Friday, May 23, 2014

మామిడి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు:-

1.ఊరించే రంగుతో, కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే మామిడి పండు ఆరోగ్య ప్రదాయినే కాదు, సౌందర్య సంరక్షిణి కూడా. మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్‌ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడటం మాత్రం మర్చిపోవద్దు.

2.మూత్రపిండాలలో రాళ్ళున్నవారు ఒక గ్లాసు మామిడి పళ్ళ రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నెలలు తీసుకుంటే మూత్రపిండంలోని రాళ్ళు కరిగిపోయి,
ఇకపై రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇలా ప్రతిరోజూ సేవిస్తుంటే పూర్తి ఆరోగ్యంగా వుండటమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

3.మామిడి పండులో విటమిన్ ఏ అధికంగా ఉంది. ఇది రేచీకటి రాకుండా కాపాడుతుంది. కాగా ఇంకా కొన్ని దృష్టి లోపాలనుకూడా నివారిస్తుంది. అంతేగాకుండా కనుపాపలను తడిగావుంచి, కంటినుండి నీరు కారటం, కంటి మంట, దురదలు రాకుండా కాపాడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

4.తాజా మామిడి ఆకులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ప్రతిరోజూ తాగటంవల్ల డయాబెటీస్ (చక్కెర వ్యాధి)ని అరికట్టవచ్చు. స్త్రీలకు సంబంధించిన
అనేక సమస్యలకు కూడా ఈ మామిడి ఆకులను నానబెట్టిన నీటితో చక్కటి పరిష్కారం లభిస్తుంది.

5.పూర్తిగా పండని మామిడి పండును తినటంవల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇలాంటి పండును తినటంవల్ల శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి వల్ల ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలను రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment