సున్ని ఉండలు పోషక పదార్ధాలు అధికంగా కల
మినుముల మరియు గోధుమల యొక్క మిశ్రమ మిఠాయిలు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ,
ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు.
తయారీ విధానం
తయారీ విధానం
- మినుములను మరియు గోధుమలను వేయించి,మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన బెల్లమును కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత నెయ్యి పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.
- సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే సంక్రాంతి కి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.
No comments:
Post a Comment