Tuesday, June 18, 2013

తులసి ఆకులతో గొంతు ఇన్ఫెక్షన్ మటుమాయం!

చాలా మందికి వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఇలాంటి వాటిలో గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. దీని నివారణకు వివిధ రకాల మందులను తీసుకుంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లకు మందులతో చికిత్స తీసుకునే దానికంటే వంటిట్లో అందుబాటులో ఉండే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే నయమైనట్టే.

గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారు ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగినట్టయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే, జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి విముక్తి లభిస్తుంది.

అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే మూత్ర సంబంధిత ఇనెఫెక్షన్‌ సమస్య విముక్తి పొందొచ్చు. 

No comments:

Post a Comment