Wednesday, June 19, 2013

వేధించే చుండ్రు సమస్య.. పరిష్కార మార్గాలు

వస కొమ్ములను ఒకరోజు మంచినీటిలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒకచెంచా మోతాదుగా ఒక కప్పు పెరుగులో వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకు తగిలేలా పాయలు పాయలుగా విడదీసి తలంతా రుద్దాలి. ఒక గంట ఆగిన తర్వాత కుంకుడుకాయతోగాని, శీకాయతోగాని తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే క్రమంగా చండ్రుసమస్య పూర్తిగా నివారణ అవుతుంది.

తగినన్ని మెంతులు ఒక గిన్నెలోవేసి,అవి మునిగేవరకూ నిమ్మపండురసం పోసి ఒకరాత్రి లేదా ఒక పగలు నానబెట్టాలి. మెత్తగా నానిన తర్వాత గుజ్జులాగా రుబ్బి దాన్ని తలకు రుద్ది ఒకగంట తర్వాత కుంకుడుకాయలతో స్నానంచెయ్యాలి. ఇలా ఐదురోజులకు ఒకసారి ఆచరిస్తుంటే ఎంతోకాలంగా వేధించే చుండ్రు సమస్య నివారించబడుతుంది.

No comments:

Post a Comment