలని చూస్తారు
981. వచ్చే దాక ఆరాటం,వచ్చిన తరువాత పోరాటం!
982. వట్టలు గీరుకొన్నంత సుఖం, వైకుంఠంలో కూడా ఉండదు
983. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు
984. వత్తులు చెయ్యాలంటే ప్రత్తి కావాలి
985. వనిత,విత్తం,పుస్తకం పరహస్తం గతం గత:
986. వయసులో వున్న గాడిద కూడా అందంగా కనిపిస్తుందట
987. వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
988. వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
989. వస్తే కొండ పోతే వెంట్రుక
990. వాడికి సిగ్గు నరమే లేదు
991. వానరాకడ,ప్రాణం పోకడ ఎవరికి తెలుసు
992. విగ్రహపుష్టి నైవేద్యనష్టి
993. విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
994. విధం చెడి వీటివాడితోపోతే బ్రతుకంతా మద్దెల వాయించవలసి వచ్చింది
995. వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
996. వినేవాడు వెర్రోడైతే ఒంటె కూడా వేదం చెపుతుంది
997. వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
998. విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
999. వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు
1000. వేగం కన్నా ప్ర్రాణం మిన్న
1001. వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
1002. వేపకాయంత వెర్రి
1003. వేలుకు గోరడ్డం
1004. వేలెడంత వాడు వచ్చి, జానెడంత వాణ్ణి చూసి, "మూరెడంత వాళ్ళు ఉన్నారు లేవోస్!" అన్నాడట.
1005. వైద్యోనారాయణోహరి
1006. వ్రతం చెడ్డా ఫలితం దక్కింది
1007. శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
1008. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
1009. శతకోటి లింగాలలో బోడిలింగం
1010. శాఖా చంక్రమణం
1011. శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
1012. శాస్త్రుల వారింట పుట్టి, సోమయాజుల వారింట మెట్టి, లవణమంటే దూడ రేణమని (పేడని) ఎఱుగనా అన్నదిట.
1013. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
1014. శీలములేని సౌందర్యము తావిలేని పువ్వు వంటిది
1015. శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
1016. శూద్రుని పొట్ట తమలపాకుల కట్ట ఎప్పుడు తడుపుతు ఉండాలి
1017. శెట్టి సింగారించే సరికి పట్నం పాడైనట్లు..
1018. సంతులేని ఇల్లు చావడి కొట్టం
1019. సంతోషమే సగం బలం
1020. సంపదలో మరపులు ఆపదలో అరుపులు
1021. సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
1022. సకలం కుశలమే కానీ పైసలవసరం
1023. సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
1024. సత్రం భోజనం, మఠం నిద్ర
1025. సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
1026. సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
1027. సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
1028. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
1029. సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
1030. సవా శేరులో పావు శేరు కొసరినట్టు
1031. సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
1032. సింగడు అద్దంకి వెళ్లినట్టు
1033. సింగినాదం జీలకర్ర
1034. సిరికొద్దీ చిన్నెలూ, మొగుడుకొద్దీ వన్నెలూ
1035. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
1036. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
1037. సొమ్మొకడిది సోకొకడిది
1038. స్త్రీకి స్త్రీయె శత్రువు
1039. స్వర్గాని కెళ్ళినా సవతి పోరు తప్పదు
1040. హనుమంతుడి ముందా కుప్పిగంతులు?
1041. హనుమంతుడు... అందగాడు
1042. హరిశ్చద్రుడి నోట అబద్ధం రాదు, నా నోట నిజం రాదు.
1043. హేమా హేమీలే ఏట్లో కొట్టుకుపోయేరు, ఎంపలో దుంపా నీగతేంకాను
1044. క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్
1045. క్షణం చిత్తం, క్షణం పిత్తం
1046. క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదు

No comments:

Post a Comment