Tuesday, June 18, 2013

ఎటువంటి ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయాలి...?

పసితనంలో ఎటువంటి ఆహారపు అలవాట్లుచేస్తారో అవే జీవితంలో చాలాకాలం నిలుస్తాయి. అందుకే నడక నేరుస్తున్న రోజుల్లోనే పిల్లలకు అన్నిరుచులూ అందించాలంటారు. మూడేళ్ళ వయసు పిల్లలకు ఆహారం పెట్టే తల్లులు ఒకచోట కూర్చుని అన్నం తినే అలవాటు చేయాలి. అటూఇటూ తిరుగుతూ, ఆడుతూ తినేతిండి వంటపట్టదు. అన్నం 20 నమిషాలలో తినాలి.

ప్రతివారం ఒక కొత్త రుచిని అలవాటుచేయండి. ఆహారం రంగురంగుల్లో ఉండేలా చూడండి. పాలు, పెరుగులు రోజులో కనీసం మూడుసార్లు ఇవ్వడం మంచిది. ఆహారం పంటికి భిన్నంగా తగిలేలా చూడండి. మెత్తగా, బరకగా అప్పుడప్పుడు మారుస్తుండండి. పప్పు రోజులో రెండు సార్లు, ఒకసారి పండ్లు పెట్టాలి. అన్నంతో కూరగాయలు కలిపి పెట్టండి.

తమంత తాముగా తినేలా ప్రోత్సాహించండి. పిల్లలకు రుచులు తెలియాలి. అన్నీ కలిపి మిక్సీలో కొట్టిమిక్సిడ్ రుచులుగా చేయవద్దు. ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఆహారం పెట్టే అలవాటు అస్సలు మంచిది కాదు. అన్ని కూరగాయలూ తినపించండి.  

No comments:

Post a Comment