Wednesday, June 19, 2013

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనె రాస్తే..!

* పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తే పాలు పొంగి బయటకు పోవు.

* పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది. కాని, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృధాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు.

* సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు.
* పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ క్లాత్ కట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే పాలలోని కొవ్వు మొత్తం పైకి తేలి మందపాటి మీగడ పొర తయారవుతుంది.

* శీతాకాలంలో పెరుగు తయారు కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ గిన్నెను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే పెరుగు గట్టిగా తయారవుతుంది.

* పెరుగు ఎక్కువ మోతాదులో మిగిలితే ఆ గిన్నె నిండుగా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ ఆ నీళ్లను మారుస్తూ ఉంటే పెరుగు పుల్లబారకుండా తాజాగా ఉంటుంది.

No comments:

Post a Comment