Monday, May 19, 2014

కలికాలంలో కలిపురుషుడు ఎక్కడ కూర్చుంటాడు?

కలికాలంలో కలిపురుషుడు ఎక్కడ కూర్చుంటాడు అంటే మనశాస్త్రాలన్నీ ఒక్కటే సమాధానం చెప్తుంది.
బుద్దిలో కూర్చుంటాడు. మీకు పిబ్రవరిలో "నలదమయంతుల చరిత్ర చెప్పాను. చాలామందికి గుర్తుండేవుంటుంది. కలిపురుషుడు మనలో ప్రవేశించడానికి కలికాలంలో ఉన్న అవకాశం ఏ కాలంలో (కృత, త్రేతా, ద్వాపర) లేదు. నలుడు బుద్దిలో ప్రవేశించడానికి పట్టిన సమయం దాదాపుగా 15సంవత్సరాలు. పెళ్ళయ్యి, ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటివరకు కూడా ఎంతో ఓపికతో ఎదురుచూశాడు. ఒకరోజు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా వచ్చేశాడు. ఈ చిన్న తప్పు అడవులపాలు చేసింది. దమయంతిని మధ్య దారిలో వదిలేసి వెళ్ళిపోయేలా బుద్దిని ప్రేరేపించాడు. కాని చివరి వరకు తనదైన ధర్మాన్ని వదలక నిత్య అగ్నిహోత్రాలు వ్రేల్చి, త్రిసంధ్యా వందనాలతో క్రమతప్పని వైదిక ధర్మాన్ని కాపాడాడు. చివరికి మంత్రశక్తి ద్వారా కలిపురుషుడుని బయటికి వెళ్ళేల చేశాడు. ఈయన పాటించిన ధర్మ నిష్టలకి భయపడి శపించోద్దని కాళ్ళ వెళ్ళా పడి వేడుకున్నాడు కలిపురుషుడు.
కలిపురుషుడు అన్నమాటలు ఏంటంటే!

      నీ భార్య పాతివ్రత్య మహిమ, ఆవిడ నీగురించి పడిన ఆవేదన, ఆవిడా చేసిన వ్రతాలు, నీ నియమ నిష్ఠలతో కూడిన ధర్మ పాలన, ఎన్ని కష్టాలు వచ్చిన చలించని నీ సంకల్పం నన్ను నీలో క్షణం కూడా ప్రశాంతంగా కుర్చోనివ్వలేదు. తగలబడి పోయానయ్యా, ఇప్పుడు నువ్వు తీసుకున్న మంత్ర విద్య మండే మంటలో ఆజ్యం పోయడం కాదు, గుమ్మరించినట్టు అయింది. తట్టుకోలేక బయటికి వచ్చేశాను. నన్ను పెద్దమనస్సు చేసుకుని క్షమించు అని వరాలు ఇచ్చి వెళ్ళాడు.

అంతటి నల చక్రవర్తినే వదలలేదు కలిపురుషుడు.
మనం లేవాలంటే బారెడు పోద్దేక్కాలి. స్నానం చేయాలంటే బద్ధకం. పాచి మొఖంతో మంచం మీదే టీలు, కాఫీలు త్రాగేయాలి. ఊరంతా తిరిగి, ఎక్కడబడితే అక్కడ మల, మూత్ర విసర్జన్ చేసి, కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా, ప్రపంచంలో నా అంట కష్టపడేవాడు లోకలో ఎక్కడా లేడన్నట్టు రావడం తినడం, పడుకోవడం. స్నానం సంగతి ఇక చెప్పే పనేలేదు. ఎవరైనా ఇలా చేయకూడదు అని చెప్తే "ఈరోజుల్లో ఇవన్ని ఏంటి?" అని వారిని వెటకారం చేసి అవమానించడం. క్షమాగుణం లేదు, ధర్మ బద్దమైన జీవితం అంతకంటే లేదు. ఎప్పుడూ పక్కనోడి ముచ్చట్లు వింటూ సైకో ఇజం ,ప్రదర్శించడం, అమ్మాయి కొంచం అందంగా ఉంటే చాలు. కులగోత్రాలు సంబంధం లేకుండా వెంటపడటం, పెద్దలని ఎదిరించి పెళ్ళిచేసుకోవడం, ఒంటరి కాపురం. సమస్య వస్తే విడిపోవడమే తప్ప పరిష్కారం ఆలోచించే దిశగా పొరబాటున కూడా ప్రయత్నం చేయరు. (ఇక్కడ తల్లిదండ్రులతో విడిపోయి మీరు ఏకాకులైతే, పక్కన ఉన్న స్నేహితుడు బుద్దిమంతుడు ఎలా ఉంటాడు? తల్లిదండ్రులతో విడిపోయి మీజంట కలవాలనే మీ అభిప్రాయాన్ని గౌరవించాడు, రేపు విడిపోవాలంటే ఎందుకు సర్దిచేపుతాడు. ఒకవేళ చెప్పిన వినాలనే కోరిక మీ ఇద్దరిలో ఉండదు. ఏదో ఒక వంక. విడిపోవడానికి ఒక్క వంకని కారణంగా చూపినవారు, సంవత్సరాల ప్రేమలో కలిసుండటానికి ఒక్క కారణం దొరకదా? దొరుకుతుంది. కాకపోతే మీ అలవాట్ల వలన మీ బుద్దిలో కుర్చున్నాడే "కలి" వీడు కలవనివ్వడు.) ఇలాంటివి మరేన్నో పనులు చేస్తూ ఉంటే మీరు ఎలా సుఖంగా జీవిస్తారు?

ఇందులో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. మన ఆచార, సంప్రదాయాలను ఏనాడైతే మనం వదిలేశామో! ఆనాడే కలి పురుషుడు మనిషి బుద్ధిలో కూర్చున్నాడు. ఇంతకుముందు యుగాలలో ఎక్కడో ఉండేవాడు. ఎక్కడున్నాడా? అని వెదకవలసి వచ్చేది. కాని ఇప్పుడు ఎక్కడ లేడు అని వెతుక్కున్నా దొరక్కుండా మాత్రం ఉండడు. ప్రతిచోటా ఉన్నాడు.

No comments:

Post a Comment