Monday, May 19, 2014

అభ్యుదయవాదం అంటే ఇదేనా?

ఈ కలికాలంలో మనం చెప్పే మాట అభ్యుదయం.. ఈ మాటని అడ్డుపెట్టుకొని ఎంత మంది ఎన్ని రకాలుగా పాడైపోతున్నారో కొన్ని చిన్న ఉదాహరణలు.. దయచేసి నన్ను అనకండి..
ఒక 2రోజుల క్రితం 85ఏళ్ళ వయస్సు ఉన్న పెద్దాయన వచ్చారు. చాల రోజులనుండి తెలుసు. అయన పేరు పూర్తిగా తెలిదు కాని రెడ్డి గారు అని పిలుస్తాను..
ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నిర్భయ విషయం ప్రస్థావనకి వచ్చింది. దోషులకి ఉరి వేయడం అందరు సమ్మతించారు. కాని ఆ వకీలు మాట్లాడిన మాట ''ఇలా అర్ధరాత్రి వరకు తిరిగే కూతురు నాకు ఉంటే ఉరి తీసి చంపుతాను'' అని అన్నాడు. ఈ మాటని జర్జీ గారు వెంటనే ఖండించారు. జనాలు కూడా కొందరు ఖండించారు. కొందరు మాత్రం కొందరేంటి చాలా మంది ఆ వఖీలు కి మద్దతు పలికారు. నేను కూడా.. ఇక్కడే ఒక సన్నివేశం వచ్చింది.
ఆ లాయరు అలా అనడం తప్పు. ఆ అమ్మాయి ఏమి చిన్న పిల్ల కాదు కదా. మేజర్ కనుక బాయ్ ఫ్రెండ్ తో తిరిగితే తప్పేంటి అన్నాడు. నేనేమో! అదేంటి అలా అంటారు. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వరకు రోడ్లమీద తిరగడం తప్పుకాదా? మీలాంటి వారు ఉండబట్టే అలా స్వేచ్చ పేరుతొ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం..
రెడ్డిగారు: నేను అభ్యుదయ భావాలు కలవాడిని. అభ్యుదయవాదిని. తప్పేముంది ఇందులో.
నేను : తప్పు లేదా?
రెడ్డిగారు: లేదు! కాలం మారింది. కాలంతో పాటు మనం మారాల్సిందే.
నేను : ఈ మాట నేను ఒప్పుకోను. కాలం కాదు మారింది. మనిషి ఆలోచన మారింది. స్వేచ్చ, అభ్యుదయం అనే ముసుగు వేసుకొని విచ్చలవిడి తనం ప్రదర్శిస్తున్నారు.
రెడ్డిగారు : నువ్వు ఇంకా 1940ల్లో ఉన్నట్టు ఉన్నావ్.
నేను : హహ్హహహ్హ, నేనా? 1940నా? సరే ఒక్క మాట చెప్పండి. మీకు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. వారు కూడా అభ్యుదయభావం పేరుతొ బాయ్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి వరకు తిరిగితే మీరు ఎం చేస్తారు? నాకు చెప్పనవసరం లేదు. ఆలోచించుకోండి.
రెడ్డిగారు: అదెలా కుదురుతుంది..
నేను : అంటే మీ కూతురు మేజర్ అయిన కాకపోయినా మీరు మాత్రం తిరగడానికి ఒప్పుకోరా? ఇదేనా అభ్యుదయం!
పేరు బాగుంది కదా అని అభ్యుదయం, స్వేచ్చ అనే పేర్లు వాడకండి రెడ్డిగారు. ఏ ఆడపిల్ల అయిన ఆడపిల్లే. ఎవ్వరి కూతురు అయినా కూతురే! ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు ఎలా పొతే నాకేంటి అంటే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు.
అభ్యుదయం, స్వేచ్చ అనే పేర్లకి అర్ధం కూడా తెలియకుండా వాడేయకండి. వీటికి లోతు ఎక్కువ. మునిగిపోతారు.
రెడ్డిగారు : ????????
నేను : ఇబ్బంది గా మాట్లాడితే క్షమించండి.. 10 మందికి చెప్పే వయస్సులో ఉన్నారు. చెప్పించుకునే వయస్సు కాదు.

ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అభ్యుదయవాదం అంటే ఇదేనా?

No comments:

Post a Comment