Thursday, May 29, 2014

బొట్టు దుష్టశక్తులను, చెడును అడ్డుకుని మనలను కాపాడుతుందని ఒక నమ్మకం

“సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే” అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

నుదుటి మీద కనుబొమల నడుమ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆరవదైన అగ్నిచక్రం/ఆజ్ఞాచక్రం ఉంటుందట.అగ్ని తేజస్సుకు, జ్ఞానానికి చిహ్నం. ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారుచేసిన బొట్లు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలపుదేశాల్లో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది. నిలువు నామం అనేది“ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చిహ్నం”

సుమంగళి యొక్క ముత్తైదువతనానికి ఒక చిహ్నంగా నిలచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది 
పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు.

మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు

No comments:

Post a Comment