Wednesday, June 19, 2013

తమలపాకు... జాజికాయల రసంతో దగ్గు మాయం

శ్వాస మార్గంలో ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు.

వాతావరణ మార్పులవలన, చల్లటి పానీయ సేవన వలన శ్వాస క్రియకు ఆటంకం ఏర్పడి దగ్గు వస్తుంది. దగ్గులో కఫం లేని పొడి దగ్గు, మామూలు కఫంతో కూడిన దగ్గు, రక్త కఫంతో కూడిన దగ్గు అంటూ పలు రకాలుగా ఉన్నాయి.

శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే ఈ దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. తమలపాకులో మిరియాలు, గుండపోక, వాముపువ్వు, పచ్చకర్పూరం, జాజికాయ వుంచుకుని దవడన పెట్టుకుని నమల కుండా ఆ రసాన్ని మాత్రమే మింగుతూ వస్తే రెండుపూటలకే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

No comments:

Post a Comment