Tuesday, June 18, 2013

జిమ్‌కు వెళ్ళకుండా వ్యాయామం ఎలా చేయాలి?

వ్యాయామం చేయడానికి జిమ్‌లు, వ్యాయామ పరికరాలు అవసరం లేదు. ప్రతీరోజూ వ్యాయమం చేయాలని సంకల్పించుకుని క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తే ఫలితం కనబడుతుంది. ఉదాహరణకు ఇంట్లో ఒకేచోట ఉండి నడవడానికి ఎలాంటి పరికరాలు అక్కర్లేదు. వాకింగ్ లేదా స్లో రన్నింగ్, జాగింగ్‌ను కాడా చేయవచ్చు. అలాగే బరవు 85 కిలోలు పైన ఉంటే వాకింగ్, జాగింగ్ కాకుండా సైక్లింగ్ చేయాలి.

అలాగే బరువును ఆసారగా తీసుకునే వ్యాయామాలైన దండీలు, బస్కీలతో పాటు వేలాడుతూ పైకి లేచే చిన్ అప్ ఎక్సర్‌సైజ్‌లను చేయవచ్చు. మోకాళ్లు ఎలాంటి నొప్పులు లేకపోతే మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఇంట్లో వాటర్ బాటిల్ సహాయంతో డంబెల్ ఎక్సర్‌‌సైజులు వంటివి చేయవచ్చు. ఇంకా ఇంటిపనులు అంటే... ఇల్లు శుభ్రం చేయడం, ఇంట్లో మొక్కలు పెంచడం వంటి పనులు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పనులు కూడా పూర్తవుతాయి.

No comments:

Post a Comment