Tuesday, May 20, 2014

టైమ్‌కి భోజనం చేయకపోతే ఏమవుతుందో తెలుసా...?!!

సమయపాలనతో మూడుపూటలా చక్కగా భోజనం చేస్తే.. ఎలాంటి అనారోగ్యం తలెత్తదు. వాస్తవానికి ఈ గజిబిజి బ్రతుకుల ప్రపంచంలో ఇది పాటించడం కొంచె కష్టమే అయినా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా మన జీవితాన్ని గడిపేయవచ్చు. ఖాళీగా ఉన్నా లేదా పనిలో బిజీగా ఉన్నా సరే సమయానికి ఆహారం తీసుకోవం మర్చిపోకూడదు.

ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి మనమూ తెలుసుకుందాం. ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ (అసిడిటి) సమస్య పెరిగి, శరీర పటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అంతే కాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులు మనుషులపై ఏయే ప్రభావాలు చూపుతాయే ఒక్కసారి పరిశీలిద్దాం.

అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి తన సాధారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది. ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళలో రుతుక్రమానికి (పీరియడ్స్‌) సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

బలీమియా, బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది. కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.

ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది.

కొందరు యువతీయువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యు హెచ్చరిస్తున్నారు. ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి కడుపు నిండా భోంచేసి ఆరోగ్యాంగా ఉండండని సూచిస్తున్నారు.

అందరికి నమస్కారములు. మన పేజీ మరింత ముందుకు పోవాలంటే మన పేజీ గురించి దయచేసి మీ తోటివారికి తెలియచేయగలరు (లైక్ చెయ్యమని చెప్పగలరు) .. మీకోసం ఇంకా చాలా చాలా మంచి పోస్టింగ్స్ వేచివున్నాయి..

No comments:

Post a Comment