Monday, May 19, 2014

మంత్రజపం ఎందుకు చేయాలి?

మననం చేయడం వలన కాపాడేది మంత్రం.. మనస్సుకు చాంచల్య స్వభావం(ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది) ఈ చెంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబందం వుంది.
      మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి. మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్దులు సిద్దిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్దులు కలుగుతాయని యోగాధర్శనం చెబుతుంది. ఎందఱో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్దులు సాధించారు. సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితెంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.  అంధకారం నుండి ప్రకాశం వైపుం మృత్యువు నుండి అమృతంవైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దిర్భుద్ది నుండి సద్బుద్ధి వైపు, కొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది.

       ఇందుకోసమే నేను నిత్యం జపించండి అని పదేపదే చెప్పడానికి కారణం. ఇకనైనా మీరు క్రమం తప్పకుండా నిత్యం మంత్రజపం చేయండి.. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సకల మనోరధాలు, సిద్దిస్తాయి..

No comments:

Post a Comment