Monday, May 19, 2014

మనసుని అదుపులో ఉంచుకోవాలంటే ఏమి చేయాలి?

మనసుని అదుపులో ఉంచుకోవాలంటే ఏమి చేయాలి? ప్రత్యేకించి ఈ కలికాలంలో ఏమి చేస్తే ఉత్తమం?

ఈ కలికాలంలో శ్రీకృష్ణుడు కాని, వ్యాస భగవానుడు కాని, ఇతర ఋషులు, మనకి ఉన్న సద్గురువులు చెప్పేది ఒక్కటే!
నామ సంకీర్తనం ఒక్కటే మనసుని అదుపులో పెడుతుంది. రెండు రోజులో, 2 వారాలో చేసి అదుపులోకి రాలేదు అంటే కుదరదు. అదుపులోకి వచ్చేవరకు చేయాలి.

నామ సంకీర్తనం చేయడం వలన ఉపయోగం ఏమిటి?
మన చుట్టూ కొన్ని తరంగాలు ఉంటాయి. విచ్చలవిడిగా తిరిగేవారికి ఒక 4అంగుళాల దూరంలో ఉంటుంది. కొందరికి వంటిమీద ఉంటుంది. కొద్దోగొప్పో భక్తి ఉండి గుడులకి వెళ్లేవారికి ఒక మీటరు దూరం వరకు వ్యాపించి ఉంటుంది. నిత్య నామ సంకీర్తనం చేసేవారికి దాదాపుగా ఒక 5మీటర్ల దూరంవరకు వ్యాపించి ఉంటుంది. నామాసంకీర్తనంతో పాటు శుచి, శుబ్రత పాటిస్తూ నిరంతరం ధ్యానించేవారికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటుంది.

ఈ తరంగాల వలన ఏమిటి ఉపయోగం?
మీ చుట్టూ కొన్ని శక్తులు తిరుగుతూ వుంటాయి. మీరు ఆధ్యాత్మిక ధోరణి లేకుండా కేవలం పుట్టాం, పెరిగాం, సంపాదిస్తున్నాం, భార్య పిల్లలు ఉన్నారు. ఇక చాలు అనుకుంటూ బ్రతికేస్తే మీకు తెలియకుండా ఆ దుష్ట శక్తులన్నీ మీలో ప్రవేశిస్తాయి. వీటివలన ఎన్నో అనర్ధాలు చెలరేగుతాయి. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం!

కోపం వద్దు అనుకున్నా ముక్కుమేదే తాండవం చేస్తుంది, పిసినారితనం, పిల్లికి కూడా బిచ్చం వేయరు. జీవితంలో ఒకడి దగ్గర తీసుకోవడమే గాని పొరపాటున కూడా 1రూపాయి ఎదుటివారికి విదిల్చరు. ఒకవేళ ఇవ్వాలి అనుకున్నా ఇవ్వనివ్వదు మనస్సు. ఇద్దామని దగ్గరికి వెళతారు. కాని ఈలోపు 1000రకాల సమస్యలని సృష్టించి చూపిస్తుంది. దీనితో వెనక్కి తగ్గిపోతారు. నిరంతరం కోరికలతో పోరాటం చేస్తూనే ఉంటారు. ఒద్దన్నా వినదు. మగవారికి ఆడవాళ్ళమీద, ఆడవారికి మగవారిమీద విపరీత వ్యామోహం పుడుతుంది. ఎంతకైనా తెగిస్తారు. మంచి మానవత్వం మరుగున పడిపోతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఆస్తి మొత్తం వాళ్ళు తినేస్తారేమో అనే బ్రమ కలుగుతుంది. చదువుదామని పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది. వుద్యోగం చేసే చోట ఎంత బాగా పనిచేసిన చివాట్లె! భార్య చేతిలో భర్తకి, భర్త చేతిలో భార్యకి తిట్లు శాపనార్ధాలు, అవసరం అనుకుంటే కొట్టుకోవడం, ఏ ఇద్దరి మధ్యా అనుభంధం సరిగ్గా పొసగదు. ఒకరు పూజ చేస్తుంటే! ఇప్పుడెందుకు ఈ పూజలు పునస్కారాలు అని వ్యంగ ధోరణి, పురాణం కాని ధర్మ శాస్త్రాలు కాని చదివేవారిని చుస్తే వాళ్ళేదో తప్పుచేస్తున్నారు అనే అభిప్రాయానికి తీసుకెళతారు. వీరు చదవరు, చదివేవారిని చదవనివ్వరు. సంపద, స్త్రీ మీద ఆశక్తి పెరుగుతుంది. ఎప్పుడు ఎవరిని తప్పుపడధామ అని నిక్కి నిక్కి చూస్తారు. ఇలాంటివి ఇంకెన్నో!

ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తూ ఉంటే క్రమేపి మీ వలయం బలపడి చెడు దగ్గరికి చేరలేదు. మీరు మంచి స్నేహితులు అనుకున్నవారిలో ఏమైనా తరిగిపోని దోషాలు ఉంటే (మీరు మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవిన పెడితే) క్రమేపి దూరమై పోయి మీరు ఉత్తమమైన మార్గంలోకి వస్తారు. మీ చుట్టూ ఉన్న వలయ ప్రభావాన్ని బట్టి మీకు ఏ సమయంలో ఏమి జరగాలో, ఎవరు కలవాలో అన్ని మీరు ఉహించకుండానే జరిగిపోతాయి. మీ సమస్యలు తగ్గుముఖం పట్టి చుట్టూ ఉన్న చెడుప్రభావం పోయి మోక్ష మార్గంలోకి ప్రవేశిస్తారు.

No comments:

Post a Comment