Monday, May 19, 2014

కష్టం వచ్చిందని ఎప్పుడూ అధైర్యపడకండి

కష్టం వచ్చిందని ఎప్పుడూ అధైర్యపడకండి. ఎందుకంటే మీరు లోకాన్ని చూడగలిగేది అప్పుడే. ఎవరు ఎలాంటి వారో నిర్ణయించేది ఆ సమయంలోనే. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలుసుకోవచ్చు. అలానే సంపదలేనప్పుడు ఎలా ఉండాలి? కాలం కలసిరానప్పుడు ఎవరితో ఎలా ఉండాలి. అనేది కూడా మీకు ఆ సమయంలోనే తెలుస్తుంది.
అన్నీ ఉన్నప్పుడు, అన్నీ కలిసి వస్తున్నప్పుడు నేను గొప్ప అని ఎవరైనా చెప్పగలరు. కాని కష్టం వస్తే మాత్రం క్రుంగిపొకుండా నిలబడేవాడే గొప్పవాడు. వీడినే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు.

ఉదహరణకి నేను ఒక అమ్మయిని ఇష్టపడ్డాను. ఆలోచిస్తున్నా అంటుంది ఎప్పుడు అడిగినా! అలా కాదు అని గట్టిగా ప్రయత్నించాను. ఆ అమ్మాయి కూడా గట్టిగా తిట్టింది. నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పించి. అలాగని నేను బెంగపెట్టుకుని కూర్చుంటే నిత్యం మనం చేసే పని ఎవరు చేస్తారు. నా కార్యాలయం ఎవరు చూస్తారు? నన్ను అభిమానించే తల్లి, స్నేహితులని ఏమి చేయాలి? నేను ఇచ్చె సందేశాలు కోసం ఎదురు చూసే 30000 మందికి ఎవరు సందేశాలు ఇస్తారు? ఇవన్ని కాదు. అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలుసుకోకుండా అర్ధాంతరంగా అన్ని పనులు ఆపేసి బెంగ పెట్టుకుని కుర్చుని, లేకపోతె ప్రాణం తీసుకుంటే మళ్లి దిక్కుమాలిన జన్మ ఎత్తాలి. ఎప్పుడు కూడా ఎవరికోసమో జీవితాన్ని త్యాగం చేయకూడదు. అలాగని ఇష్టపడిన వారు ఏదో అన్నారని వదిలియనూకూడదు. కొంచం సమయం పట్టినా గెలుచుకోవాలి. నేను చేసే వ్యాపారం కూడా ఎత్తు పల్లాలు వస్తున్నాయి. అలాగని వ్యాపారం ఆపేయలేను కదా! అమ్మ అరిచింది, నాన్న కొట్టాడు, ఉపాద్యాయుడు మార్కులు తక్కువ వేశాడు, అమ్మాయి నా ప్రేమని కాదు అంది, వ్యాపారంలో నష్టపోయాను, స్నేహితుడు మోసం చేశాడు, ఇవన్ని మన మనస్సుకు చెప్పుకునే వంకలు, ఎదుటివారికి చెప్పే అబద్దాలు. ఏది నీ చేతిలోలేదు. ఈ నిజం గ్రహించు. అలాగే ఆదర్శంగా నిలబడాలి. కష్టం వచ్చినప్పుడే నీలో ఉన్న నిజమైన వ్యక్తీ బయటికి వస్తాడు.

తీసుకురావాలి కూడా! ఇలాంటి చిన్న విషయాలకే కలత చెందితే రేపటి రోజున ఏ సమస్యని ఎదుర్కోలేవు. ప్రతి విషయంలో పారిపోవడనికే ప్రాదాన్యం ఇవ్వాలి. ఎందుకంత ఖర్మ..! అలాగే వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, జీవితం అయినా ఇంకా ఏ సమస్యని అయిన ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి. నీ ధైర్యమే తరువాతి నీతరాలకి అందించే జ్ఞాన శక్తి. జ్ఞాన సంపద. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడండి.

No comments:

Post a Comment