Tuesday, June 18, 2013

గోరింటాకుతో చుండ్రుకు చెక్

గోరింట ఆకులు సౌందర్య సాధకాలుగా ఉపయోగపడతాయి. క్రిమి సంహారం కూడా. పచ్చి ఆకుల్ని ముద్దగా నూరి చేతులపైన, పాదాలపైన, గోళ్లపైన అలంకరణార్థం ఉపయోగిస్తారు. ఎర్రగా పండి, సుందరంగా కనిపిస్తుంది. గోళ్లకు, చర్మానికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడుతుంది. మంట కలగకుండా చల్లదనం ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని నువ్వులనూనెతో కలిపి మరిగించి చల్లార్చి హెయిర్ ఆయిల్‌గా వాడుకోవచ్చు. శిరోజాలు ఆరోగ్యవంతంగా ప్రకాశిస్తాయి. చుండ్రు తగ్గిపోతుంది.

దీని ఆకుల్ని ముద్దగా నూరి కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి పైపూతగా వాడితే కీళ్లనొప్పులు, పార్శ్వశూల, అరచేయి, అరిపాదాల మంటలు తగ్గుతాయి. సెగ్గడ్డలు కూడా తగ్గుతాయి. దీని ఆకుల కషాయంతో కడిగితే వ్రణాలు (పుండ్లు) మానుతాయి.

కషాయాన్ని పుక్కిలి పట్టడం వల్ల నోటిపూత, దంత మూల వ్యాధులు నశిస్తాయి. ఈ చెట్టుబెరడుపైన ఉండే పట్టని ఎండించి చూర్ణం చేసి మజ్జిగతో ఒక చెంచా మోతాదులో రెండుపూటలా సేవిస్తే, వారం రోజుల్లో కామెర్లవ్యాధి (జాండిస్) తగ్గిపోతుంది.

No comments:

Post a Comment