Tuesday, June 18, 2013

జీలకర్ర మంచిదా, నకిలీదా తెలుసుకోవడానికి..!?

కందిపప్పు ఉదజహరికామ్లం కలిపితే అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ కందిపప్పుగా భావించండి. వెన్నలో, నెయ్యిలో కల్తీ కనుగొనేందుకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పంచదార మిశ్రమాన్ని కలపాలి. ఐదు నిమిషాల తర్వాత నెయ్యి లేదా వెన్నకు ఎరుపు రంగు వస్తే అది కల్తీ అని భావించాలి.

వనస్పతిలో సామాన్యంగా గంజిపొడి, ఉడికిన బంగాళాదుంపను కల్తీ చేస్తుంటారు. దీనికి కొద్దిగా అయోడిన్ కలిపితే అది నీలిరంగు ఏర్పడినట్లయితే అందులో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి. జీలకర్ర మంచిదా, నకిలీదా తెలుసుకోవడానికి కొద్దిగా జీలకర్రను రెండు చేతుల మధ్య నలపండి. చేతికి రంగు అంటితే అది నకిలీదని గమనించండి.

No comments:

Post a Comment