Wednesday, June 19, 2013

భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న తింటే...

* కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటుంది. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది.

* మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుపడతాయి. గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది.

* గింజల్లో కొవ్వు పదార్థాలు అంటే వెన్న, నూనె, క్రీమ్ వంటివి వేయకుండా తింటే త్వరగా అరుగుతాయి. వీటిలో ఉండే నూనెలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలానే పొత్తుల చివరన ఉండే పీచు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నల్లటి పీచును ఉడికించి ఆ నీళ్లను వడకట్టి తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించి ఏ ఇబ్బందులూ ఉండవు. వీటిని ఇతర ఏ పదార్థాల్లోనూ కలిపి తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగడం తప్పనిసరి.

* అరుగుదల సరిగా లేనివారు... పాత బియ్యం, పెసలు, పేలాలు, చేపలు, బాగా ఉడికిన మాంసం, లేత ముల్లంగి, వెల్లుల్లి, పచ్చి అరటి, అనప, బీర, పొట్ల, వంకాయ, బీన్స్, క్యారెట్, దానిమ్మ, నారింజ, ఆవు పాలతో చేసిన మజ్జిగ వంటివి తీసుకోవాలి.

No comments:

Post a Comment