Tuesday, June 18, 2013

పనిచేస్తున్నప్పుడు వెక్కిళ్ళు ఇబ్బందిపెడుతున్నాయా....?

వెక్కిళ్ళు ఒక రకమైన ఇబ్బందిని తెస్తాయి. కడుపులో ఉన్నదంతా ఒక పెద్ద అలలా ఎగిసిపడుతున్నట్లుగా కలిగే ఆ భావన అనుభవించేవారికి, చూసేవారికి కూడా ఇబ్బందికరమే. అతివేగంగా తినడం, తాగడం, మరీ చల్లని పదార్థాలు తీసుకోవడం, మరీ వేడిగా వున్నవి తీసుకోవడమే కాకుండా భావోద్రేకం, హఠాత్తుగా వచ్చిన వాతావరణ మార్పు వెక్కిళ్ళు రావటానికి కారణమవుతాయి. వెక్కిళ్ళు వస్తుంటే కొద్దిసేపు ఊపిరి బిగబట్టివుంచితే వాటంతటవే సర్దుకుంటాయి.

రెండుమూడు స్పూన్లు పంచదార నోట్లోవేసుకుని నమిలినా సర్దుకుంటాయి. వేలుతో అంగిటి భాగాన్ని తాకి, కదిలించినట్టు చేసినా వెక్కిళ్ళు ఆగుతాయి. వెల్లకిలా పడుకుని మోకాళ్ళు రెండింటిని మడచి ఛాతి దాకా లాక్కుని నొక్కి పెట్టినా తగ్గుతాయి. ఇంకా వెక్కిళ్ళు ఆగకుండా వెంటవెంటనే వస్తుంటే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment