Monday, May 19, 2014

విధి బలీయం

సత్యం, ధర్మం ఎప్పుడూ వాటి పని అవి చేసుకేళ్ళిపోతాయి. వాటిలో ఉన్న అంతః సూత్రాలు అర్ధం అయితే సమస్య అనేది రాదు. ఒకవేళ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతారు.

ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మీద పోరాటం చేస్తున్నారు కానీ సమస్య మూలాన్ని వదిలేస్తున్నారు. ఇది ఇంకో సమస్యల వలయంలోకి తోసేస్తుంది.

మహాభారతంలో ధర్మరాజు జూదంలో పంచ పాండవులతో సహా రాజ్యాన్ని పోగొట్టుకుని చివరికి భార్య అయిన ద్రౌపతిని కూడా జూదంలో ఒడ్డి ఓడిపోతాడు. ప్రస్తుత కాలమాన పరిస్థితులని బట్టి ధర్మరాజు తప్పుచేశాడు అని ముఖ్త కన్టంతో చెప్పేస్తారు. ఇలా ఆలోచించడం వల్ల కర్ణుడు, దుర్యోధనుడు మంచివారుగా కనిపిస్తున్నారు. అంటే మన ఆలోచనలు ఎంతగా కుదించుకుపోయాయో అర్ధం చేసుకోండి.
కాని ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మ లోతుల్ని అవగాహనా చేసుకోలేక విదురుడు, భీష్ముడు లాంటి వారు ఏమి చెప్పలేకపోయారు. ఇది ఒక కోణం.
ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. కలి పురుషుడి అంశలో దుర్యోధనుడు, దృతరాష్ట్రుడు, కర్ణుడు, ఇంకా 98 మంది కౌరవులు, ఇంకొంతమంది రాజులు, పుట్టారు. (100 మంది కౌరవులలో వికర్ణుడు ఒకడు.) జూదం ఆడే సమయంలో భీష్ముడిని, విదురుడిని కలి పురుషుడు (అధర్మం) వారి మనసు చుట్టూ ఆవరించి ఏమి మాట్లాడలేని స్థితిలో కూర్చోబెట్టాడు. వికర్ణుడు లేచి ద్రౌపతి అధర్మవిజిత అని చెప్తాడు. కాని కర్ణుడు ఒప్పుకోడు. ఇది ఒక కోణం.

ఇదిఒక కోణం.. ధర్మం నిలబడాలంటే అధర్మం పడిపోయాలి. ధర్మం అధర్మాన్ని ద్రౌపతి వస్త్రాపహరణం చేసేలా ప్రేరేపించి దుర్యోదన, దుశ్యాసనులని రెచ్చగొట్టేలా చేసింది. దాని ఫలితం నిండు సభలో భీముడు దుశ్యాసనుడిని అనిలో(యుద్ధంలో) రొమ్ము చీల్చి రక్తం తాగుతానని, దుర్యోధనుడు తొడలు విరిచి నేలకూలుస్తానని భీకర శశపధాలు చేశాడు. అంతటితో ధర్మం శాంతించలేదు. ఇలా ఐతే శాత్ర నిర్మూలనం పూర్తికాదని మళ్లి జూదానికి పిలిపించి 12ఏళ్ళు అరణ్యవాసం, 1ఏడు అజ్ఞాతవాసం చేసేలా చేసింది. ఎందుకంటే పాండవులకి ధర్మం మాత్రమే రక్షగా ఉంది. ఆయుధ సంపత్తిలేదు. దీంతో అడవులపాలైన పాండవులకి అన్నీ సమకూరాయి. కాని కౌరవులు కొత్తగా ఏమి సంపాదిన్చుకోక పోగా అనవసర ఆవేశకావేశాలకి పోయి పాండవులని చంపడానికి కుట్రలు పన్ని అవమానముల పాలయ్యారు. చివరికి తీసుకున్న గోతిలో పడి చచ్చిపోయారు.

ఇక అసలు కోణం: కృష్ణుడు ఆడిన జగన్నాటకంలో పాత్రలే వీరంతా! భూమిమీద అధర్మం పెరిగిందని భూదేవి విష్ణువుకి మొరపెట్టుకుంటే సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణావతారం ధరించి భూభారం తగ్గించడం కోసం భూమిపై జన్మించాడు. మహాభారత కథకి మూలం ఇది.
కాని మూలాన్ని ఆలోచించకుండా పైపైన చుస్తే మొదట చెప్పిన విధంగా ఉంటుంది, కొంచం లోతుకి వెళ్తే రెండో విధానం, ఇంకొంచం లోతుకి వెళ్తే కొంత స్పష్టత వస్తుంది. అసలు మూలాన్ని పరిశీలిస్తే విషయం మొత్తం అర్ధమయి సమస్యలు తొలగిపోతాయి.. కాబట్టి సమస్య ఏదైనా మూలాన్ని శోదించండి. కాలం ఎం చేసినా ఒక కారణం అనేది ఉంటుంది.

No comments:

Post a Comment