Tuesday, June 18, 2013

కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగమా...?

గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువమంది మహిళలు చేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చుని అతుక్కుపోవడం వల్లా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు వైద్యులు.

ఒత్తిడితో కూడిన పని వల్ల మహిళల్లో గుండె జబ్బుల్లాంటివి వచ్చే అవకాశం నూటికి ఎనభై ఎనిమిది శాతం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. కనుక గంటకోసారైనా సీట్లోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.

ఆకలేస్తే పనిచేసే చోటే కూర్చుని ఏదో ఒకటి తినేయకండి. 20 నిమిషాలపాటు చిన్నగా నడవండి. కొంచెం నీరు తాగండి. గింజ ధాన్యాల్లాంటివి తిని మళ్లీ పని మొదలుపెట్టండి.

అదేపనిగా కంప్యూటర్ తెరని చూడడం వల్ల కూడా కళ్లు జీవాన్ని కోల్పోయి, నీరు కారడం, ఎర్రగా మారడంలాంటివి జరుగుతాయి. కళ్లు పొడిబారిపోతాయి. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల పాటు కళ్లకి విశ్రాంతినివ్వండి. ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువునేదైనా చూస్తూ ఉండండి. కనురెప్పలు కూడా ఎక్కువసార్లు ఆర్పుతూ ఉండండి.

No comments:

Post a Comment