Wednesday, June 19, 2013

వదలని మొండి చుండ్రు.. ఏంటి పరిష్కారం..?!!

నేడు ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారే. ఈ చుండ్రు రావడానికి కారణాలు అనేకం. పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, మలబద్దకం, శరీరంలో పేరుకున్న విషపూరిత పదార్థాలు వంటివన్నీ చుండ్రు రావడానికి కారణమవుతుంటాయి. తలలో నిలిచే తేమ, సరిపడని కొన్ని షాంపూల వాడకం కూడా చుండ్రు సమస్యను తెస్తుంది. అటువంటి చుండ్రు సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు మీకోసం...

రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ముద్దగా నూరాలి. ఆ మెంతి ముద్దను మాడుకు పట్టించి, అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి.

తలస్నానం చేసేటపుడు చివరిగా తాజా నిమ్మరసం తలమీద అంటుకుని నీటిని పోసుకోవాలి. రెండు చెంచాల పెసరపిండి, ఒక కప్పు పెరుగు కలిపి తలకు పట్టించి స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.

బీట్ రూట్ వేరుతోసహా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని మాడుకు ప్రతి రాత్రి మర్దన చేయాలి.

నిమ్మ చుక్కలు, ఉసిరి రసం వేసి కలిపిన పుల్ల పెరుగును ప్రతిరోజూ మాడుకు పట్టించి అరగంటసేపు ఉంచినా లేక రాత్రి పడుకునే ముందు పట్టించి ఉదయం నిద్ర లేవగానే తలంటు స్నానం చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.

No comments:

Post a Comment