Sunday, December 8, 2013

ఆహారశుద్ధి నియమం

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడదు, భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము, ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట.
మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము. శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెదిరతే దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను. సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.
“జంతూనాం నరజన్మ దుర్లభం”–అన్నారు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా– చెదారము తినేటి జంతువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,.. ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము. మనమూ అటువంటి ధర్మాన్ని పాటిద్దామా… ….

కౌరవులు - వారిపేర్లు

కౌరవులు
దుర్యోధన
దుశ్శాసన
దుస్సహ
దుశ్శల
జలగంధ
సామ
సహ
వింద
అనువింద
దుర్దర్శ
సుబాహు
దుష్ప్రదర్శన
దుర్మర్శన
దుర్ముఖ
దుష్కర్ణ
కర్ణ
వికర్ణ
శాల
సత్వ
సులోచన
చిత్ర
ఉపచిత్ర
చిత్రాక్ష
చారుచిత్ర
శరాసన
దుర్మద
దుర్విగాహ
వివిత్సు
వికటాసన
ఊర్ణనాభ
సునాభ
నంద
ఉపనంద
చిత్రభాను
చిత్రవర్మ
సువర్మ
దుర్విమోచ
అయోబాహు
మహాబాహు
చిత్రాంగ
చిత్రకుండల
భీమవేగ
భీమబల
బలాకి
బలవర్ధన
ఉగ్రాయుధ
సుసేన
కుండధార
మహోదర
చిత్రాయుధ
నిశాంగి
పాశి
బృందారక
దృఢవర్మ
దృడక్షత్ర
సోమకీర్తి
అనుదార
దృఢసంధ
జరాసంధ
సత్యసంధ
సదాసువాక్
ఉగ్రశ్రవస
ఉగ్రసేన
సేనాని
దుష్పరాజయ
అపరాజిత
కుండశాయి
విశాలాక్ష
దురాధర
దృఢహస్త
సుహస్త
వాతవేగ
సువర్చస
ఆదిత్యకేతు
బహ్వాశి
నాగదత్త
అగ్రయాయి
కవచి
క్రధన
భీమవిక్రమ
ధనుర్ధర
వీరబాహు
ఆలోలుప
అభయ
దృఢకర్మణ
దృఢరథాశ్రయ
అనాధృష్య
కుండాభేది
విరావి
చిత్రకుండల
ప్రమథ
అప్రమథ
దీర్ఘరోమ
వీర్యవంత
దీర్ఘబాహు
సువర్మ
కనకధ్వజ
కుండాశి
విరజ
యుయుత్సు
కౌరవుల ఏకైక సోదరి దుస్సల

పెళ్ళి-వివాహము

వివాహము అనగా పెండ్లి, పాణిగ్రహణము, కన్యాదానము, పరిణయము, కల్యాణము, సప్తపది అని పలు విధములుగా అర్ధములు ఉన్నవి.
  • జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది.

    వధువు

    • హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీసరస్వతిపార్వతి ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.

    వరుడు

    • త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.

    పెళ్ళి చూపులు

    • తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. సకుటుంబ సపరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని సంఘటన.
    • పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించు కుంటారు

    నిశ్చితార్ధము

    వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు.
    నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెండ్లి కుమారుడు అని అమ్మాయిని పెండ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు.

    ఆహ్వాన పత్రికలు

    • నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారంగా ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. వీటిని శుభలేఖలు|పెళ్ళి పత్రికలు అంటారు. మంగళ సూచకంగా శుభలేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు.

    పెళ్ళి పిలుపులు

    బంధుగణమును పిలుచుకొనుట అనేది పెళ్ళిళ్ళలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడెప్పుడూ కలిసే బంధువులందరూ కలువవగలిగే మంచి సంధర్భాలు, పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు .  మారిపోతుంది.                                                          పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.

    కళ్యాణ మండపము

    కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపంయొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

    స్నాతకము

    పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు.

    కాశీప్రయాణం

    బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి’, అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కొన్ని కులాల వారికి ఈ సంప్రదాయం లేదు.

    వరపూజ (ఎదురుకోలు)

    కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.

    గౌరీవృతం    మంగళ స్నానాలు                                                           కన్యావరణము

    బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి ‘నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ’ని కన్యాదాత దీవిస్తాడు.

    యజ్ఞోపవీతధా                                                                                    కాళ్ళు కడుగుట                                                                                    సుముహూర్తం (జీలకర్ర, బెల్లం)

    పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లంపెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ మంత్రము పఠిస్తారు                                                                               .“ అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే! ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!

    కాళ్ళు తొక్కించడం

    కన్యాదానందస్త్రం:Pelli.jpg

    దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.

    !“ కన్యాం కనక సంఫన్నాం’కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం’బ్రహ్మలోక జగీషియా!!

    పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా.”అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ ” అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా” భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది.”వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది”అని కాశ్యప సంహిత.
    దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుత

    మంగళసూత్రధారణ

    వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు. “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!! ”

    మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.

    తలంబ్రాలు

    మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. ‘క్షత’ అంటే విరుగునది- ‘అక్షత’ అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.

     “ ప్రజాపతి స్త్రియాం యశః’ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం’తస్యాగ్నేభాజయేహమా!! ”

    బ్రహ్మముడి

    అంగుళీకాలు తీయడం

    ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.

    సప్తపది, పాణిగ్రహణం

    సన్నికల్లుతోయం
    రాజహోమం
    స్థాలీపాకం
    నాగవల్లి

    సదస్యం

    నల్లపూసలు
    మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

    అరుంధతీ  నక్షత్రం

    విందువినోదాలు

    పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.

Wednesday, October 23, 2013

మీ కోసం కొన్ని చిట్కాలు

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.

ఒక క్యారెట్‌.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు.

బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి.

చర్మం టోనింగ్‌కి ఆరంజ్‌ జ్యూస్‌లోని విటమిన్‌ సి అద్భుతమైన టోనర్‌గా పనిచేస్తుంది. దీనిని ముఖంపై మర్దనా చేసినపుడు సబ్బుతో పోని అదనపు మలినాన్ని, మచ్చలను తలొగించవచ్చు. టోనర్‌ తయారీకి సగం ఆరంజ్‌, సంగం టీస్పూన్‌ నిమ్మరసం, ఒక క్వార్టర్‌ కప్పు నీటిని బ్లెండ్‌ చేయండి. ఈ మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బ్లెండ్‌ చేయండి. దూదిని దానిలో ముంచి ముఖంపై అప్లై చేయండి.

చర్మం సంరక్షణలో ఇది ఒక మంచి మూలిక. మొటిమలను నివారంచడంలో లావెండర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చర్మ ఛాయను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, లావెండర్‌ హెర్బ్‌ను నూరి పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఈ అవొకాడో పండును మెత్తగా పేస్ట్‌ చేసి కొద్దిగా పాలు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించడం ద్వారా మంచి కలర్‌ పొందవచ్చు. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరికాయలో కొబ్బరి తీశాం.. ఇక దీంతో పనేంటి..? పారేస్తే పోలా..? అనుకుంటున్నారా?... ఆగండి.. మీలోని సృజనాత్మకతకు పదునెడితే... ఆ కొబ్బరి చిప్ప అందరినీ ఆకట్టుకునే అందాలు, ఆకృతులతో వెలిగిపోతుంది. ఇదిగో... ఇక్కడున్నవి అలాంటివే.... మరి!

గుడ్డలోని తెల్లసొనలో చెంచా బాదం నూనె కలిపి ముఖం, మెడకు బాగా మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్ళతో కడిగేసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది

 ''పరిగెత్తే ముందు నడవడం నేర్చు కోండి'' అనేది ఈ మాటకు ఉన్న సాధారణ అర్థం. ఏదైనా ఒక పనిని తెలిసీ తెలియ కుండా చేయకూడదని, ఒక పనిలోని లోతుపాతులు లేదా ప్రాథమిక సూత్రా లు తెలుసుకున్నాకే అందులో ముందు కు సాగాలని ఈ సామెత అర్థం.  ఉదా: ఒక వ్యాపారాన్నో లేదా రిపేరు వర్కునో చేయడానికి పూను కున్నప్పుడు ముందుగా దానిని 'ఎలా' చేయాలో మనకు తప్పక తెలిసి ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని వేడి పదార్థాలకు బదులు చలవ పదార్థాలు తింటే మంచిది.

మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్‌ పసుపు (టర్మరిక్‌)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్‌ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి. మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్‌ పసుపు (టర్మరిక్‌)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మృదువైన పేస్ట్‌ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.

రెండు నిండు చెంచాల తాజా తేనెను ఒక చెంచా ఆలివ్‌ నూనెతో కలిపి మృదువైన పేస్ట్‌ తయారు చేయండి. దానిని మీ జుట్టుపై మర్దన చేసి, జుట్టు కుదుళ్లతో ప్రారంభించి, జుట్టు చివర్ల వరకు చేయండి. తరువాత, ఈ మిశ్రమం మీ తలకు పట్టేటట్లు, షవర్‌ క్యాప్‌తో మీ జుట్టును చుట్టి ఉంచండి. 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తొలగించడానికి సున్నితమైన హెర్చల్‌ షాంపూను వాడండి.

బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.

జున్ను పైన నీరు పారబోయకుండా పిండిలో కలుపుకోవచ్చు. కూరల్లోనూ వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది.

కాకరకాయ కూరలో పోపు గింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది

చలికాలంలో కానీ, ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన పచ్చికొబ్బరి చిప్పను తురిమి మిక్సీలో రుబ్బేటప్పుడు కానీ, కొంచెం గోరు వెచ్చని నీరు అందులో కలపడం వలన కొబ్బరికి అవసరమైనంత వేడి అందడమే కాదు త్వరగా రుబ్బడానికి కూడా కుదురుతుంది. పైన ఫ్యాట్‌ పేరుకుపోకుండా కూడా ఉంటుంది.

వంట చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆ జాగ్రత్తలలో భాగంగా, వెల్లుల్లిని, యాలకులను డైరక్ట్‌గా నూనెలో వేయడం వలన అవి పగిలి నూనె మీదకి చిందే అవకాశం ఉంది. పొట్టు తీసి వేసుకుంటే మంచిది. లేక, అలా పొట్టుతోనే వేయాలనుకుంటే, కొద్దిగా నలగ్గొట్టి వేస్తే నూనె చిందే ప్రమాదం ఉండదు.

కొత్తిమీర ఆకుల రసం పెదాలపై రాసి, మర్దన చేస్తే అవి గులాబీ రంగుతో, మృదువుగా ఉంటాయి.

టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడినీళ్లలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.

Tuesday, September 17, 2013

జంట అరటి పళ్ళను తినవచ్చా?

కొంత మంది జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. 

జంటఫలాలను తినటం ద్వార, స్వామికి అర్పించటం ద్వార , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి . అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వలన భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. 


తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.

Friday, June 28, 2013

పిల్లలతో..అమ్మానాన్నలే తోడూనీడగా...

పిల్లలకు.. అమ్మానాన్నలే తోడూనీడగా ఉండాలని మానసిక వైద్యులు అంటున్నారు. ఇంకా బుల్లి బుడతడు ముద్దుముద్దుగా వాదిస్తుంటే చూడ ముచ్చటగానే వుంటుంది. పెద్దలకు. అయితే సహజంగా వాదనంతా పళ్ళు శుభ్రం చేసుకోవడం గురించో, పక్క నీటుగా వుంచుకోవడం గురించో, పుస్తకాలను ఓ పద్ధతిలో సర్దుకోవడం గురించి వుంటుంది.


పిల్లలకు చిన్నప్పటినుంచి ఈ నైపుణ్యాలు నేర్పడంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. ఏదో ఒక రోజున పిల్లలు ఎదిగి స్వతంత్రంగా జీవిస్తారు. పిల్లలు పెరిగే కొద్దీ వారి మేధస్సు వికసిస్తుంది. వారిలో నిబిడీకృతమై వున్న సృజనాత్మక శక్తి బహిర్గతమవుతుంది.


తల్లిదండ్రులు పిల్లల అభిరుచుల్ని, మేధాశక్తిని, ప్రత్యేక కౌశలాలను గుర్తించాలి. పిల్లలు అల్లరికి మారుపేరు. అల్లరి శృతిమించకూడదని ఆంక్షలు పెడతాం. ఇది సరికాదంటారు మనో వైజ్ఞానికులు. ఇప్పుడు వాళ్లకు విధించే శిక్షలు ఉత్తరోత్తరా వారి ప్రవర్తనపైనా, ఉద్వేగాలపైన ప్రభావం చూపిస్తాయంటున్నారు. శిక్షలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే విషయంలో వారి వయసును, మనసును పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు పరిశోధకులు.


ఆరునుంచి పదమూడేళ్ళ మధ్య వయస్సు చాలా సున్నితమైనది. శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా వారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల మీద ఆధారపడకూడదన్న తపన, స్వేచ్ఛగా వ్యవహరించాలన్న కోరిక, బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం వాళ్ళలో కనిపిస్తాయి.


ఎన్నో విషయాలలో పిల్లలు తమ సొంత తెలివితేటలను ఉపయోగించడం ముచ్చటవేస్తుంది. అయినా అప్పుడప్పుడు పనుల్ని తప్పించుకోవడానికి ఏవో సృజనాత్మక మైన సాకులు చెబుతుంటారు. సో.. అమ్మానాన్నలో ఎదిగే పిల్లలకు తోడూనీడగా ఉండాలని మనో వైజ్ఞానికులు అంటున్నారు.

మీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారా?.. అయితే నిమోనియో సోకే ప్రమాదం!

మీ పిల్లలు టీవీలను అంటిపెట్టుకుని కూర్చుంటున్నారా..? ఆడుకోకుండా ఇంట్లోనే ఉన్నారా..? అయితే నిమోనియా సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. చైనాలోని స్కూల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ హువా కియాన్ బృందం నిర్వహించిన సర్వేలో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో నివసించే పిల్లలకు నిమోనియా ఏర్పడే అవకాశం ఉందని తెలిసింది.


చైనా, చైల్డ్, హోమ్ అండ్ హెల్త్ అనే పథకం కింద నాన్జింగ్‌లో ఉన్న 11 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. 2010వ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి 2011 మార్చి వరకు జరిగిన ఈ సర్వేలో హైటెక్ టెక్నాలజీతో కూడిన ఎత్తైన భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే పిల్లలకు నిమోనియా సోకే అవకాశం ఉందని తెలియవచ్చింది. భవనాలు, అపార్ట్‌మెంట్లలో ఉండే పిల్లలకు కావాలిసినంత గాలి లభించకపోవడంతో నిమోనియా సోకే ప్రమాదముందని తెలిసింది.

రాత్రివేళ కొరివి దెయ్యాలు ఉంటాయా?

రాత్రి వేళ పొలాల్లో కొరివి దెయ్యాలను తాము చూశామని చాలా మంది గ్రామీణులు చెపుతుంటారు. ముఖ్యంగా ఈ తరహా దెయ్యాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయని, మంటతో నడుస్తూ, పరుగెత్తుతూ వెళుతుంటాయని చెపుతుంటారు.


అయితే, రాత్రి పూట మంటలు కనిపించడం సహజమేనని పలువురు చెపుతారు. ఈ మంటలు కొరివి దెయ్యాలకు చెందినవి కావని, పక్షుల రెట్టలు, వృక్ష, జంతుజాల అవశేషాలలో ఉండిపోయే సోడియం, గంధకం, ఫాస్పరస్ వంటివి తేలికగా మండే గుణంగల ధాతువులు భూమి మీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయన్నది నిజం.


ఇదే తరహా మార్పులు పగటి పూట కూడా చోటు చేసుకుంటాయి కూడా. అయితే, భానుడి వెలుగుల ముందు అవి కంటికి కనిపించవని చెపుతున్నారు. రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయని చెపుతున్నారు.

భారతదేశపు గొప్ప ఆయుర్వేద వైద్యుడు చరకుడు

ఆయుర్వేద శాస్త్రంలో సువిఖ్యాతులు చరక, సుశ్రతులు. చరకుడు ఆయుర్వేద వైద్య రంగంలో మంచి పేరుగడించారు. సుశ్రతుడు గొప్ప శస్త్ర చికిత్సకుడు. వీరిద్దరిలో చరకుడు క్రీస్తు పూర్వం 800 కాలానికి చెందినవాడుగా పేర్కొంటారు. ఇదేవిషయాన్ని అతని బృహద్గ్రంథం 'చరక సంహిత'లో కూడా స్పష్టంగా ఉంది.


చరకుడు అనే పేరులో కూడా నిఘూడార్థం ఉంది. 'చర్' అనగా చలించుట. తన పేరుకు తగినట్టుగానే చరకుడు నిరంతరం సంచరిస్తూ రోగులకు చికిత్స చేస్తూ వచ్చేవాడు. ఈయనతో పాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ క్కార్క్‌లు కలిసి కనుగొన్న వైద్య విధానంలో దీర్ఘరోగ నివారణలో అత్యంత ఉపయుక్తమైనదిగా గుర్తింపు పొందింది.

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు.


ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందట. అలా జరిగినపుడు ఆహారం బాగా వంటబడుతుందని చెపుతున్నారు.


చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఆహారం వంటబట్టదని అనేక తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. వారి దృష్టి ఆహారం మీద కాకుండా, టీవీపైనే కేంద్రీకృతమై ఉంటుందని అందువల్లే భోజనం చేసే సమయంలో దిక్కులు చూడకుండా తినాలని మన పెద్దలు చెప్పేవారట.

Wednesday, June 19, 2013

మా చెడ్డ "ఒత్తిడి".. వదిలించుకనేదెట్లా...?

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా ఎలా నివారించుకోవచ్చో ఒకసారి చూద్దాం...!!

సుధీర్ఘ శ్వాస - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుధీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది.

వ్యాయామం - వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోవడంతో పాటు, ఆరోగ్యం, చక్కని శరీరాకృతి లభిస్తాయి.

ఆరోగ్యమైన తిండి - సరైన తిండి తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి తలెత్తుతుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, సలాడ్‌లు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. అధిక ఫ్యాట్, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.

హాయిగా నిద్రపోండి - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అటు ఎక్కువగా.. ఇటు తక్కువగా కాకుండా.. రోజుకు ఎనిమిది గంటలపాటు నిద్రిస్తే ఒత్తిడి దూరమవుతుంది. వీలైనంత వరకూ పగటిపూట నిద్రకు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నిద్ర విషయంలో సరైన మెలకువలు పాటిస్తే.. ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.

కోరికలు - మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు సినిమాకు వెళ్లడం, స్నేహితులను కలుసుకోవడం, మీకు ఇష్టమైన పుస్తకాలను చదుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేయడం కూడా మంచి ఫలితాలనిస్తాయి.

చుండ్రు సమస్యకు పరిష్కారం

తలపైన చుండ్రు పెద్ద సమస్య కాదు. తల వెంట్రుకలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల తన వాసన వేస్తూ ఉంటుంది. తలపైనగల చర్మం పొడిగా ఉన్నట్లయితే చుండ్రు వస్తుందన్నది అపోహ మాత్రమే. తల వెంట్రుకలు తక్కువగా శుభ్రం చేస్తారనీ, అలా ఉందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవంగా ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడే చుండ్రు ఉంటుంది.

దీనిని నివారించేందుకు క్రమంతప్పకుండా షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటే చర్మంపైన పొట్టు లేకుండా ఉంటుంది. ఓటీసి డాండ్రఫ్ షాంపూను వాడితే ఫలితం వుంటుంది.

జింక్ పైరిథియోన్(ఇది ఫంగస్ బ్యాక్టీరియా నాశని) వాడితే తలపైగల బ్యాక్టీరియా నిర్మూలింపబడుతుంది. కొన్ని వారాలపాటు ఇలా చేసినప్పటికీ చుండ్రు తగ్గకపోయినట్లయితే డాక్టరను సంప్రదించాలి.

వర్షాకాలంలో పాదాలు... జాగ్రత్తలు

చెప్పులు లేకుండా పాదాలు తరచూ నీళ్లలో తడిస్తే పాదాల నుంచి ఒక రకమైన వాసన రావచ్చు. బూట్లు వేసుకుంటే పాదాల్లో ఉండే తడికి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీనివల్ల పాదాలు దుర్గంధపూరితమవుతాయి. ఒకవేళ సాక్సులు లేకుండా ఉంటే పాదాలకు పోసే చెమటను పీల్చుకునే సదుపాయం ఉండదు. అందువల్ల ఫంగస్ నిరోధక పౌడరును పాదాలకు వాడినట్లయితే పాదాలు పొడిగా ఉంటాయి.

రాత్రిపూట బ్యాక్టీరియాను నాశనంచేసే వెనిగర్ కలిసిన నీటిలో పాదాలు ముంచి శుభ్రం చేసుకోవాలి. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. అలాగే బ్లాక్ టీతో 30 నిమిషాలపాటు పాదాలు తడిసేలా ఉంచినా మంచి ఫలితం కనబడుతుంది.

టానిస్( ఒక చెట్టు బెరడు) కూడా బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. సూక్ష్మరంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల పాదాలు ఎక్కువసేపు పొడిగా ఉంటాయి.

వ్యాయామం చేయాలనే ఉంది.. కానీ వళ్లు బద్ధకం... అంటే ఎలా?

ఏ పని చేయడానికైనా ముందుగా కావాల్సింది మోటివేషన్. ఏ పనినైనా కొన్నాళ్లు కొనసాగిస్తే తర్వాత అలవాటు పడిపోతారు. అలా అలవాటు పడేంతవరకూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఓ పది కిలోలు బరువు తగ్గాలని భావించింత మాత్రాన సరిపోదు.

ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి. చిన్నచిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. అది పూర్తయ్యేంత వరకూ ఓపికగా ఇంట్లోనో, జిమ్ సెంటర్లోనో వ్యాయామం చేయాలి. వాకింగ్, సైక్లింగ్, కార్డియో ట్రైనింగ్, పుషప్‌లు, మెట్లెక్కి దిగడం... ఇలా ఎటువంటి వ్యాయామమైనా ఓ పద్ధతిగా కొనసాగిస్తూ ఉండాలి.

ఫిట్‌నెస్ కోసమే అయితే ప్రత్యేక ట్రైనర్ అవసరం లేదు. కానీ బరువు తగ్గాలనుకునేవారికి మాత్రం నిపుణుల సలహా అవసరం.

నిత్య యవ్వనులుగా ఉండాలనుకుంటున్నారా...? ఐతే ఎర్రెర్రటి బెర్రీస్ తినండి

బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు.

అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు. మరింకెందుకాలస్యం బెర్రీస్‌ను ఓ పట్టుపట్టండి... మరింత అందంగా మారిపోండి.

కాస్త ఒంటికి పనిచెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటే లేకుండా పోయింది. కూర్చున్నచోటు నుంచి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయడం మామూలైపోయింది. ఇలా ఎక్కువసేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయడం వల్ల స్థూలకాయంతోపాటు మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి.

మోకాళ్ల నొప్పులకు కారణాలేంటి..?
ప్రధానంగా మోకాళ్ల జాయింట్ మధ్యలో ఉన్న మృధులాస్తి, సైనోవియల్ ఫ్లూయిడ్‌లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటుచేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధికబరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ల నొప్పులు తీవ్రరూపం దాల్చుతాయి.

గమనించడం ఎలా...?
మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్లు బాగా నొప్పెడతాయి. అదేవిధంగా కూర్చొని పైకి లేచేటపుడు మోకాళ్లు పట్టుకుపోతాయి. ఉదయంపూట లేవగానే నడిచేందుకు మోకాళ్లు సహకరించకుండా ఉంటాయి. నడుస్తున్నప్పుడు మోకాళ్ల వద్ద చిన్నచిన్న శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి లక్షణాలుంటే ఇక అశ్రద్ధ కూడదు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే....
ముఖ్యంగా కుర్చీని అంటిపెట్టుకుని పనిచేసేవారు కనీసం గంటకోసారైనా ఓ పది నిమిషాలు అలా అటూఇటూ నడవడం చేయాలి. ఇక స్థూలకాయం కలిగి ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ఆహారపదార్థాల విషయానికి వస్తే... ఉప్పు, వంటలలో నూనె మోతాదులను తగ్గించుకోవడం మంచిది.

మాంసాహారం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లున్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలి. క్యాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. మంచినీళ్లు సరిపడినన్ని తాగుతుండాలి. కొంతమంది పనిలోపడితే గొంతు పిడచకట్టుకపోతున్నా తలతిప్పరు. ఆ అలవాటును మానుకుని ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా లేకపోతే పనిని కూడా సమర్థవంతంగా చేయలేరు. నాణ్యత తగ్గుతుంది.

ఇక అన్ని జబ్బులకు మంచి మందు వ్యాయామం. వ్యాయామం, నడక వల్ల అధిక బరువు సమస్య దరిచేరదు. తద్వారా మోకాళ్ల నొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

బలహీనంగా ఉన్న వాళ్ళు పుష్టిగా మారాలంటే..!

* వేరుశనగపప్పులను పచ్చివి కాని వేయించిన వాటిని కాని రోజూ తింటే శరీరం శక్తివంతమవుతుంది.

* మిరియాల పొడిలో నువ్వుల నూనె కలిపి పక్షవాతానికి గురైన ప్రదేశంలో క్రమం తప్పకుండా రోజూ మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.

* ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా అల్లం రసం కలిపి క్రమం తప్పకుండా రోజూ తాగితే బలహీనంగా ఉండే వాళ్లు పుష్టిగా మారతారు.

* ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫలచూర్ణం (షాపులలో దొరకుతుంది) కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే పలుచని వస్త్రంలో వడపోసి ఆ నీటితో క్రమం తప్పకుండా రోజూ కళ్లను కడుక్కుంటే కళ్లు కాంతివంతమవుతాయి. కళ్లకు సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి.

దీర్ఘకాలంగా భాదిస్తున్న దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి.....

* ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తరువాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది.

* రెండు టీ స్పూన్‌ల నువ్వుల నూనెలో ఒక కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తాగితే నెలసరి క్రమబద్ధం అవుతుంది.

* కొన్ని తులసి ఆకులని దంచి రసం తీయాలి. ముఖం మీద గాని, చేతుల మీద గాని ఏర్పడ్డ తెల్ల మచ్చలపై ఈ రసాన్ని రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు మెల్లి మెల్లిగా తగ్గుముఖం పడతాయి.

* మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు వేయాలి. నాలుగు మిరియాలను పొడిగా చేసి ఇందులో కలపాలి. అన్నీ కలిపి 15 నిమిషాలపాటు మరగబెట్టి దింపేయాలి. ఇందులో టీ స్పూన్ తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల పొడి దగ్గు తగ్గడమే కాకుండా ఛాతీలో పట్టినటుగా ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది.

* కప్పు నీటిలో మూడు మల్బరీ ఆకులను వేసి పది నిమిషాల పాటు మరగబెట్టి దింపి చల్లార్చాలి. ఇందులో కోడిగుడ్డులోని తెల్ల సొన కలుపుకుని తాగాలి. దీర్ఘకాలంగా బాధిస్తున్న దగ్గు తగ్గుతుంది.

ఆహారాన్ని నమిలి తినండి..ఒబేసిటీకి చెక్ పెట్టండి

ఒబేసిటీతో బాధపడుతుంటే బరువు తగ్గడం కోసం ఆహార నియంత్రణ పాటించడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలేనట్లే ఉంది ఈ ఆక్యుప్రెషర్ చిట్కాలను చూస్తే. శరీరంలో ప్రెషర్ పాయింట్లను గుర్తించి కరెక్ట్‌గా అక్కడ ఒత్తిడి కలిగించే చిన్నపాటి వ్యాయామం ద్వారా ఆకలిని అదుపు చేయవచ్చట.

పై పెదవి మధ్యభాగంలో, ముక్కుకు కింద భాగంలో, నాభికి ఒక అంగుళం కింద, ఒక అంగుళంపైన వేళ్లతో నొక్కాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. ఒక్కొక్కసారి ఐదు నిమిషాల పాటు చేయాలి.

ఆహారాన్ని బాగా నమిలి తినే అలవాటున్న వాళ్లలో ఒబిసిటీ తక్కువగా చూస్తాం. నమల కుండా మింగే అలవాటు ఉండి, ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్లు ఇప్పటికైనా ఆహారాన్ని నమిలి తినడం అలవాటు చేసుకుంటే మంచిఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

నోట్లో పెట్టుకున్న పదార్థం మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు నమలడం అలవాటు చేసుకుంటే తిన్న ఆహారంలోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందడంతోపాటు ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకోలేరు, పైగా శరీరానికి తగినంత తినగానే జీర్ణవ్యవస్థ ఇకచాలని హెచ్చరికలు జారీ చేస్తుంది.

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనె రాస్తే..!

* పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తే పాలు పొంగి బయటకు పోవు.

* పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది. కాని, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృధాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు.

* సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు.
* పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ క్లాత్ కట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే పాలలోని కొవ్వు మొత్తం పైకి తేలి మందపాటి మీగడ పొర తయారవుతుంది.

* శీతాకాలంలో పెరుగు తయారు కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ గిన్నెను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే పెరుగు గట్టిగా తయారవుతుంది.

* పెరుగు ఎక్కువ మోతాదులో మిగిలితే ఆ గిన్నె నిండుగా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ ఆ నీళ్లను మారుస్తూ ఉంటే పెరుగు పుల్లబారకుండా తాజాగా ఉంటుంది.

వదలని మొండి చుండ్రు.. ఏంటి పరిష్కారం..?!!

నేడు ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారే. ఈ చుండ్రు రావడానికి కారణాలు అనేకం. పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, మలబద్దకం, శరీరంలో పేరుకున్న విషపూరిత పదార్థాలు వంటివన్నీ చుండ్రు రావడానికి కారణమవుతుంటాయి. తలలో నిలిచే తేమ, సరిపడని కొన్ని షాంపూల వాడకం కూడా చుండ్రు సమస్యను తెస్తుంది. అటువంటి చుండ్రు సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు మీకోసం...

రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ముద్దగా నూరాలి. ఆ మెంతి ముద్దను మాడుకు పట్టించి, అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి.

తలస్నానం చేసేటపుడు చివరిగా తాజా నిమ్మరసం తలమీద అంటుకుని నీటిని పోసుకోవాలి. రెండు చెంచాల పెసరపిండి, ఒక కప్పు పెరుగు కలిపి తలకు పట్టించి స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.

బీట్ రూట్ వేరుతోసహా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని మాడుకు ప్రతి రాత్రి మర్దన చేయాలి.

నిమ్మ చుక్కలు, ఉసిరి రసం వేసి కలిపిన పుల్ల పెరుగును ప్రతిరోజూ మాడుకు పట్టించి అరగంటసేపు ఉంచినా లేక రాత్రి పడుకునే ముందు పట్టించి ఉదయం నిద్ర లేవగానే తలంటు స్నానం చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.

వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే క్రిముల సమస్య ఉండదు. అయితే చేతులపై దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్లు పడకుండా టిష్యూ వాడితే మరీ మంచిది. అలా వాడిన వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి.

జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే.. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది. మొటిమల సమస్య ఉన్నప్పుడు కూడా చేత్తో తాకడానికి ప్రయత్నించకూడదు.

క్రిములు చేతులపైనే కాదు... నోట్లోనూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవాలి. నాణ్యమైన టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. దంతాల మధ్య ఇరుక్కున్న పదార్థాల్ని తొలగించేందుకు పిన్నులు, టూత్‌పిక్స్ లాంటివి కాకుండా నాణ్యమైన ఫ్లాస్‌ని ఎంచుకుని పుక్కిలించాలి.

క్రిములు చేరే స్థానాల్లో వంటిల్లు కూడా ఒకటి. అందుకే ప్రతి రోజు నాణ్యమైన డిస్ఇన్‌ఫెక్టంట్‌తో వంటిల్లు, ఇతర గదుల్ని తుడవాలి.

పరిశుభ్రమైన మంచినీటిని తాగకపోయినా కూడా సమస్య తప్పదు. అందుకే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకెళ్లాలి. అలాగే జలుబుతో బాధపడుతున్నవారు వాడే మంచినీళ్లసీసాను తీసుకోకపోవడమే మంచిది.

ఈ కాలంలో ప్రయాణించాల్సి వస్తే కోసిన పండ్లు, కూరగాయ ముక్కలు, ఫ్రిజ్‌లో పెట్టని పాలు, పాల ఉత్పత్తులు, పండ్లరసాలు, బంగాళాదుంపలు, అన్నం వంటివి ఎంచుకోకూడదు. ఇలాంటి వాటిల్లో క్రిములు సులువుగా చేరతాయి. రోడ్డుప్రక్కన లభించే పదార్థాలను ఈ కాలమంతా మానేయడమే మంచిది. వెంట శానిటైజర్‌ను కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవడం సులువవుతుంది.

పిల్లలకు గాయాలైతే కట్టుకట్టడం మేలు. లేదంటే వాటిల్లో క్రిములు చేరి సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రథమచికిత్స చేస్తే మరీ మంచిది.

చెత్తడబ్బాలపై మూత తప్పనిసరిగా ఉంచాలి. వీటినుంచే ఈగలు, దోమలు ఇంట్లోకి చేరుతాయి. ఎప్పటికప్పుడు చెత్తను ఖాళీచేసి, శుభ్రంగా కడిగి మూతపెట్టాలి.

ప్రతిరోజు కనీసం పదినిమిషాలు ఎండలో ఉంటే క్రిముల సమస్యను పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే.. ఎండనుంచి విటమిన్ డి అందుతుంది. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. పరోక్షంగా శరీరం శక్తిమంతంగా తయారవుతుంది. అయితే.. ఉదయం ఏడుగంటల లోపల వచ్చే ఎండలో కూర్చుంటే అతినీల లోహిత కిరణాల ప్రభావం ఉండదు.

రోగనిరోధక వ్యవస్థ దృఢంగా పనిచేయాలంటే... క్రిములు, ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు. అందుకే... పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటిని తినేముందు ఒకటికి రెండుసార్లు కడగడం మరవకూడదు.

ఆహారం జీర్ణం కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.

వయసు మీద పడిన వారు ఎన్నో రకముల వ్యాధులకు గురికాగలరు. అందులో ముఖ్య మైనది అజీర్తి కడుపు ఉబ్బరం సమస్య. వయసు మీద పడిన వారు బయటకు వెళితే ఎక్కడ పడిపోతామోనన్న భయంతో ఇంటికి పరిమితం అవుతారు. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరంగా ఉండటం సర్వసాధారణం. అజీర్తి క్రమంగా మలబద్ధకానికి, శరీరం రోగ గ్రస్తం కావడానికీ దారి తీస్తుంది.

అందుకే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. కడుపు ఉబ్బరాన్ని కలిగించే పదార్థాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండడం 60 దాటిన వారంతా చేయాల్సిన పని అంటున్నారు పోషకాహార నిపుణులు. ముదుమిలో కొంపముంచే అలవాట్లు, ఆహారం ఏమిటో చూద్దాం.

* సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి. నిమ్మకాయ, టమాటాలను తినకూడదు.
* మద్యపానం, పొగతాగడం మానుకోవాలి.
* మలబద్ధకాన్ని నివారించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జామ, అరటి పళ్లు కూడా తీసుకోవాలి.
* మొలకెత్తిన గంజలు శ్రేష్ఠం. రోజూ తప్పని సరిగా మొలకెత్తిన గింజలు తినాలి.
* నీళ్లు బాగా తాగాలి. రాత్రివేళ తరుచూ మూత్రవిసర్జనకు వెళ్లే సమస్య ఉంటే నిద్రాభంగం కావచ్చు. అలాంటి వారు పగటి పూట నీళ్లు బాగా తాగి, రాత్రివేళ తీసుకునే మోతాదు తగ్గించాలి.
* దంత సమస్యలు ఉన్న వారు కాస్త ఎక్కువగా ఉడికించిన పదార్థాలను, రాగి జావ, పెరుగు అన్నం లాంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. గట్టి పదార్థాలను తీసుకునే మోతాదు తగ్గించాలి.
* బాగా నమిలి తినడం ద్వారా ఉబ్బరం సమస్య చాలా వరకు దూరంగా ఉంటుంది. దంతాలు పూర్తిగా పోయిన వారు కృత్రిమ దంతాలు వాడటం చాలా అవసరం.

జీర్ణక్రియ బాగా జరగడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు.

సాధారణంగా కాస్త వయస్సు మీద పడిన వారిని చూసామంటె వారు అజీర్తితో బాధపడుతూ వుంటారు. వారు భుజించిన ఆహారం గొంతులోనే ఉన్న భావనతో వుంటారు. మరికొందరికి రాత్రి భుజించిన ఆహారం ఉదయము వరకు అట్లే జీర్ణంకాకుండా, రాత్రంతా చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు.

ఈ రకమైన ఇబ్బందులను ఎదుర్కొను వారు ఈ క్రింది సూచనలను పాటించినచో అజీర్తి నుంచి ఉపసమనం పొంది, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చును.

* ఉదయాన్నే మొదటగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కెఫన్ ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.

* ఉపాహారంగా నూనె లేకుండా వండిన తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోవాలి. ఇది రోజువారీ పనులను ఉల్లాసంగా చేయడానికి పనిచేస్తుంది.

* నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి, ఏలకుల పొడి వేసుకొని తాగాలి. ఏలకులు పిత్తాన్ని, అల్లం కఫాన్ని తొలగిస్తాయి.

* మధ్యాహ్నం రెండు గంటల లోపే గట్టి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే వన్నీ తేలికగా జీర్ణమయ్యేవిగా ఉండాలి. రాత్రి భోజనం వీలైనంత తక్కువగా ఉండాలి.

* ఆహారంలో ఆకుకూరల వంటి పీచు పదార్థాలు మెండుగా ఉన్నవి తినడానికి వీలుకా నప్పుడు తొక్కతో సహా తినగలిగిన పండును తప్పని సరిగా చేర్చాలి.

ఐదు రకాల పండ్లు, కూరగాయలతో మీ గుండె గుడ్ న్యూస్ చెప్పండి!

* రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి.

* డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోండి.

* ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి.

* నడక గుండెకు మంచిది. రోజూ అరగంటపాటు నడవడం అలవాటు చేసుకోండి.

* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.

* పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది.

* కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

* లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.

* బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.

* ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.

* డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి (ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి.

ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు

మీరు చిగుళ్ల నొప్పి, నిద్రలేమి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.

* చిగుళ్లు, పళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉంటే నువ్వులనూనెలో లవంగ నూనె కలిపి వేలితో చిగుళ్ల మీద రుద్దాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా మర్దన చేస్తుంటే చిగుళ్లు గట్టిపడతాయి.

* నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాల సేపుపాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్దన చేయాలి.

* మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.

* నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది.

* డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు

భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న తింటే...

* కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటుంది. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది.

* మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుపడతాయి. గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది.

* గింజల్లో కొవ్వు పదార్థాలు అంటే వెన్న, నూనె, క్రీమ్ వంటివి వేయకుండా తింటే త్వరగా అరుగుతాయి. వీటిలో ఉండే నూనెలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలానే పొత్తుల చివరన ఉండే పీచు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నల్లటి పీచును ఉడికించి ఆ నీళ్లను వడకట్టి తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించి ఏ ఇబ్బందులూ ఉండవు. వీటిని ఇతర ఏ పదార్థాల్లోనూ కలిపి తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగడం తప్పనిసరి.

* అరుగుదల సరిగా లేనివారు... పాత బియ్యం, పెసలు, పేలాలు, చేపలు, బాగా ఉడికిన మాంసం, లేత ముల్లంగి, వెల్లుల్లి, పచ్చి అరటి, అనప, బీర, పొట్ల, వంకాయ, బీన్స్, క్యారెట్, దానిమ్మ, నారింజ, ఆవు పాలతో చేసిన మజ్జిగ వంటివి తీసుకోవాలి.

రక్తపోటు నియంత్రణకు... ఇలాంటి ఆహారం తీసుకోండి.

ఈ ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తికి 2,000 క్యాలరీలు సమకూరి 14రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది.

గింజధాన్యాలు:
గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్, ఆరు పుల్కాలు (సాధారణ సైజువి) లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న ప్రతిరోజు తీసుకున్నట్లైతే రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు.

కూరగాయలు:
ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు ఉడికించిన క్యారెట్లు, తక్కువ నూనెతో వండిన కూరలు, కూరగాయలతో చేసిన రెండు కప్పుల జ్యూస్. ఇలా 4-5 రకాల కూరగాయలు రోజూ భోజనంలో ఉండాలి.

పండ్లు:
పండ్లు కూడా రోజులో 4-5 రకాలు తీసుకోవాలి. 300 మి.లీ పండ్ల రసం, 1-2 అరటి పండ్లు, అన్నిరకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన 2 కప్పుల సలాడ్, (బత్తాయి, పైనాపిల్, పుచ్చకాయ, బొప్పాయి).

వెన్నశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు:
పావు లీటర్ పాలు, పావు లీటరు పెరుగు, 50గ్రా. చీజ్ లేదా పనీర్ వంటి ఉత్పత్తులను తీసుకోవాలి.

మాంసం:
కొవ్వులేని 150గ్రా. ఉడికించిన మాంసం; చేపలు

నట్స్:
రోజుకు బాదంపప్పు 15, పొద్దు తిరుగుడు గింజలు 15 తీసుకోవాలి.

తృణధాన్యాలు:
రోజుకు 150గ్రా.లు. రాజ్మా, శనగలు, పెసలు, కొవ్వు, నూనెలు: రోజుకు 20 గ్రా.లు.

పండ్లతో మీ గుండెను పదిలంగా ఉంచుకోండి.

సాధారణంగా 40 వయస్సు దాటిన వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన జబ్బులు రావడం సహజం. కావున 40 నుంచి 50 వయస్సు వరకూ సంవత్సరానికి ఒక సారి ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకోవాలి. 50 దాటిన వారు సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను చేసుకొని వైద్యులు సలహా తీసుకుంటే మీ గుండె క్షేమంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

* గుండె ఆరోగ్యానికి యాపిల్ చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఒక కప్పు యాపిల్ ముక్కల్లో 3.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

* నారింజపండ్ల రసంలో బి9 విటమిన్ ఉంటుంది. ఇది గుండెజబ్బులకు దారితీసే హోమోసిస్టైన్ను తగ్గిస్తుంది.

* పచ్చిబఠానీల్లో బి2, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు రక్తనాళాలను పదిలంగా కాపాడుతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెజబ్బులు వచ్చిపడతాయి.

* ద్రాక్షపండ్లు గుండెజబ్బులను దూరంగా ఉంచుతాయి. ద్రాక్ష వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫ్లావాన్స్, ఆంతోసైనిన్ వంటి ఎన్నో మంచి లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి. ద్రాక్షను గోరువెచ్చని నీళ్లలో లేదా ఉప్పు నీటిలో కడిగి తీసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది.

* వేరుశనగపప్పులు గుండెకు ఎంతో మేలు చేస్తాయట. రోజూ కాసిని వేరుశనగ పప్పులు, బాదంపప్పు, వాల్‌నట్స్ తీసుకుంటే గుండె నిక్షేపంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

* వీటితో పాటు బీన్స్ కూర తరచుగా తినడం వల్ల కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరోగ్యం కోసం సలాడ్లు ఉడికించిన కాయగూరలు తీసుకోండి..

శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవాలనుకుంటే ముందు చేయాల్సినది నీటిని సమృద్ధిగా తాగాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. వీటితో పాటు సి విటమిన్ ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమ్మజాతి పండ్లలోనూ, అరటి, జామ వంటి వాటిల్లోనూ సి విటమిన్ అధికంగా ఉంటుంది.

* వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి.. రోజులో రెండు లీటర్ల నీటిని తాగినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దిశగా మొదటి ప్రయత్నం మొదలయినట్టే.

* పదార్థాలు ఆకట్టుకొనేలా చేయడానికి వాటిల్లో ఉపయోగించే రంగులు, సువాసన కారకాలు.. మనలో వ్యర్థాలు చేరేటట్లు చేస్తాయి. సహజ రంగులని వాడుకొంటూ వీటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. మొలకలని నేరుగా, దంపుడు బియ్యం, మొక్క జొన్న, బార్లీలు వంటి వాటిని గంజి రూపంలో తీసుకొంటే శరీరం తేలిగ్గా ఉంటుంది.

* ఉడికించిన కూరగాయ ముక్కలని, చిక్కుడు జాతి రకాలయిన బీన్స్‌తో పాటు పెసలు, సెనగలు, రాజ్మా వల్ల వ్యర్ధాలు తొలగుతాయి. తాజా కాయగూరలు, బొప్పాయి, అంజీర, జామ వంటి వాటిని తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

* ఉప్పు వేయని పిస్తా, వేరుసెనగ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్, గుమ్మడి గింజలను తగు మోతాదులో తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

* ఇంట్లో చేసిన పెరుగు, ఆలివ్‌నూనె, అల్లం వెల్లుల్లి, వెన్న వేయని పాప్‌కార్న్, తేనె.. హెర్బల్ టీ తాగాలి.

* నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, కేకులు బిస్కెట్లు బాగా తగ్గించుకోవాలి.

* బరువు తగ్గాలనుకొనేవారు.. కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి, నిత్యం కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులు, మాంసం, శుద్ధి చేసిన పదార్థాలు అతిగా తినేవారు తప్పనిసరిగా డిటాక్సిఫికేషన్‌ని తప్పక దృష్టి పాటించాలి. 

గ్రీన్, జింజర్ టీతో కీళ్లవాపు నొప్పులను తగ్గించవచ్చట!

* మామిడి, స్ట్రాబెర్రీ, పుచ్చ, తర్బూజ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, అరటి, ఆయా కాలాల్లో లభించే అన్నిరకాల పండ్లు, 'ఎ' విటమిన్ ఉండే ఆకుకూరలు, క్యారట్, క్యాబేజ్, బ్రోకలి వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

* రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్ గ్రాస్, ముడిబియ్యం, శనగలు, రాజ్మా వంటి పొట్టుతీయని ధాన్యాలు కూడా తింటే కీళ్లవాపు నొప్పులు తగ్గించవచ్చు.

* రోజుకు గుప్పెడు బాదం, వాల్‌నట్, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు (అన్నీ కలిపి), టీ స్ఫూన్ పసుపు, ఐదు గ్రాముల అల్లం తీసుకోండి.

* గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, చక్కెర, తేనే, నూనెలో వేయించి ఉప్పు చల్లిన గింజలు, టీ, కాఫీ, చల్లబరచి నిల్వ చేసిన ఆహారం తీసుకోకూడదు.

* ఏ ఆహారం తిన్నప్పుడు నొప్పులు ఎక్కువవుతోందో మూడు వారాలపాటు గమనించి వాటిని మానేయాలి.

చేప, అవిసెగింజల నూనెతో రక్తపోటుకు చెక్

* రక్తపోటుకు ప్రధానమైన శత్రువు ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోగలిగితే ఎన్నో జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు.

* ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి ధ్యానం, యోగా.. వంటి మార్గాలను అనుసరించాలి. అలాగే మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణంలో కొద్ది సేపు తిరగాలి.

* నిత్యం చెవులు చిల్లులుపడే రణగొణధ్వనులు, అమితమైన లైట్ల వెలుతురులో ఎక్కువ రోజులు ఉన్నా రక్తపోటు సమస్య వస్తుంది. అందుకని వీటికి కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తీవ్రతను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి చేప నూనెల్లో, అవిసె గింజల ద్వారా తీసిన నూనెల ద్వారా లభిస్తాయి.

* ఆహారంలో మార్పుల ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఆహార ప్రణాళికలో ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, కొవ్వుశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి.

నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతున్నారా....

* మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెని వాడితే మంచి ఫలితం ఉంటుంది.

* జాజినూనె వాడుక వలన గుండె పని తీరును పెంచుతుంది.

* ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోయాయి.

* బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి.

* నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు పొత్తి కడుపు మీద రాస్తే మంచిది.

* తల్లో పేలు బాధిస్తుంటే.. కొబ్బరినూనెలో జాజితైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు.

* చెంచా పాలమీగడలో నాలుగు చుక్కలు చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి.

ఆహారంలో ఉప్పు తగ్గిస్తే రక్తపోటుకు చెక్...

* బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇందుకు క్రమం తప్పక ఏరోబిక్స్ చేయాలి. ఉదా : నడక. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

* ఆహారంలో ఉప్పు తగ్గించాలి. దీనికి బదులుగా ఆహారంలో ఎక్కువ మొత్తం పొటాషియం గల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

* పొగాకు ఉత్పత్తులు, పొగతాగడం, ఆల్కహాల్, సారాయి, మాదకద్రవ్యాలు వంటివి మోతాదు మించి సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

* రక్తనాళాలు విశాలం అవడానికి విటమిన్ -బికి చెందిన నియాసిస్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మాత్రలు వాడటానికి వైద్యుల సలహా తప్పనిసరి.

* గోధుమ ఊక, వేరుశనగపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, కోడిగుడ్డు, చేపలలో బి - విటమిన్ ఎక్కువ.

ప్రకృతిలో దొరికే తైలంతో కొన్ని వ్యాధులను నయంచేసుకోండి.

* కప్పు నీళ్లలో ఆరుచుక్కల నీలగిరితైలం కలిపి పుక్కిలిస్తే నోటిపూత, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు బాధించవు.

* జ్వరంతో బాధపడేవారికి చల్లటి నీళ్లలో ఆరు నుంచి పది చుక్కల నీలగిరితైలం వేసి శరీరాన్ని శుభ్రపరిస్తే త్వరగా జ్వరం తగ్గుతుంది.

* జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పితో బాధపడుతున్నట్లైతే చేతిలో నాలుగు చుక్కలు నీలగిరి తైలం వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది.

* చిన్నపిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే ఆరు నుంచి పది చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి.

* ప్లూ జ్వరంతో బాధపడుతున్నవారు నీళ్లలో రెండు మూడు చుక్కలు కలిపి తాగితే మంచిది.

* కండరాల నొప్పి, నరాలు పట్టుకుపోయినప్పుడు కొబ్బరి నూనెలో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్యదూరమై హాయిగా ఉంటుంది.

జీర్ణకోశ సమస్య రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఛాతీలో మంట, మలబద్దకం, మలంలో రక్తం పడడం, పైల్, వాంతులు, వికారం, ట్రావెలర్స్ డయోరియా, చిన్నపిల్లల్లో అజీర్తి, జీర్ణాశయం, పేరు ఇన్‌ఫెక్షన్, పేగులో అల్సర్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం అవసరం.

జీర్ణకోశ సమస్యలు వచ్చుటకు కారణాలు:

* కొన్ని రకాల మందులు వాడుట వలన ఈ సమస్య ఏర్పడును
* ద్రవపదార్థాలను, పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా జీర్ణకోశ సమస్య వచ్చును.
* విరేచనానికి నియమిత సమయాన్ని కేటాయించకపోవడం, తరచుగా ఫ్రీ మోషన్ కోసం మందులు వాడడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తును.

జీర్ణకోశ సమస్య నివారణ చేసే విధానం:

* గోధుమలు, ముడి బియ్యం ఎక్కువగా తీసుకోవడం మంచిది.
* రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని, ఇతర ద్రవపదార్థాలను తీసుకోవాలి.
* యోగ, నడక, వ్యాయామం, ధ్యానం, సరైన నిద్రను పాటించాలి.
* మొలకలు, క్యారట్, గ్రీన్ సలాడ్, క్యాప్సికం, కీర, ముల్లంగి వంచి పచ్చి కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ఆకుకూరలు, పండ్లను తీసుకోవడం మంచిది.

బరువు తగ్గాలంటే చేయండిలా.....!

* బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి.

* కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి.

* నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి.

* అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.

* కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది.

* బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి.. పాలు పడతాయి.

* అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది.

రక్తహీనతతో బాధపడుతుంటే ఏం చేయాలి?

దేశంలో అత్యధిక శాతం మంది మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత. రక్తహీనతను తగ్గించుటకు పోషకాహారములు అధికముగా వాడినట్లైతే చాలు.

* స్త్రీలను అలసట బారిన పడేయంతో పాటు అనారోగ్య సమస్యలకీ దారితీసె రక్తహినత నుంచి తప్పించుకోవాలంటే ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

* బీన్స్, పచ్చ బఠాణీ, రాజ్‌మా పెసలు, కీరదోస, గుడ్డు, మాంసం వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

* బాదం, పిస్తా, వాల్‌నట్, వేరుసెనగపప్పులను కూడా అధికంగా తీసుకోవాలి.

* ఖర్జూరం, ద్రాక్ష, అంజూర్ వంటి ఎండుఫలాలని తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.

* విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా స్వీకరిస్తుంది.

* భోజనము తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. తాగినట్లైతే శరీరానికి ఇనుము అందదు.

మాంసాహారం తిని అరగక ఇబ్బందిపడుతున్నారా?

* భోజనం చేసిన తరువాత చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగకుండా, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

* అరగ్లాసు పాలల్లో అల్లం, పుదీనారసం సమపాళ్లలో కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

* తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్ ఉన్నవారికి ఈ రసంలో మెంతికూర, తులసి రసం, తేనె కలిపి ఇస్తే త్వరిత ఉపశమనం లభిస్తుంది.

* మాంసాహారం తిని అరగక ఇబ్బందిపడుతుంటే పాలకు బదులు అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే సరిపోతుంది.

* చెంచా అల్లం రసంలో పావుచెంచా జీలకర్ర, తేనె వేసి తీసుకున్నట్లైతే తలతిరగడం, పైత్యం, వికారం వల్ల అయ్యే వాంతులు, దురద, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

* నెలసరి నొప్పితో బాధపడేవారు పదిరోజుల ముందు నుంచి వేణ్నీళ్లలో అల్లం రసం వేసి తీసుకున్నట్లైతే నొప్పి నుండి ఉపసమనం కలుగుతుంది.

* కొబ్బరి నీటిలో అల్లం రసం కలిపి తీసుకున్నట్లైతే మూత్రవిసర్జన సమయంలో మంట సమస్య తగ్గుతుంది.

* గొంతు ఇన్‌ఫెక్షన్, నోటిపూత ఉన్నవారు బియ్యం కడిగిన నీళ్లలో అల్లం రసం, తేనె కలిపి తాగాలి.

టీ తాగితే వయస్సు తగ్గుతుందట.....!

* ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని చైనీయులు నమ్ముతారు.

* మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లను తిన్నదానితో సమానం.

* ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం.

* ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు.

* టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది.

* టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి.

* టీలో పాలు వేసుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి.

* మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

సులువైన ఆహారనియమాలతో డయాబెటిస్‌ని దూరం చేసుకోండిలా...

మన దేశంలో ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య చాలా ఎక్కువ. కాస్త వయస్సుపైబడితే స్త్రీ, పురుషులు ఇద్దరిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకున్నట్లైతే, డయాబెటిస్ మన దరికి చేరకుండా ఆరోగ్యాన్ని క్షేమంగా కాపాడుకోవచ్చు.

* మొలకెత్తిన గింజలు తింటే శరీరములోని అన్నిరకాల వ్యాదులకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

* ఆహారంలో పొట్టుతో ఉన్న రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు తీసుకోవాలి.

* పళ్లు ఏమైన కొరికి, నమిలి తినాలి. అయితే పళ్లరసాలు మాత్రం తాగకూడదు.

* పళ్లు తన్నేటప్పుడు ఎక్కువ తీపి కలిగన పండ్లు తినకూడదు. ముఖ్యంగా ఖర్జూరం, అరటి పండు, మామిడి వంటి పండ్లు తీసుకోకూడదు.

* తీపి పరిమితంగా ఉండే బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువగా తినవచ్చు.

* తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్త తీసుకోవాలి.

* ఆహారం మితంగా తగినంత మాత్రమే తీసుకోవాలి.

రోజుకో వెల్లుల్లి రెబ్బతో కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుకోండిలా...!!

ఆరోగ్య సూత్రాలు చెప్పినంత సులభంగా పాటించటం చాలా కష్టం. కాని గుండెకు సంబంధించినంత వరకు కొన్ని జాగ్రత్తలను కాస్త తేలిగ్గానే ఆచరించవచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లైతే గుండెను పదిలంగా కాపాడుకోడానికి ఉపయోగపడుతుంది.

* రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
* హడావుడిగా తినకుండా నిదానంగా తినేది అలవాటు చేసుకోండి.
* వారంలో ఒక్కసారైనా చేపలు తినండి. చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి.
* పొగతాగడం పూర్తిగా మానేయాలి. పొగాకు ఏ విధంగా వాడినా అది గుండెకు చేటని గుర్తుపెట్టుకోండి.
* ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. దాని వల్ల గుండెజబ్బులు తగ్గుతాయి.
* వీలైతే మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిది.
* రాత్రి భోజనం మితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
* డైటింగ్ చేయకుండా, అందుకు బదులుగా ఎక్కువసార్లు తక్కువ మోతాదుల్లో తినండి.
* మానసిక ఒత్తిడి తగ్గేందుకు జంతువులను పెంచుకోండి. వాటితో కాలం గడుపునప్పుడు మానసిక ఒత్తిడి తగ్గి గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.
* ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆకుకూరలు, కూరగాయల వాడకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన వాటిల్లో 50 నుంచి 60 శాతం పోషకాలు నశించిపోతాయి.
* మీరు ఇష్టపడే ఆహారపదార్థాలను దేన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొంత సమయం తీసుకుంటూఅదేపనిగా తినకుండా అప్పుడప్పుడూ తినడం మంచిది.

తలనొప్పి, అసహనం రుగ్మతలు పీడిస్తున్నాయా..?! 7 గంటలు నిద్రపోండి

* నీటిని ఎంత ఎక్కువగా తాగితే మన శరీరానికి అంత మంచిది, దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
* కొంత వేడి నీటిలో 1 కప్పు నువ్వులను దాదాపు రెండు గంటలు నానబెట్టిన తరువాత వాటిని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని ఒక కప్పు పాలతో కలిపి, అందులో కొంచెం బెల్లం వేసి రోజూ తీసుకుంటే అజీర్తి తొలగి పోయి మంచి జీర్ణశక్తి మీ సొంతమవుతుంది.
* నువ్వులను ఎరుపురంగు వచ్చేవరకు వేయించి, పొడి చేసుకోవాలి, ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసి రోజూ మూడు పూటలా పాలతో పాటు తీసుకోవాలి, ఇలా పదిరోజులు చేస్తే మలబద్దకం పరారవుతుంది.
* ఫాస్ట్ ఫుడ్‌ను దూరంగా పెట్టి పోషక విలువలు ఎక్కువ ఉండే ఆకుకూరలు, కాయగూరలను సమృద్ధిగా తింటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* దగ్గు, జలుబు లాంటి ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మందుల వాడకాన్ని తగ్గించండి. ఆయుర్వేదంలో పేర్కొన్న ప్రకృతి వరప్రసాదాలు శొంఠి, మిరియాలు లాంటి వాటితో కషాయము చేసి తీసుకుంటే మంచిది.
* కనీసం 6 లేక 7 గంటలవరకు నిద్రపోవాలి, నిద్ర మనకు చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది తలనొప్పి, అసహనం, ఏ విషయంపైనా సరయిన ఏకాగ్రత లేకుండా చేయడం లాంటి సమస్యలకు కారణమవుతుందని గుర్తుంచుకోండి.

శీతాకాలంలో సమస్యలు - నిరోధించేందుకు చిట్కాలు

చలికాలం వచ్చేసింది. మొన్నటివరకూ అకాల వర్షాలు ముంచెత్తాయి.. వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. వీటి బారిన పడకుండ ఉండటానికి తీసుకోవలసిన చర్యలు..పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం.

సరిపడినంత నీరు తాగండి...
చలికాలంలో దాహంగా ఉండదనే కారణంతో మనలో చాలామంది నీరు తాగటాన్ని తగ్గించేస్తాము. కాని అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మామూలుగా నీటిని మనం ఎలా తాగుతామో అలాగే ఈ కాలంలో కూడా శరీరానికి సరిపడినంత నీటిని తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. మనకు సంభవించే పలు రోగాలకు ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగా లేకపోవడమే అని తెలుసుకోండి. దీన్ని గుర్తుంచుకుని రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగండి.

వాతావరణ కాలుష్యం వల్ల ఈ కాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇంకా చెప్పాలంటే దోమల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి చుట్టు ప్రక్కల పరిసరాలలో నీరు నిలువకుండా చూడాలి. ఇన్ఫెక్షన్ కలుగకుండా చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

మామూలుగా ఎక్కువమందికి ఈ కాలంలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు చేయించుకునే అలవాటు ఉంటుంది. కాని ఇది మరీ అంత మంచిపద్ధతి కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా మన శరీరంలో స్వతహాగా వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయమని వారు సూచిస్తున్నారు. ఈ కాలంలో వృద్ధి చెందే బ్యాక్టీరియాల కారణంగా మన శరీరంలోని హ్యుమిడిటీ పెరిగి శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు వీటి వల్ల కామెర్లు, మలేరియా, టైఫాయిడ్, అతిసారం, దగ్గు, జలుబు, జ్వరం, ప్లూ వంటి అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి..

ఇలాంటి అంటువ్యాధుల నుండి మనల్ని మనం సంరక్షించుకోవడానకి పీచుపదార్థం ఎక్కువ ఉండే బార్లీ, గోధుమ, బియ్యం, ఉసిరి లాంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఆయుర్వేద వరప్రసాదాలైన అశ్వగంధ, కేసరి వంటివి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచి శరీరంపై ఒత్తిడులను తగ్గిస్తాయి. తాజా పండ్లు, పచ్చటి కూరగాయలు, ఇనుము ఉన్న ఆకు కూరలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం.

తేనెతో కాలిన గాయాలకు చెక్ పెట్టండి...!

* కిందపడినప్పుడు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే దాన్ని ఏదైన సుభ్రమైన వస్త్రంతో అదిమి నట్టు పట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత క్రీమ్‌ని రాసి గట్టిగా కట్టు కట్టాలి.

* కాలిన చోట తేనెతో పూతలా వేస్తే మంట, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

* గాయాలు తగిలినప్పుడు, ఒక గిన్నెలో వెనిగర్‌ను, నీళ్లను సమంగా తీసుకొని, దూదితో గాయం తగిలిన ప్రాంతంపైన తుడిస్తే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది.

* చర్మం లోపలి వరకూ వెళ్లి సూక్ష్మక్రిములతో పోరాడే గుణం తేనెకి మాత్రమే కలదు. కావున తేనెని గాయము తగిలిన వెంటనే వాడాలి.

* రెండుమూడు టీబ్యాగుల్లోని మిశ్రమాన్ని కప్పులో తీసుకొని దాన్ని నిండా నీళ్లు పోసి మరిగించాలి. అందులో కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి డికాక్షన్ తయారుచేసి చల్లారాక దూదిన ముంచి గాయాలు లేదా పుండ్ల మీద తుడవాలి.

శిరోవేదన సమసిపోవాలంటే....

మైగ్రేన్ తలనొప్పి బాధపడేవారు కేవలం వైద్యుల సలహాలతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అప్పుడే సమస్య నియంత్రణలో ఉంటుంది.

* వైద్యుల సలహా మేరకూ మందులు వాడటం... నొప్పి భాధించనప్పుడు కూడా ఆహార, ఇతర నియమాలు పాటించడం మేలు. అలానే కొందరు ఈ సమస్యను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లోనే సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వారు వైద్య నిపుణుల సలహా పాట్టించడం మేలు.

* వాతవరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ సమస్య మరింత రెట్టింపవుతుంది. అలాంటప్పుడు బయటకు రాకుండా వుండటం... చెవ్వుల్లోకి చల్లని గాలి పోకుండా దూది పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

* ఆ సమయంలో బాగా నిద్రపోవడం వల్ల ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఉదయం నడకతోపాటు యోగా, వ్యాయామం కూడా చేయమన్నది నిపుణుల సలహా.

* ఆహార నియమాల పట్ల శ్రద్ధ పెట్టాలి. ఉపవాసాలకూ దూరంగా ఉండాలి. అలానే ఒక్కపూట భోజనం కాకుండా కడుపు నిండా తినడం... పోషకాహారానికి ప్రాధాన్యమివ్వడం వంటివి చేయాలి.

* ఘాటైన పరిమళద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఎండలో బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ రావల్సి వస్తే చలువ కళ్లదాలు పెట్టుకోవాలి.

బరువు తగ్గాలంటే ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోండి..!

ఆరోగ్యదాయకంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజంతా వివిధ రకాల ఫ్రూట్స్ సలాడ్స్ ద్వారా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజా కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, మాంసం, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం చాలా సులభమని డయట్ అండ్ ఎక్సర్‌సైజ్ రూల్స్ ఇన్ ది డస్ట్ అనే పుస్తక రచయిత డియాన్ గ్రీసెల్ తెలిపారు.

అల్పాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం, లంచ్, డిన్నర్‌లకు మధ్య ఫ్రూట్ స్నాక్స్ వంటివి తీసుకోవడం మంచి ఫలితమిస్తుంది. సలాడ్లు లేదా తాజా పండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని గ్రీసెల్ చెప్పారు.

గ్లూకోజ్ గల ఆహారాన్ని ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఐదు గంటలకు పైగా ఏవీ తీసుకోకుండా కడుపును ఖాళీగా ఉంచడం కూడదు. ఇలా చేస్తే అసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎసిడిటీని తరిమికొట్టేందుకు చిట్కాలు

ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య ఎసిడిటీ. ఇది పని ఒత్తిడి వల్ల, వేళకాని వేళలో తినడం వల్ల, ఫాస్ట్‌ఫుడ్ వంటకాలు, మసాలాలు అవీఇవీ అని రుచి కోసం అడ్డమైనవన్నీ వేసి తయారు చేసే వంటలను తినడం వల్ల వచ్చే సమస్య. అంతేకాదు మనం తినే ఆహారంలో ఉప్పు, కారం ఎక్కువగా ఉండటం వల్ల కూడా వస్తుంది.

అంతేనా అంటే ఇంకా వుంది.. చిన్న, చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని, వారి కోపమంతా అన్నంపై చూపించి ఆ పూట అన్నం తినరు. అలా అప్పుడప్పుడు తినకపోవడం వల్ల కూడా ఈ గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఏదీ సరిగా తినలేరు. తిన్నది జీర్ణం కాదు, కడుపులో మంటగా, వికారంగా ఉంటుంది.

కడుపు ఉబ్బరం లాంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యను తొలి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య ముదిరి అల్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఎసిడిటి సమస్యలున్నవారు ఈ సూచనలను పాటిస్తే బయటపడవచ్చు.

*టీ స్పూన్ అల్లంరసంలో అర టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తింటే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
* గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్‌ల తేనె, అల్లం ముక్కలు చిన్నవి కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని అజీర్తిగా అనిపించివప్పుడు తాగాలి. మంచి ఫలితాన్ని ఇస్తుంది.
* బేకింగ్ సోడా, మంచినీళ్ళు సమానంగా కలిపి తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
* తిన్న తర్వాత ఒక కప్పు అల్లంటీ తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది.
* ఎసిడిటీతో బాధపడుతున్న వారు, అన్నం తిన్న తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకుని రసం మింగుతుండాలి.

ఎసిడిటీకి కారణాలు
1. ఆహారం తినేప్పుడు నమలకుండా గబగబా మ్రింగడం.
2. మాట్లాడుతూ తినడం.
3. మద్యం, పొగత్రాగటం లాంటివి గ్యాస్‌కి ముఖ్య కారణాలు.
4. ఆహారనాళంలో జీర్ణం కాని పదార్థాన్ని బాక్టీరియా తీసుకుని, గ్యాస్‌‌ని విడుదల చేస్తుంది.
5. ప్రేగుల్లోని కొన్ని బాక్టీరియాలు గ్యాస్‌ను ఎక్కువగా తయారుచేస్తాయి.

గ్యాస్ రాకుండా ఉండాలంటే
* ఆహారాన్ని నిదానంగా బాగా నమిలి తినాలి, తక్కువగా తినాలి.
* పొగత్రాగడం, మద్యం సేవించడం లాంటి అలవాట్లను వెంటనే మానేయాలి.
* కూల్‌డ్రింక్స్ తాగటం, తీపి పదార్థాలను తినడం తగ్గించాలి.
* వేళకు తినాలి.
* రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల వరకు నీటిని తాగాలి.

మీ ఆరోగ్యానికి రక్ష.. గులాబీ రేకులు - అటుకుల కొబ్బరి

మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఎంతో కొంత హాని కలిగించే పదార్థాలు ఉంటాయి. ఎలా అంటారా... మనం ఏ కూర చేసుకున్నా అందులో ఉప్పు, కారం, నూనె వేయకుండా చేయలేము కదా, కొందరైతే వీటి పరిమాణాన్ని కాస్త ఎక్కువ చేసి వాడుతారు, అలాంటి వాళ్ళకు ఏ జబ్బైనా ఇట్టే వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకోసం ఉప్పు, కారం తక్కువ మోతాదులో వేసి తయారుచేసిన ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని వంటకాలను మనం ఇప్పుడు చూద్దాం.

తీపి గులాబీ రేకులు: గులాబీ రేకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి, బాగా ఆరిన తరువాత వాటిని తేనెలో కాని బెల్లం పాకంలో గాని పదిరోజుల పాటు ఊరనివ్వాలి. తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనతను పోగొట్టి శరీరానికి రక్తం పట్టేలా చేస్తాయి.

వడపప్పు: పెసరపప్పును రెండు గంటలు పాటు నీటిలో నానబెట్టి, ఆ పప్పులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మిరియాలపొడి, శొంఠి పొడిని వేసి అందులో ఒక నిమ్మకాయను పిండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది.

మూలికా కాఫీ: శొంఠి, తేనె, ధనియాలు, మిరియాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్కలను సమానమైన పరిమాణంలో తీసుకుని కలపాలి, తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండబెట్టి పొడికొట్టాలి. ఈ పొడిని కాఫీ పొడికి బదులుగా వాడాలి. చక్కెరకు బదులు బెల్లం వేసుకోవాలి, ఒక కప్పు కాఫీకి ఒక స్పూను పొడి వెయ్యాలి. ఇది తలనొప్పి, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలకు మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాక జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

అటుకుల కొబ్బరి: మనకు కావలసినన్ని అటుకులను బాగా కడిగి నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి, వాటిలో తగినంత కొబ్బరి తురుము, బెల్లమును చేర్చాలి, దీన్ని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

వేసవిలో వడదెబ్బ.. చిట్కాలతో నయం

వేసవి వచ్చిందంటే వడదెబ్బ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ వడదెబ్బకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య మాయమవుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం.

నీరుల్లిపాయల రసాన్ని కణతలకు, గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగ్గుతుంది. పండిన చింతకాయలను నీటిలో పిసికి ఆ రసంలో ఉప్పు కలిపి త్రాగించవలెను.

చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ త్రాగిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.

మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

శరీర లావణ్యాన్ని పెంచే పసుపు..!?

పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

* ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

* ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపసమనం కలిగిస్తుంది.

* పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

* ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.

* శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.

వేధించే చుండ్రు సమస్య.. పరిష్కార మార్గాలు

వస కొమ్ములను ఒకరోజు మంచినీటిలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒకచెంచా మోతాదుగా ఒక కప్పు పెరుగులో వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకు తగిలేలా పాయలు పాయలుగా విడదీసి తలంతా రుద్దాలి. ఒక గంట ఆగిన తర్వాత కుంకుడుకాయతోగాని, శీకాయతోగాని తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే క్రమంగా చండ్రుసమస్య పూర్తిగా నివారణ అవుతుంది.

తగినన్ని మెంతులు ఒక గిన్నెలోవేసి,అవి మునిగేవరకూ నిమ్మపండురసం పోసి ఒకరాత్రి లేదా ఒక పగలు నానబెట్టాలి. మెత్తగా నానిన తర్వాత గుజ్జులాగా రుబ్బి దాన్ని తలకు రుద్ది ఒకగంట తర్వాత కుంకుడుకాయలతో స్నానంచెయ్యాలి. ఇలా ఐదురోజులకు ఒకసారి ఆచరిస్తుంటే ఎంతోకాలంగా వేధించే చుండ్రు సమస్య నివారించబడుతుంది.

పేగు క్యాన్సర్ - మధుమేహం - గుండెకు మంచి మందు పుచ్చకాయ

మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. కానీ, వాటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా?.

పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల.

ఎంపిక : సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం.

పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా?. కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈసారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.

రాత్రిపూట ఇవి తింటే పక్షవాతం వచ్చే ప్రమాదం

రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది. అయితే రాత్రివేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు. ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది.

ఎందుంకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.

పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక సర్వ వైద్యములకు పథ్యము చేయడం మిక్కిలి శ్రేయస్కరము. అంతేకాదు.. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.

మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..!!

వంటింటి పోపు దినుసులను మితంగా వాడుకోవాలి. ఘాటు అధికంగా ఉండే లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం తగ్గించాలి. వీటిని విడిగా వాడితే సహజ ఔషధ తత్వాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న శరీర, ఆరోగ్య సమస్యలకు ఈ చిట్కాలను వాడండి.

* దాల్చిన చెక్క పొడిచేసి పాలతో తాగితే నిద్రలేమితో బాధపడేవారికి మంచి ఉపశమనం.

* యాలకులని పాలలో వేసి ఐదారు చుక్కల చొప్పున రాత్రిపూట తీసుకొంటే మంచి నిద్రపడుతుంది.

* పావుచెంచా పసుపును శోబిమచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి.

* విరేచనాలవుతున్నప్పుడు పాలలో కాస్త పసుపు కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

* మంట, దురద, దద్దర్లు వంటి సమస్యలున్న చోట జీలకర్ర ముద్దను రాస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

* కీళ్ల నొప్పులు బాధిస్తుంటే అక్కడ ఆవనూనెతో మర్ధన చేస్తే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

* మెంతులని మెత్తగా నూరుకొని శిరోజాలకు పెడితే మృదువుగా మారతాయి.

* సున్నిపిండిలో మెంతుల్ని కలిపి వాడితే చర్మం ప్రకాశవంతాన్ని సంతరించుకుంటుంది.

* దాల్చిన చెక్క ముద్దని పాలలో కలిపి ముఖంపై మచ్చలకు రాస్తే అవి త్వరగా చర్మంలో కలిసిపోతాయి.

* లవంగాలను కాల్చి నమిలితే దగ్గు తగ్గుతుంది.

రక్తదానంతో గుండెను పదిలంగా ఉంచుకోండి..!!

* రోజూ ఆటలాడటం వల్ల క్యాన్సర్, గుండెపోటుకు గుడ్ బై చెప్పినట్టే. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి.

* నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం నిద్రపోవాలి.

* వ్యాయామం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, మధు మేహం వంటివి తగ్గుతాయి. వ్యాయామం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

* మీరు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తే మీ గుండెకు చాలా మంచిదన్న విషయాన్ని మర్చిపోకండి.

* మెట్లెక్కడం, తోటపని వంటివి గుండెకు మంచి చేస్తాయి. ఇంకా ఉతికిన బట్టలు ఆరేయడం, ఆరిన తర్వాత మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం లాంటి ఇంటి పనులు గుండె జబ్బుల రిస్క్‌ని తగ్గిస్తాయి.

* ప్రతిరోజూ కనీసం 30-60 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఒక పూట భోజనం పూర్తిగా అరిగిపోయేలా చేస్తుంది. అంటే దాంతో కొవ్వులు శరీరంలోకి చేరదు. అలా కొవ్వులు చేరకపోవడం గుండెకు చాలా మంచిది.

* క్రమంగా వ్యాయామం చేయడాన్ని ఒకేసారి ఆపకూడదు. క్రమంగా వ్యాయామం చేయడంలోని తీవ్రతను తగ్గించుకుంటూ రావాలి. దీనివల్ల రక్తపోటు, గుండెకొట్టుకునే ప్రక్రియ ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటాయి.

* వ్యాయామం వల్ల రక్తప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వులు తగ్గుతాయి. ఎముకలు బలంగా మారుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది గుండె ఆరోగ్యానికి పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మేలు చేస్తుంది.

బంగారు నీటితో ఏనుగులాంటి బలం మీ సొంతం చేసుకోండి..!!

* ప్రతిరోజు నల్లనువ్వులను తిని, చల్లని నీరు త్రాగినట్లైతే శరీరానికి కావాల్సిన బలం అందుతుంది.
* బంగారాన్ని నీటిలో వేసి కాచి, ఆ నీటిని తాగినట్లైతే ఏనుగులాంటి బలం కలుగుతుంది.
* తాజా వెన్నను ప్రతిరోజూ ఉదయం తినాలి.
* నీటిలో ఖర్జూరపండ్లు నానబెట్టి బాగా కలిపి, ఆ నీటిని తాగాలి.
* మర్రిపండులోని గింజలు తినాలి.
* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లు తింటే శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. దాంతో పాటు ఏ వ్యాధులు రాకుండా ఉంటుంది.
* పాలలో అతిమధురం పొడికలిపి తాగాలి.
* ద్రాక్ష లేక కిస్‌మిస్ రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం బాగా కలిపి ఆ నీరు తాగాలి.

తులసీ ఆకులతో హెపటైటిస్, టైఫాయిడ్‌కు చెక్ పెట్టండి!!

* రోజూ ఐదు తులసి ఆకులను నమిలి తింటే హెపటైటిస్, టైఫాయిడ్ వంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

* దోమలు, ఇతర కీటకాలు కుట్టినప్పుడు దురద, నొప్పి ఏర్పడు భాగంలో నిమ్మరసం రాస్తే తీవ్రత తగ్గుతుంది.

* చింతాకు, నీరు, ఉప్పు కలిపి కాచి, ఆ నీటితో కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* దంతక్షయం బాధిస్తుంటే రెండు తులసి ఆకులు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాలపొడి కలిపి పేస్ట్ చేసి, ప్రభావితమైన దంతంపై రాస్తే త్వరగా నొప్పి తగ్గిపోతుంది.

* క్యారెట్ జ్యూస్ అర కప్పు, టొమాటో జ్యూస్ అర కప్పు, కొద్దిగా తేనే కలిపి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.