Saturday, May 24, 2014

నీతి సూక్తి

1. దరిద్రం మిత్రులని పరీక్షిస్తుంది. 
2. అవకాశం అరుదుగా లభిస్తుంది. వివేకి ఎన్నడు దానిని వదులుకోడు.
3. అవకాశాలు నీకోసం ఆగవు. నీవే వాటిని చేజిక్కించుకోవాలి.
4. అప్పు - సంతోషంతో మొదలై, వివాదం - విషాదంతో ముగుస్తుంది.
5. ఆందోళన మనిషికి, మనసుకి అనారోగ్యాన్ని, భాదని ఇస్తుంది. 
6. ఉత్తములని గౌరవించడం, సేవకులని దయతలచడం, శత్రువులని సమయానికి అనుగుణంగా శిక్షించడం, క్షమించడం అభివృద్దికి ఆధారాలు. 
7. ఉన్న అవకాశాలని వాడుకోలేనివారు, ఎన్ని అవకాశాలు వచ్చినా వాయిదాలు వేస్తూనే ఉంటారు.
8. ప్రవర్తన అద్దం లాంటిది. అది మీ గుణాల్ని ఎదుటివారికి చూపిస్తుంది.
9. బంగారం నాణ్యత కొలిమిలో కాల్చితే బయటపడుతుంది. మనిషిలోని గుణాలు కష్టంలో ఉన్నపుడు బయటపడతాయి.
10. మధుర వాక్కు కోపాన్ని చల్లబరుస్తుంది. కటిన వాక్కు రెచ్చగొడుతుంది.

No comments:

Post a Comment