Monday, May 19, 2014

నీదైన ధర్మాన్ని వదులుకోకు

కష్టంలో ఉన్నప్పుడు చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. భౌతికంగా, అద్యాత్మికంగా ఇలా అనేకరకాలుగా సలహాలు ఇస్తారు. ఇందులో ఒక సంఘటన ఇది.

ఈ మధ్య కాలంలో ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే ఈ క్రిస్టియన్ మత ప్రచారకులు అనేకరకాలుగా గాలం వేసి వారి మతంలోకి మార్చేస్తున్నారు. ఒకప్పుడు నావరకు వచ్చింది.

నాకు చిన్నాప్పటి నుంచి ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తుంది అని నా నమ్మకం. ఊహించని కొన్ని ప్రమాదాలు ఊహకి అందని విధంగా తప్పిపోయాయి. కాని కష్టాలు మాత్రం ఎప్పుడు నాతోనే ఉండేవి. ఏపని చేసినా ఎదురే వచ్చేది. గుడికి వెళ్ళి మొక్కినా మార్పు వచ్చేది కాదు. కాని మనసులో మాత్రం ఒకటి అనుకునే వాడిని. నేను కోరిన కోరిక సరైనది కాదేమో, నేను వెళ్ళాల్సిన దారి ఇది కాదేమో అనుకునేవాడిని.కాని జనాలని చుస్తే సంపదనే ద్యేయం తప్ప ఇంకొకటి ఏమి లేదు అనే ధోరణి లో ఉండేవారు. నేను అదే నిజమేమో అనుకునేవాడిని. నా సాయిశాక్తుల ప్రయత్నలోపం లేకుండా పని చేసేవాడిని. కాని ఎన్ని సార్లు ప్రయత్నించినా అదే ఓటమి నన్ను పలకరించేది.

భాదపడ్డాను. నాకే ఎందుకిలా జరిగుతుంది అని ఎడ్చేవాడిని. కొన్ని సందర్భాల్లో దేవుడిమీద కూడా అలిగిన సంఘటనలు ఉన్నాయి. మళ్లి నీదగ్గరకి రాను అని శాపదాలు కూడా చేశాను. ఒక వారంలో మళ్లి వెళ్ళే వాడిని లెండి. అంత తొందరగా ఎవరిని వదిలేసుకోలేను. వెళ్లి క్షమాపణ చెప్పి నాకోరికలు మళ్లి చెప్పేవాడిని. అయన విని ఊరుకునెవాడు. అలా కాలం కలిసిరాని కష్టంలో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ నన్ను చర్చికి తీసుకెళ్ళాడు. అంతా మారిపోతుంది అన్నాడు. వెళ్లాను. అలానే ఉంది. ఇంకొకరు మసీదు కి వెళ్ళమన్నారు. వెళ్లాను. అయినా మారలేదు. కాని నాకు ఒక నమ్మకం,నన్ను ఏదో శక్తి ఎక్కడా కృంగిపోకుండా ముందుకు తీసుకెళుతుంది అని. కాని దాన్ని తెలుసుకోవడం ఎలా? ఎలా?అని అలోచించి, అసలు నేను ఎవరు? ఎందుకు వచ్చాను తెలియాలి. తెలుసుకోవాలి. ఎలా?చాలామందిని కలిశాను. ఏదేదో చెప్పేవారు. నచ్చేది కాదు. వెతికాను. వెతికాను. అప్పుడు మనసులో ఒక సందేహం ఉండేది. విష్ణువు, శివుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. వీరిలో ఎవరిని పట్టుకోవాలి? మళ్లి సందేహంలో పడిపోయా! విష్ణువు, శివుడు పురాణాల్లో నేనే సృష్టి మూలాధారం అన్నారు. మళ్లి శక్తి కూడా మూలాధారం అన్నారు. ఇంతమందిని తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు ఒకదారి కనపడింది. ''భగవద్గీత''! ఇది చదివితే కొంతవరకు సందేహం తీరింది కాని ఏదో ఒకమూల కొంచెం సందేహం ఉండేది. అసలు ''భగవద్గీత'' ఎక్కడ పుట్టింది. మహాభారతంలో పుట్టింది. దీన్ని వెతికాను. అప్పుడు దొరికింది.

ఒక ముని తన ఆశ్రమానికి కప్పు మీద ఆకులు వేయాలని నిర్ణయించి పడమర నుండి మొదలుపెట్టి 2 ఆకులు వేశాడు. ఇంతలో ఇంకొక ముని చూసి పడమర నుండి కాదు, దక్షిణం నుంచి మొదలు పెడితే మంచిది అన్నాడు. సరేనని దక్షిణంలో రెండు ఆకులు వేశాడు. ఈలోపు ఇంకొకరు వచ్చి దక్షిణం కాదు ఉత్తరం అన్నాడు. ఇంకొకరు వచ్చి ఇంకో సలహా ఇచ్చారు. ఇలా నలుగురు 4 సలహాలు ఇచ్చారు. ఈ ముని వారి మాటలు వినడం వల్ల నాలుగువైపులా అటు రెండు అటు రెండు వేయడంతో సమయానికి పూర్తి కాలేదు. ఈ లోపు పెద్ద గాలి వానా వచ్చి లోపల ఉన్న యజ్ఞ వస్తువులు, గ్రంధాలు తడిసిపోయాయి. ఆశ్రమం కూలిపోయింది.

             వీరి మాటలు వినకుండా ఈయన పని ఈయన చేసుకుని ఉంటే ఎ సమస్య వచ్చేది కాదు. నలుగురి మాటని వినడంతో సర్వం కోల్పోయాడు. అందుకే నీదైన ధర్మాన్ని నువ్వు వదులుకోకు.

దీనికి ఒక ఉదాహరణ. నేను ఒక వ్యాపారం చేయాలనీ నలుగురితో కుర్చుని మాట్లాడాను. సలహాలు తీసుకున్నాను. అందరూ బాగుంది చాలా బాగుంది అన్నారు. అవసరం ఐతే పెట్టుబడికి సిద్దం అన్నారు. ఈ వ్యాపారం బాగుంటుంది అని విషయం నాకు తెలుసు. నా స్థాయిలో కొంత పెట్టుబడి పెట్టి ప్రారంభించాను. కొంచెం ముందుకి తీసుకెళ్ళాను. కాని వెంటనే ఆర్దికమాన్యం వచ్చింది. సరే పెట్టుబడి పెడతానని ముందుకి వచ్చారు. కాని ముందు మాట్లాడిన మంచి ఇక్కడ లేదు. గొంతెమ్మ కోరికలు కోరారు. వాళ్ళు పెట్టె పెట్టుబడికి అడిగిన భాగానికి సంబంధం లేదు. కాని ఇక్కడ నేను తల వంచితే పూర్తిగా వంచడానికి సిద్దంగా ఉన్నారు. అత్మసాక్షికి భంగం కలిగించలేను కాబట్టి వదిలేసుకున్నాను. ఎవరిదారి వారిది అయ్యింది. కాని నేను నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఎవరిముందో చేతులు కట్టుకుని డబ్బులకోసం నిలబడే అవసరం లేదు కదా! అప్పుడే అనుకున్నాను, నాది కాదు అనుకుంటే జనాలు ఎందరైనా సలహాలు ఇస్తారు కాని వాళ్ళ వరకు వెళితే ఆలోచనలు తీవ్రంగా మార్చేస్తారు. కష్టంలో ఎదుటివాడి ముసుగు తొలగిపోతుంది అని. కాబట్టి నీదైన ధర్మాన్ని నువ్వు పాలించు.

No comments:

Post a Comment