Tuesday, May 20, 2014

రసజ్వలకు నక్షత్ర ఫలములు

రసజ్వలకు నక్షత్ర ఫలములు
అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.
భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు.
కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.
రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.
మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.
ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.
పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.
పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.
ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.
మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.
పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.
ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.
హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.
చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.
స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.
విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.
అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.
జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.
మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.
పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.
ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి
శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.
ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది.
శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.
పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.
ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.
రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది
శుభస్వప్నములు

ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒక భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.
సుశకునములు

మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు, ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభవస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్ధైక పశువు, మాంసము, శుభకార్యము వినుట, పుష్పములు చెరకు, పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు, తల గుడ్డలు, తెల్లగుడ్డలు, పుత్రసహిత స్త్రీ, అద్దము, రజకులు, మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ద్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.


No comments:

Post a Comment