Friday, May 18, 2012

వేసవిలో చంటి పిల్లల దాహం తీర్చడం ఎలా..!?


వేసవిలో చంటిపిల్లలకు దాహం తీర్చడంపై బాలింతలు, గృహిణిలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవిలో గృహిణిలు ఈ కింది చిట్కాలు పాటించడం మంచిది. వేసవిలో కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటిపిల్లలకు తాగించాలి. ఎండసమయంలో పంచదార ఉప్పు కలిపిన నీరు త్రాగించాలి.

పిల్లలకు ఖర్జూరం పళ్లను కొన్నిటిని నీళ్ళను నానవేసి ఆ నీరు ఎండాకాలంలో తాగించాలి. పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు నిమ్మరసం తాగించాలి. రెండు లేదా మూడు నెలల పిల్లలకు కూడా పళ్ళరసం తాగించడం మంచిది.

ఐదు లేదా ఆరు నెలల పిల్లలకు తినగలిగిన పళ్ళను ఆహారంగా ఇవ్వవచ్చు. మామూలుకంటే ఎండాకాలంలో ఎక్కువగా పళ్ళు తినిపించడం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

కొత్తిమీర తో ఫలితాలు బోలెడున్నాయ్

ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరపీ(రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.

కొబ్బరి నీళ్లు తాగితే గుండెకు ఎంతో మేలట!

పానియాల్లో కొబ్బరి నీరు పానీయం చాలే శ్రేష్టమైనది. వేసవిలో మహిళలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు.

వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగితే మంచిది.

ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు త్రాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు స్వేచ్చమైన మినరల్‌ వాటర్‌ అత్యదిక పరిశుభ్రమైంది. ఒక సెలైన్‌ వాటర్‌ బాటిల్‌తో సమానమైందని వైద్యులు చెపుతున్నారు.

కొబ్బరి నీటిలో 24 కేలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా లేత కొబ్బరి బోండాల్లో 90 నుండి 95 శాతం నీరు ఉంటుంది. ఇందులో అనేక ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇంకా రక్తంలోని ఎలక్ట్రోమెట్‌ సమతూకాన్ని కొబ్బరినీరు కాపాడుతుంది. కొబ్బరి నీరు వాతపేతాలను తగ్గిస్తుంది. అల్సర్‌ రోగులు కొబ్బరి నీటి సేవనం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

హెల్తీఫుడ్ అంటే ఏదో మీకు తెలుసా..!?

హెల్తీఫుడ్ అంటే ఏది రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఈ కథనం చదవాల్సిందే. తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి.

ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సు కంటే ఒకటి రెండెళ్లు తక్కువగా ఉంటుంది. యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్ చాకెలెట్‌లో కూడా యాంటీఅక్సిడెంట్లు ఉన్నాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లకు కొదవే ఉండదు.

అలాగే ఆలివ్‌ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్డీమర్ వ్యాధి బారిన పడే అవకాశం 67 శాతం తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోవాలి.

వారానికి రెండు సార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖం వంటి మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

ఇదేంటి.. కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఊబకాయం, హృద్రోగ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖానికి చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు అనుకుంటున్నారా.

ఇది నిజం.. బెల్జియంకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధక బృందం నిర్వహించిన పరిశోధనలో తేలినట్టు వెల్లడైంది. మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే విధంగా ఫాట్ సొల్యూషన్ పనికివస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

విచారంతో పాటు.. ఒబేసిటీ, మానసిక ఒత్తిడి కూడా ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా తగ్గుతుందని వెల్లడైంది. ఫాటీ ఫుడ్‌తో విచారణ కలిగించే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఈ పరిశోధన నిర్వహించిన బెల్జియం యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధకులు వెల్లడించారు.

ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు.

ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ద్వారా 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తెలియవచ్చింది. ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆ స్టడీలో తేలింది.

పొటాటో ప్రియులకు ఓ శుభవార్త..!?

పొటాటో ప్రియులకు ఓ శుభవార్త. బంగాళాదుంపతో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు పెరగుతారంటూ ఇప్పటి వరకు ఉన్న ప్రచారం తప్పు అని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పొటాటోతో చేసే చిప్స్ వంటి చిరు తిళ్లు తినడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతాయని భావిస్తున్నారా? అలాందేమీ లేదని కొత్త స్టడీ తేల్చేసింది.

బరువు తగ్గేందుకు బంగాళాదుంపలను తీసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బంగాళాదుంపలు సైతం కెలోరీల శాతాన్ని తగ్గిస్తాయని యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. బంగాళాదుంపలతో ఆరోగ్యానికి మేలేనని, బరువు తగ్గించే ప్రక్రియలోనూ బంగాళదుంపలు ఉపయోగపడుతాయి.

దాదాపు 12 వారాల పాటు భారీ బరువు గల మహిళలు, పురుషులపై జరిపిన పరిశోధనలో బంగాళాదుంపలను తీసుకోవడం ద్వారా కెలోరీల శాతం తగ్గుముఖం పట్టడం, రక్తంలో సుగర్ లెవల్స్, కార్బోహైడ్రేడ్లను నియంత్రిస్తున్నట్లు తెలియవచ్చింది. ఒక బంగాళాదుంపలో 110 కెలోరీలు, పొటాషియం 620 గ్రాములున్నట్టు గుర్తించారు.

స్లిమ్‌గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!?

స్లిమ్‌ ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.

ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.

అలాగే మితమైన చక్కెర కలిపిన టీ, కాఫీ, పాలును కూడా సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఇక రాత్రిపూట భోజన విషయానికి వస్తే నిద్రకు ఉపక్రమించేందుకు మూడు గంటల ముందే డిన్నర్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట మితమైన ఆహారంతో పాటు సూప్, సలాడ్, రోటీలు తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌కి చెక్‌ పెట్టే కూరగాయలు

నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

* బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మామూలు క్యారట్ల కన్నా బేబీ క్యారట్లలో ఉండే బీటా కెరొటిన్‌ను శరీరం తేలిగ్గా గ్రహించగలుగుతుంది. ఆ తేడా ఏకంగా 500 శాతం ఎక్కువ. కాబట్టి లేలేత క్యారట్లను ఆహారంలో తప్పనిసరి అంశం చేసుకోవడం మంచిది.

* నిండు ఎరుపుతో నోరూరించే చెర్రి పండ్లు తినండి. వాటిల్లో ఉండే ఒక పదార్థం క్యాన్సర్‌ని నిరోధిస్తుందని మంచి పేరు.

* వెల్లుల్లి సైతం క్యాన్సర్ కణాల్ని చంపేస్తుంది. అయితే దాన్ని వండుతున్నట్లైతే మాత్రం పొట్టు తీసి, తరిగి ఒక పదినిమిషాలు ఉంచండి. తర్వాతే వంటలో వేయండి. పొట్టు తీయగానే వేడి చేస్తే అందులో క్యాన్సర్‌తో పోరాడే పదార్థాలు తయారయ్యే అవకాశం తగ్గుతుంది.

* విటమిన్ డి తగుపాళ్లలో తీసుకునే వన్నిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువ. కాబట్టి వైద్య సలహాతో తగినంత విటమిన్ డి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

* టమాటాలు వాడండి. కూరల్లో, సూపుల్లో, రసం తీసి... ఏదో ఒక రూపంలో టమాటా తీసుకుంటే అందులో ఉండే లైకోపిన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* రిఫైన్‌డ్ ధాన్యం కన్నా తక్కువ పాలిష్ పట్టిన ధాన్యం వాడాలి. పూర్తిగా రిఫైన్‌డ్ ధాన్యం వాడిన మహిళల్లో బ్రెస్ట క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

* చల్లగా అయినా, వేడిగా అయినా గ్రీన్ టీ తాగండి.

* వారానికి రెండుసార్లు పాలకూర తిన్నవాళ్లలో... బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం సగానికి సగం తగ్గినట్లు పరిశోధనలో తేలింది.

బీన్స్ ఎక్కువగా తీసుకుంటే.!?

బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది.

బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే...

రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే మహిళలు తాజా కూరగాయలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజా కూరలతో మహిళలకు పెను సమస్యగా మారిన బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించాలంటే.. తాజా కూరగాయలతో పాటు ఆకుకూరలు తీసుకోవాలని చైనీస్ అధ్యయనంలో తేలింది.

ఆకుకూరలు, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి తీసుకుంటే క్యాన్సర్ మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని ఆ అధ్యయనం తేల్చింది. దాదాపు ఐదేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో ఐదువేల మంది మహిళలపై పరిశోధకులు పరిశోధన చేశారు.

వీరిలో ఆకుకూరలు, కూరగాయలు తీసుకునే మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆకుకూరలు, కూరగాయలు తీసుకునే వారిలో 62 శాతం నుంచి 22 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిందని తెలియవచ్చింది.

వారానికి రెండుసార్లు చేపలు తినండి..

మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు చెక్ పెట్టవచ్చునని కొత్త అధ్యయనంలో తేలింది. వారానికి రెండుసార్లు కాకపోయినా ప్రతి రెండువారాలకు ఒకసారి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలకు అడినోమా వ్యాధి సోకదని బోస్టన్‌లోని హర్వాద్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్ గియోవానుసికీ తెలిపారు.

అడినోమా అనేది పుట్టగొడుగు పరిణామంలో మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు. ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే చేపలను వారంలో ఒక్కసారైనా తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఇంకా వారంలో ఒక్కసారి ఆహారంలో చేపను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా పలు రోగాలను నయం చేయవచ్చునని పరిశోధనలో తేలినట్లు ఎడ్వర్డ్ చెప్పారు. 

టమోటో జ్యూస్‌తో ఎముకల బలాన్ని పెంచుకోండి..!!

పాలు తాగడం ద్వారా ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎముకల్లో బలాన్ని పెంచడానికి టొమాటో రసం కూడా బాగా ఉపయోగపడుతుందని కెనెడియన్ తాజా అధ్యయనంలో తేలింది. టొమాటోల్లో ఉండే లైకోపన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టొమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది.

అయితే తాజా టొమాటో జ్యూస్ వల్లే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్, కెచప్ రూపంలో నిల్వ ఉంచడం వల్ల లైకోపిన్ తగ్గుతుందని తేలింది. ఈ లైకోపిన్ అన్నది ఎర్ర రంగులో ఉండే క్యారట్, పసుపుపచ్చరంగులో ఉండే బొప్పాయి. పింక్ రంగులో ఉండే ద్రాక్షపళ్లలోనూ ఉంటాయని నిరూపితమైంది. ఇకపై ఎముకల బలానికి టొమాటో జ్యూస్‌నూ తీసుకోవచ్చు.

ఒకవేళ టొమాటోను జ్యూస్‌గా తీసుకోవడం ఇష్టం లేకపోతే... రుచికరంగా ఉండే క్యారట్, బొప్పాయి, ద్రాక్షలనూ ట్రై చేయవచ్చు. కానీ వాటన్నింటిలో కంటే టొమాటో జ్యూస్‌లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది.

ఆహారంతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండిలా..!

పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి. అందువలన అవసరమైనన్నీ పాలే తాగాలి.

పప్పు ధాన్యాలు, పచ్చని కూరలు, అరటి పళ్ళలో విటమిన్ బి కాంప్లక్స్ వుంటుంది. చర్మం మొద్దు బారకుండా ఈ మిటమిన్ కాపాడుతుంది. చర్మం అడుగు పొరలలోని జీవకణాలను బలంగా ఉంచటంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. బత్తాయి, మామిడి, టమోచా పళ్ళు, ఆకుకూరల్లో ఈ విటమిన్స్ లభిస్తాయి.

రక్తంలో లోహాల శాతం కూడా చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్రీములే అందాన్ని పెంచుతాయనుకోవడం భ్రమ. ఎక్కువసార్లు మొహం కడిగేవారు ప్రతీసారి సోపువాడకుండా కేవలం నీళ్ళతో మాత్రం కడుక్కోవాలి. రిలాక్స్‌గా ఉండటం కొద్ది వరకు చర్మానికి మంచిది.

ఎముకల పటుత్వానికి మహిళలు ఏం చేయాలంటే..!?

రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించిన పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.

రాగులలో కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్ధాప్యంలో వున్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్ధాలను భుజించడం వల్ల శరీరానికి బలం. శక్తి చేకూరుతాయి.

ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకలు పటుత్వానికి థాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

వేసవిలో కొత్త శక్తిని పొందాలంటే.. నిమ్మరసం తీసుకోండి!

వేసవిలో నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేడికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు బలాన్నిచ్చే టానిక్ నిమ్మరసం. నిమ్మరసానికి చల్లని నీటిని కలిపి చిటికెడు ఉప్పు, రెండు చెంచాల తేనె కలిపి తాగితే వేసవిలో కొత్త శక్తిని పొందగలుగుతారు.

ఇంకా నిమ్మకాయలో సి విటమిన్ విరివిగా లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సి విటమిన్ అవసరం. అనారోగ్యంతో వున్నవారు, కోలుకుంటున్నవారు నిమ్మకాయ వాడాలి.

అలాగే కాలిన గాయాలతో బాధపడేవారు నిమ్మకాయ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. నిమ్మరసాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. సి విటమిన్‌ను శరీరం గ్రహించేందుకు కొంత సమయం పడుతుంది.

ఆహారంలో కొవ్వు పదార్థాన్ని అధికంగా తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా వుంటే.. ఆ ఇబ్బంది నుంచి బయట పడేందుకు నీళ్ళలో కలిపిన తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

క్యాబేజీతో క్యాన్సర్‌కు బై...బై...!


మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయల్లో క్యాబేజీని కూడా చేర్చుకున్నట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దరిచేరకుండా చేయవచ్చు. అదెలాగంటే... క్యాబేజీలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారకాలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు.

ఎక్కువగా ఉడికించవద్దు క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి  మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం    

క్యాబేజీలో ఉండే ఐసోసయనేట్లకు క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం కలదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుందని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది. దేశంలో ప్రతి సంవత్సరం అనేకమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నవారే కాగా, వారిలో 15 శాతం మంది పొగతాగని వాళ్లే కావడం గమనార్హం.

ఇందులో భాగంగా... పొగతాగనివారిపైన, మహిళలపైన పరిశోధన చేయగా, ప్రతిరోజూ లేదా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా క్యాబేజీ తీసుకుంటున్న వారిలో శ్వాసకోశాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి, వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్‌లో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా చేర్చి తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంది.

అందుకనే క్యాబేజీలను సలాడ్‌గా గానీ, ఆవిరితోగానీ ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే పొగత్రాగని వారైనా, మహిళలైనా జన్యు పదార్థాలను బట్టి వీటి ప్రభావం ఉంటుందని గమనించాలి. ఇదిలా ఉంటే... క్యాబేజీ తినడం వల్ల క్యాన్సర్ బారినుండి తప్పించుకోవచ్చన్న అంశంపై ఇంకా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.

సాధారణంగా రోజుకు ఐదు లేదా ఆరు రకాల కూరగాయలను తప్పనిసరిగా తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని ఎన్నో రకాల పరిశోధనలు రుజువు చేశాయి.

చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష

చర్మం నలిగిపోయినట్లు, నల్లగా, కాంతిహీనంగా, పొడిబారిపోయినట్లు ఫీలవుతుంటే మాత్రం ఎవరైనా ద్రాక్ష పళ్లకు జేజేలు చెప్పాల్సిందే మరి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కడున్నా సరే చిట్లిపోయిన, మొరటుగా మారిన చర్మం చాలా అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి సహజమైన చర్మకాంతిని మీరు పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూపు సారించడానికి బదులు చౌకగా దొరికే ద్రాక్ష పళ్లను ఆరగించడం ఒక చక్కని పరిష్కారం..

ఒక మాటలో చెప్పాలంటే.. ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్ల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. మండే ఎండల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి పాతతరం అందగత్తెలు ఈ విధంగానే తమ అందాన్ని కాపాడుకునేవారట. పైగా శరీరంలో వేడిని పోగొట్టుకోవడానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

అందుకే తప్పనిసరిగా ద్రాక్ష పళ్ల రసం క్రమం తప్పకుండా తాగుతుండండి. ద్రాక్ష పళ్ల రసాన్ని తాగడంతో మాత్రమే సరిపెట్టుకోక ద్రాక్ష పళ్లను చర్మానికి పూతగా కూడా తయారు చేసుకుని నిగారింపులు తీసుకురావచ్చు. ఎలాగంటే

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌కు కొద్దిగా పౌడర్‌ను కలిపి దాన్ని పేస్టులా తయారు చేయండి. దానికి కీరదోస జ్యూస్ కాని, ద్రాక్ష రసం కాని కలుపుకుని చర్మానికి రాయండి. ఒక గంట తర్వాత దాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజ్ రాసుకుంటే మెరిసే నున్నని, మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.

గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..

గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. గుడ్ల వినియోగానికి, బ్రెస్ట్ క్యాన్సర్‌కి మధ్య సంబంధాన్ని నిరూపించే అదనపు సాక్ష్యాన్ని ఈ కొత్త అధ్యయనం బయటపెట్టింది.

ఉత్తర కరోలినా యూనివర్శిటీకి చెందిన స్టీవెన్ జైసెల్ అధ్వర్యంలో జరిగిన ఈ వ్యాధి నివారణ అధ్యయనానికి గాను దాదాపు 3 వేలమంది మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగివుండే కోలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 24 శాతం తగ్గిపోతాయని ఈ అధ్యయనంలో తేలింది.

కోలైన్ పదార్థాన్ని అధికంగా తీసుకున్న మహిళలు సగటున రోజుకు 455 మిల్లీ గ్రాముల కోలైన్‌ను వినియోగించారని, వీరు కాఫీ, గుడ్లు, స్కిమ్ మిల్క్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూ వచ్చారని స్టీవెన్ తెలిపారు. అలాగే రోజుకు సగటున 196 మిల్లీ గ్రాముల కంటే తక్కువ కోలైన్‌ను తీసుకునే మహిళలను సైతం ఈ అధ్యయనంలో పరీక్షించినట్లు చెప్పారు.

కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కోలైన్ చాలా అవసరం. వయసు, లింగంతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ కోలైన్ అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవచ్చు. మహిళలకు, ప్రత్యేకించి పిల్లలను పెంచే వయసులో ఉన్న మహిళలకు ఇది చాలా అవసరమని జైసెల్ పేర్కొన్నారు.

మనం తీసుకునే ఒక గుడ్డులో కనీసం 125.5 మిల్లీ గ్రాముల కోలైన్ ఉంటుంది. రోజూ మనం తీసుకోవాల్సిన కోలైన్ శాతంలో ఇది పావుభాగం అన్నమాట. అందుకే ఆహారంలో తప్పనిసరైన ఈ పోషక పదార్థాన్ని పొందాలంటే గుడ్లు తినడం చాలా అవసరం. గుడ్డులోని పచ్చసొనలో కోలైన్ అధికంగా ఉంటుంది. ఇకపోతే కాలేయం, గోధుమ మొలకలు, కాలిఫ్లవర్స్‌లో కూడా తగుమాత్రంలో కోలైన్ ఉంటుంది.

అయితే మనుషుల ఆహారంలో కోలైన్ తప్పనిసరి బలవర్థక పదార్థంగా ఉన్నప్పటికీ, చాలామందికి దీని గురించి కనీసం తెలియదని స్టీవెన్ పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో ఎంత కోలైన్ తీసుకోవాలో అమెరికన్ ప్రజలకు తెలియజేయవలసి ఉందని తెలిపారు.

కణాల సాధారణ పనితీరులో కోలైన్ కీలక పాత్ర వహించడమే గాదు... మెదడు, నరాలు, కాలేయ జీవ రసాయన ప్రక్రియ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా శరీరమంతటా పోషకపదార్థాలను సరఫరా చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే కాక, మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తుందని స్టీవెన్ జైసెల్ తెలిపారు.

ఈ అధ్యయనం అమెరికా మహిళలను ఉద్దేశించి చేపట్టిందే అయినప్పటికీ ప్రపంచంలో మహిళలందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి కోలైన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంపై ప్రచారం చేయవలసిన అవసరం ఉంది కదూ..

పోషక విలువలున్న ఫలం అరటి..!

మహిళలు బహు సుకుమారులు. అయితే నేటి పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా స్త్రీలు పోటీ పడుతున్నారు. పురుషులు ఎంత శ్రమిస్తున్నారో... మహిళలు కూడా అంతే శ్రమిస్తున్నారు. మరిలాంటి పోటీ ప్రపంచంలో ఆరోగ్య పరంగా నిలుదొక్కుకోవాలంటే మంచి పౌష్టిక, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.

అధిక పోషకవిలువలున్న వాటిల్లో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ ఫలాల్లో అత్యంత పోషక విలువలున్నది అరటి పండు. చౌకగా దొరికేదే కాకుండా ఔషధగుణాలను కూడా కలిగినది అరటి. రోగాలబారిన పడిన వ్యక్తులకు అరటి పళ్లను ఆహారంగా ఇవ్వడం ద్వారా త్వరగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడటును అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే అధికరక్తస్రావాన్ని తగ్గిస్తుందంటున్నారు.

పాలతో పండంటి ఆరోగ్యం

నేటి ఆధునిక యుగంలో స్త్రీలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటా బయట నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాలంతో పోటీ పడుతు పరుగులు తీసే మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం. కానీ సమయా భావం కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి.

మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి.

కనుకనే స్త్రీలు చిన్న వయస్సు నుంచే పాలను తీసుకోవడం ఎంతైన అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నోటిలో దంతాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి కూడా కాల్షియం బాగా ఉపకరిస్తుందని వారు తెలుపుతున్నారు.

పాలలో 87 శాతం నీరు, 4 శాతం క్రొవు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని వారు అంటున్నారు.

చిన్న వయస్సు అంటే 7-10 వయస్సు గల అమ్మాయిలు రోజుకు సుమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయస్సులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కువ పాలు, పాతికేళ్ళ వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, చాక్లేటులు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు

శరీరానికి పండ్లు చేసే మేలు

మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి.

ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్లు నిత్యము సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతముగా ఉంటుంది. మానశిక అలసట, చికాకు తగ్గి - జ్ఞాపకశక్తి అధికమవుతుంది. ఇకా నపుంసకత్వము నివారించబడుతుంది. నిద్రలేమి నశిస్తుంది.

ఏపిల్, కమలా, అరటి, నిమ్మ మొదలకు వాటిలో కాల్షియమ్, ఐరన్, ఏ, బీ, సీ విటమిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను సక్రమంగా పని చేయించుటలో బహు చక్కని పాత్రను నిర్వహిస్తాయి. గర్భవతులైన స్త్రీలు - ఫల రసాలను నిత్యము సేవిస్తూ వుంటే... ఎంతో మంచిది

ఎందుకంటే పిండము ఏర్పడిన కొద్దికాలము నుండే - ఆ పిండము ఏర్పడిన కొద్దికాలము నుండే ఆ పిండము యొక్క, గుండె పని చేస్తుంది. గుండె పని చేయుటలో తల్లి సేవించిన పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. రక్తపోటు గలవారికి పుచ్చకాయ అమోఘముగా పని చేస్తుంది.

సంపూర్ణ ఆరోగ్యానికి ఇవే...

గుండె ఆరోగ్యానికి కింది ఉదహరించిన వంటకాలవంటివాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా హృద్రోగాలకు దూరం కావచ్చును. రోజులో ఆయా వేళల్లో తీసుకోవాల్సిన పదార్థాలను, తయారీ విధానాలు దిగువ ఇవ్వబడ్డాయి.

ఉదయపు ఫలహారంగా బీట్‌రూట్, ఆరంజ్ సలాడ్ తీసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు...
1 కిలో బీట్‌రూట్ (చిన్నవి), 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాలు, 20 ఉల్లిపాయలు తరిగినవి, 2 ఆరంజ్‌లు తొనలు, 2 స్పూన్ హేజల్‌నట్ ఆయిల్, 1 స్పూన్ తరిగిన కొత్తిమీర, 1/2 కప్ ఆరంజ్ జూస్, 2 స్పూన్ హేజల్‌నట్స్ వేయించినవి

తయారీ విధానం: ఒవెన్‌ను 400 డిగ్రీల ఫారన్‌హీట్‌లో ఉంచాలి. బీట్స్ తరిగి ఉంచుకోవాలి. పాన్‌లో బీట్స్ ఉంచి ఆయిల్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 25 నిమిషాల వరకు వేయించాలి. ఉల్లిపాయలను ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 15 నిమిషాలు వేయించాలి.

ఆరంజ్‌లను చిన్నని తొనలుగా చేసి ఉంచాలి. చిన్న పాత్రలో హేజల్‌నట్ ఆయిల్, కొత్తిమీర మరియు ఆరంజ్ జూస్‌ను కలిపి ఉంచుకోవాలి. పాత్రలో బీట్‌రూట్, ఆరంజ్ తొనలను ఉంచి, వాటిపై వేయించిన ఉల్లిపాయలు ఉంచి, చివరగా కొత్తిమీర, హేజల్‌నట్స్ మరియు తురిమిన చీస్‌తో అలంకరించండి.

ఇక మధ్యాహ్న భోజనంగా గోధుమ పాస్తాను తీసుకోవచ్చు. దీనితయారీకి కావలసినవి... 1 ఉల్లిపాయ, 1 బంచ్ కాబేజీ, 1 ముల్లంగి సన్నగా తరిగినవి, 1 స్పూన్ చెర్రీ వైన్ వినిగర్, 1/2 స్పూన్ ఆరంజ్ రసం, 3/4 స్పూన్ ఉప్పు, వేయించి పొడి చేసిన మిరియాలు, 3 స్పూన్ ఆలివ్ ఆయిల్, 7 ఔన్స్ చీస్

తయారీ విధానం: ఒక పాత్రలో ఉల్లిపాయలను ఉంచి వాటిలో చల్లటి నీరు పోసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. మరో పాత్రలో నీరు పోసి వాటిని ఉడికించాలి. కాబేజీని కూడా ముందు చల్లని నీటిలో ఉంచి ఆ తరువాత ఉడికించాలి. అందులో ముల్లంగి ముక్కలు వేసి 30 సెకన్లకు ఉడికించాలి. వాటిని వడగట్టి వెంటనే చల్లటి నీటిలో వేయాలి.

పాస్తాను కూడా 8 నుంచి 9 నిమిషాల వరకు ఉడికించి, నీటిని వడగట్టి పక్కనే ఉంచాలి. పెద్ద పాత్రలో వినిగర్, ఆరంజ్ రసం, ఉప్పు మరియు మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. అందులో ఉడికించి ఉంచిన కాయకూరలు, పాస్తా, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. కాబేజీ, ముల్లంగి మరియు ఉల్లిపాయలతో అలంకరించి వడ్డించాలి.

సాయంత్రంవేళల్లో స్నాక్స్‌గా మామిడి స్ట్రాబెర్రీ కోన్స్ వంటివాటిని భుజించవచ్చు....
కావలసినవి: 2 మామిడి పండ్లు తరిగినవి, 1 స్పూన్ స్ట్రాబెర్రీలు తరిగినవి, 1 స్పూన్ నిమ్మరసం, 8 కప్స్ ఐస్, పుదీనా

తయారీ విధానం: మామిడి పండ్లు మరియు స్ట్రాబెర్రీలను బాగా చిలక్కొట్టి, అందులో నిమ్మరసాన్ని కలపాలి. ఐస్ క్యూబ్‌లను చిన్న ముక్కలుగా చేసి అందులో పండ్ల రసాన్ని కలిపి పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించాలి.

ఇక రాత్రి భోజనంగా వాల్‌నట్ ఆపిల్ సలాడ వంటివి గుండెకు బలాన్ని, అదే సమయంలో హానిచేయని పదార్థాలను తీసుకోవచ్చు. కావలసినవి: 1/2 కప్ వాల్‌నట్ బద్దలు, 1/2 కప్ పెరుగు, 2 స్పూన్ మమనీస్, 2 స్పూన్ పార్‌స్లీ, ఆకులు, 1 స్పూన్ తేనె, 1/2 నిమ్మకాయ తరిగినది, వేయించి పొడి చేసిన నల్ల మిరియాలు, 2 ఆపిల్, 2 రిబ్స్ సెలరీ,
1/4 కప్ కిస్‌మిస్, 1/2 స్పూన్ నిమ్మరసం

తయారీ విధానం: ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో ఉంచాలి. బేకింగ్ షీట్‌లో వాల్‌నట్స్‌ వేసి 8 నుంచి 10 నిమిషాల వరకు వేయించాలి. పాత్రలో పెరుగు, మయనీస్, పార్‌స్లీ, తేనె మరియు నిమ్మకాయ మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. వాటిలో కట్ చేసి ఉంచిన ఆపిల్‌, సెలరీని వేసి వాటిపై నిమ్మరసం చల్లి, వడ్డించాలి.

పౌష్టిక ఆహారం మొక్కజొన్న

సలాడ్ మొక్కజొన్నకూడా కలుపుకోవచ్చు. కమ్మని వాసన వచ్చే లేత మొక్కజొన్న పచ్చి కూరల సలాడ్‌కి మంచి రుచినిస్తుంది.

లేత మొక్కజొన్న కండెల్ని ఉడికించి తినటం చాలామందికి అలవాటే. అయితే వాటిని నీటిలో వేసి ఉడికించకుండా ఆవిరి మీద ఉడికించాలి. నీటిలో ఉడికిస్తే కొన్ని పోషకాలు వృథాగా పోతాయి.

మొక్కజొన్నలో సి విటమిన్, పీచు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలమీద ఉండే పొట్టు గుండెకు మేలు చేస్తుంది. ఎలాగంటే ఇందులో ఉండే కరిగిపోయే పీచు పదర్థం పైత్యరసంలోని కొలెస్టరాల్‌తో కలుస్తుంది. దాన్ని తన వెంట తీసుకుని శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది.

ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త

వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆహారం తీసుకోవడం మంచిదని న్యూట్రిషన్లు పేర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని సానుకూల స్థాయిలో నియంత్రించడం, మనదేహంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల్లో 25 శాతాన్ని చెమట ద్వారా బయటికి పంపడానికి అధికంగా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. అదీనూ వేసవిలో తీసుకుంటే చర్మవ్యాధులు, విరేచనాలు, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు దరికి చేరవని వైద్యులు పేర్కొంటున్నారు.

అయితే వర్షాకాలంలో ఈ కొబ్బరి బోండాలను తీసుకోవడంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయలను తీసుకుంటే జలుబు చేసే అవకాశాలు మెండు. వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ సీజన్‌‌లో ఆపిల్ వంటి పండ్లను తీసుకోవడం మంచిది. అదే విధంగా శీతాకాలంలోనూ ఆపిల్, బొప్పాయి పండ్లను తీసుకోవచ్చు. పుచ్చకాయ జ్యూస్‌ను తాగితే చర్మం ఛాయ మెరుగవుతుంది.

అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషక పదార్థాలు సమకూరుతాయి. పుచ్చకాయను వేసవిలో ఎక్కువగానూ, మిగిలిన సీజన్లలో కాస్త తక్కువ మోతాదులో తీసుకుంటే అయొడిన్, సిలికాన్, సోడియం వంటి ఖనిజపదార్థాలు సమకూరుతాయి. పుచ్చకాయ జ్యూస్ మూత్రసంచిలోని రాళ్లను తొలగించేందుకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.  

కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా?

కీళ్ల నొప్పులతో బాధపడేవారు మందులవాడకం కంటే... పోషక ఆహారంపై ఆధారపడటం మేలంటున్నారు వైద్యులు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు. కూరగాయలు ఎక్కువగా ఉండే కూరలను అన్నంలో చేర్చుకుని తినాలి. పోషక ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

నీళ్లు పోసి ఉడికించిన ఆహార పదార్థాలను అంటే ఇడ్లీ వంటి పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు రెండు సార్లు పండ్లు తీసుకుంటూ ఉండాలి. పాలకూరను తరచుగా వండుకుంటూ ఉండాలి. ఆపిల్ వంటి పండ్లను తీసుకోవడం మంచిది.

బాదంపప్పు, చేపల కూరను తింటూ ఉంటే కీళ్ల నొప్పులను బారి నుండి తప్పుకోవచ్చునని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. గాయం తగిలినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా వెంటనే శరీరం వేడెక్కడం సహజమే. ఇలాంటివి జరిగేటప్పుడు ఆహారం మాని బ్రెడ్‌ వంటి తేలిక ఆహారం తీసుకోవడం మంచిది కాదు. వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పోషక ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కీళ్ల నొప్పులను తగ్గేందుకు ఆస్కారాలున్నాయి.

తాపాన్ని తగ్గించే తాటి ముంజల గీర్

కావలసిన పదార్థాలు:

పాలు .. ఒక లీటరు
లేత తాటి ముంజలు .. కావలసినన్ని
జవ్వాజి .. కాల్ కప్
చక్కెర .. అవసరమైనంత
ఏలకుల పొడి .. అర టీ స్పూన్

తయారీ విధానం:

లేత తాటి ముంజలను తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. జవ్వాజిని బాణలిలో వేసి వేయించి ఉంచుకోవాలి. పాలను చాకి, కొంత మేరకు కాగిన తర్వాత ఆ పాలలో చక్కెర, జవ్వాజి. ముంజల ముక్కలను వేసి కలపాలి. తర్వాత ఏలక పొడి చేర్చాలి. కొద్ది సేపు స్టౌవ్‌పై ఉంచి దించి పక్కన పెట్టుకుని, చివరిగా టెంకాయ పాలను కలిపి, చల్చార్చి ఆరగిస్తే తాపాన్ని తగ్గిస్తుంది.

రోజుకో అరటిపండు తినండి

నగరాల్లో జీవించే మహిళలు అదీ వర్కింగ్ ఉమెన్‌ చాలా బిజీ బిజీగా ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపక ఏదో ఆహారం తిన్నామని తిని ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారు.. ప్రతిరోజు అన్నీ రకాల పండ్లను తినకపోయినా అరటిపండును రోజుకు ఒకటి చొప్పున తింటే ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి.

అరటి పండులో బి5, బి3, బి6 మాంసకృత్తులు పొటాషియం బయోటిన్, మాంగనీస్ వంటి పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మీతో పాటు మీ పిల్లలకీ ఈ అరటి పండును నేరుగా ఇవ్వకుండా వారికి నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వండి. ఐస్‌క్రీమ్‌‌లపై బాదం, జీడిపప్పు ముక్కలను వేసి అందులో ఈ అరటి పండు ముక్కలను కూడా చిన్నవిగా తరిగి వేసి ఇవ్వండి.
బ్రెడ్‌లపై సాస్‌వేసే ముందు అరటి పండు ముక్కల్ని వేసి వాటిపై సాస్‌, జీడిపప్పు, బాదం పప్పులను వేసి ఇవ్వండి.

ఇలా అరటి పండును నేరుగా కాకుండా వేరే విధంగా ఇచ్చినా తగిన పోషకాలు అందుతాయి. ఇలా కాకుండా పండిన అరటి పండును తీసుకుని మెత్తగా చేసుకుని అందులో కిసిమిస్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, బాదంపప్పులను కలిపి ఈ మిశ్రమాన్ని బిస్కెట్లు, బ్రెడ్ స్లైసులపై వేసి పిల్లలకు ఇస్తే మారాం చేయకుండా తింటారు. ప్రతిరోజు మహిళలు నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసుడు పాలు, ఒక అరటిపండును తినడంతో పోషక పదార్థాలు అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

Thursday, May 17, 2012

గుత్తి వంకాయ కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • తాజా వంకాయలు... ½ కిలో
  • ఆవాలు... 1/2 టీస్పూ//
  • ఉప్పు... 2 టీస్పూ//
  • అల్లం... 2 ముక్కలు
  • నూనె... 2 టీస్పూ//
  • పచ్చి మిర్చి... 10

తయారీ విధానం


ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలిగుత్తుగా .
లేత వంకాయలను చివర విడిపోకుండా, నాలుగు భాగాలుగా కోసి, అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి.
స్టౌ మీద బాణెలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేయించుకోవాలి.
ఇందులో గుత్తి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి .
ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి.
అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి. 

కందిగింజల వేపుడు


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • పచ్చి కందిగింజలు 1 కప్పు
  • టొమోటోలు.. 1/4 కేజీ
  • మెంతి ఆకు.. 1 కప్పు
  • ఉల్లిపాయ.. ఒకటి
  • కారం పొడి.. 2 టీస్పూ//
  • అల్లం వెల్లుల్లి పేస్టు.. 1/2 టీస్పూ//.
  • కరివేపాకు 2 రెమ్మలు
  • పసుపు 1/4 టీస్పూ//.
  • గరం మసాలా 1/4 టీస్పూ//.
  • కొత్తిమీర తురుము 1/2 కప్పు
  • ఉప్పు, నూనె.. సరిపడా
  • పంచదార.. చిటికెడు

తయారు చేయు విధానం :


బాణిలో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి.
దీనిలో కంది గింజలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కొంచెం సేపు వేపుకోవాలి.
తర్వాత టొమోటో ముక్కలు, పంచదార వేసి ఉడికించాలి.
సన్నటిమంట మీద కాసేపు ఉంచాక, దించి, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి

తోటకూర కాడల మసాలా కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • తోటకూర కాడలు లేతవి తగినన్ని
  • యాలక్కాయలు 3
  • ఉల్లిపాయలు 2
  • లవంగాలు 4
  • రెండు నూనె.. 3 టీస్పూ//.
  • దాల్చిన చెక్క కాస్తంత
  • ఉప్పు, కారం తగినంత
  • గసగసాలు 2 టీస్పూ//.
  • అల్లం చిన్న ముక్క
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • ఆవాలు 1/4 టీస్పూ//.
  • జీలకర్ర 1 టీస్పూ//.
  • మినప్పప్పు 1 టీస్పూ//.

తయారీ విధానం


ముందుగా తోటకూర కాడలను కడిగి ముక్కలు చేసుకోవాలి.
ఉల్లిపాయల్ని కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి.
మసాలా దినుసులన్నీ పొడికొట్టుకుని వుంచుకోవాలి.
అల్లం వెల్లుల్లిని మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి.
పొయ్యిమీద బాణెలి పెట్టి అందులో నూనె వేయాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు బాణెలిలో వేసి పోపు పెట్టాలి.
తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించిన, తర్వాత తోటకూర కాడల ముక్కలను వేయాలి.
కాసేపు వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి మసాలా పొడి, ఉప్పు, కారం, ముక్కలపై జల్లి, అవసరమైనంత నీరు పోసి కొంచెం సేపు బాగ ఉడకనివ్వాలి.
సెగమీద నుండి దింపుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి

నూనె వంకాయ కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • ఉల్లిపాయలు 1/4 కిలో
  • టమోటాలు 1/4 కిలొ
  • గుత్తి వంకాయలు 1/2 కిలో
  • శనగ గుండ్లు 1/2 కప్పు
  • పచ్చి పప్పు 1/4 కప్పు
  • ధనియాలు 1/4 కప్పు
  • పుట్నాల పప్పు 1/4 కప్పు
  • ఎండు మిర్చి 6 కాయలు
  • ఉప్పు తగినంత
  • నువ్వులు 1/4 కప్పు
  • నూనె 1/4 కప్పు
  • పోపు గింజలు తగినన్ని
  • పసుపు 1 టీస్పూ//
  • కొత్తిమీర 2 చిన్న కట్టలు

తయారు చేయు విధానము :


ముందుగా కూరలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి(గుత్తి వంకాయల్లాగానే).
ఇప్పుడు శనగపలుకులు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులు ఒక బాణెలిలో వేయించుకోవాలి.
దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి.
నూనె కాగాక ,పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.
ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి, వంకాయలు ఉడికి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి.
తర్వాత ఇందాక పక్కన పెట్టిన పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి. 

బీట్రూట్ కూర


Picture  Recipe

కావలసిన పదార్ధాలు:


  • బీట్రూట్ ముక్కలు: 1 చిన్న కప్పు
  • ఉడికించినది కంది పప్పు: 2 కప్పులు
  • ఉడికించినది చిక్కటి చింతపండు పులుసు: 1 కప్పు
  • నీరు: 2 కప్పులు
  • ఉప్పు: తగినంత
  • పోపుకి :ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తగినంత

కూటు తయారికి:


  • ధనియాలు:1 టీస్పూ//
  • శనగపప్పు: ½ టీస్పూ//
  • మినపప్పు:1/4 టీస్పూ//
  • ఎండు మిరపకాయలు: 4
  • ఎండు కొబ్బరి: 1 టీస్పూ//
  • ఇంగువ: చిటికెదు
  • నూనె: ¼ టీస్పూ//

తయారి విధానం:


ముందుగా బాణెలిలో కొంచెం నూనె వేసి కూటు తయారీకి కావలసిన పదార్ధాలన్ని వేసుకుని దోరగ వేయించుకుని, బాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా వుంటే కూటు అంత బాగుంటుంది.
తరువాత మూకుడులో కొంచెం నూనె వేసి పోపు వేసి వేయించుకున్నాక, ఉడికించిన బీట్రూట్ ముక్కలు, చింతపండు పులుసు పోసుకుని దానికి నీరు కలిపి తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి.
ఇది బాగ కళ పెళ ఉడుకుతున్నప్పుడు పైన రుబ్బుకున్న కూటు కలిపి ఉడకనివ్వాలి.
ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఉడికించుకున్న కంది పప్పు కూడ కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 

బెల్లం కాకర కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • కాకరకాయలు.. 1/4
  • కేజీ ఉల్లిపాయలు. 2
  • ఆవాలు.. 1/4 టీస్పూ//.
  • జీలకర్ర.. 1/4 టీస్పూ//
  • కారం.. 1/4 టీ.
  • ఎండుమిర్చి 2
  • బెల్లం. 100 గ్రా.
  • చింతపండు గుజ్జు. 3 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • నూనె. సరిపడా

తయారీ:


కాకరకాయలను ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలమీద ఉప్పు చల్లి నీళ్లు పోసి ఉడికించాలి.
తరువాత నీళ్లన్నింటినీ వార్చేయాలి. ఓ వెడల్పాటి బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
ఇందులో ఉడికించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం వేసి నీరు ఆవిరయ్యేంతదాకా సన్నటి మంటమీద మగ్గించాలి.
బెల్లం, పాకంల్లా మారి కాకరకాయ ముక్కలకు అంటుకున్న తరువాత చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించి దించేయాలి. 

మసాలా బీన్స్ కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • సోయా చిక్కుళ్లు 1/4 కేజీ
  • ఉల్లిపాయలు. 100 గ్రా.
  • టొమోటోలు. 50 గ్రా.
  • వెల్లుల్లి. 25 గ్రా.
  • అల్లం. 15 గ్రా.
  • పచ్చిమిర్చి 10 గ్రా.
  • పసుపు. తగినంత
  • ఛాట్ మసాలా 2 టీస్పూ//.
  • నూనె. సరిపడా
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానం :


సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్‌లో పది నిమిషాలు ఉడికించాలి.
అల్లం, వెల్లుల్లి, టొమోటో, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగిపెట్టుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేగాక.. ఉల్లిపాయలు, టొమోటో ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి.
ఆపై పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చిక్కుళ్ళు వేసి రెండు నిమిషాలు వేయించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి.
చివర్లో ఛాట్‌మసాలా చల్లి.. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది

మెంతి టొమోటో కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • టొమోటోలు 1/4 కేజీ
  • మెంతికూర 1 కప్పు
  • కొబ్బరికోరు 1 టీస్పూ//.
  • ఉల్లిపాయ 1
  • కారం 1 టీస్పూ//..
  • ఉప్పు తగినంత
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూ//.
  • నూనె 1 టీస్పూ//.
  • ధనియాలపొడి 1 టీస్పూ//.
  • కరివేపాకు 2 రెబ్బలు
  • కొత్తిమీర తగినంత
  • జీలకర్ర,
  • ఆవాలు 1 టీస్పూ//.

తయారు చేయు విధానము:


బాణెలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి.
శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి.
తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి.
అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి.
ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి, చివర్న కొత్తిమీర చల్లుకోవాలి. 

మొలకెత్తిన పెసల కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • మొలకెత్తిన పెసలు. 150 గ్రా.
  • టొమోటోలు.. 4
  • పచ్చిమిర్చి. 2
  • కరివేపాకు. 1 కట్ట
  • నూనె, ఉప్పు.. తగినంత
  • జీలకర్ర.. ½ టీస్పూ//
  • అల్లం వెల్లుల్లి ముద్ద. 2 టీస్పూ//
  • ఉల్లిపాయలు.. 200 గ్రా.
  • క్యారెట్, క్యాప్సికమ్ తరుగు.. 1/2 కప్పు

తయారు చేయు విధానము :


మొలకెత్తిన పెసలను ఉడికించి, వడగట్టి ఉంచాలి.
బాణెలిలో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.
అందులోనే పచ్చిమిర్చి తరుగు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి.
ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద, టొమోటో ముక్కల్ని కూడా కలిపి కాసేపు వేయించాలి.
తరువాత ఉడికించిన పెసల్ని కూడా కలిపి, ఐదు నిమిషాలపాటు ఉడికించి చివర్లో కొత్తిమీర తరుగును పైన చల్లి దించేయాలి.
ఈ కూరను బ్రెడ్ ముక్కల మధ్యలో ఉంచి సాండ్విచ్ లాగా కూడా తినచ్చు

బొప్పాయి ఆవకూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • పచ్చిబొప్పాయి..1
  • చింతపండు. నిమ్మకాయంత
  • ఉప్పు. తగినంత
  • పసుపు. చిటికెడు
  • ఆవాలు. 4 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 4
  • కరివేపాకు. 2 రెబ్బలు
  • పోపు కోసం.
  • నూనె.4 టీస్పూ//.
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • శెనగపప్పు.1 టీస్పూ//.
  • ఎండుమిరపకాయలు. 2

తయారు చేయు విధానం :


బొప్పాయి చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా నీరు పోసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
ముక్కలు ఉడికాక చిల్లుల ప్లేటులో వేసి నీరంతా వంపేయాలి. చింతపండును కొద్ది నీళ్లలో నానబెట్టి గుజ్జు తియ్యాలి.
ఆవాలు మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని ఉంచుకోవాలి.
ఇప్పుడు బాణెలిలో నూనె వేసి, తీశాక పచ్చిమిర్చి, బొప్పాయి ముక్కల్ని వేసి కలపాలి.
తరువాత చింతపండు గుజ్జువేసి రెండు నిమిషాలు ఉడికించి, ఆవ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించితే ఆవకూర సిద్ధం. ఆవ వేసిన తరువాత స్టౌమీద ఉడికించకూడదు. 

అరటికాయ-65


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • అరటికాయలు. 2
  • కార్న్‌ఫ్లోర్. 50 గ్రా.
  • నూనె. తగినంత
  • మైదా. 25 గ్రా.
  • గిలకొట్టిన పెరుగు. 1 కప్పు
  • పచ్చిమిర్చి. 4
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • కారం. 1 టీస్పూ//
  • టేస్టింగ్ సాల్ట్.. 1/2 టీస్పూ//
  • మిరియాలపొడి. 1/4 టీస్పూ//
  • అల్లంవెల్లుల్లి ముద్ద. 1 టీస్పూ//
  • ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్. 1/4 టీస్పూ//
  • గ్రీన్ చిల్లీ సాస్. 2 టీస్పూ//
  • ఉప్పు.. తగినంత

తయారు చేయు విధానం :


ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి.
కార్న్‌ఫ్లోర్‌లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, గ్రీన్‌ చిల్లీసాస్‌, టేస్టింగ్‌సాల్ట్‌, ఆరెంజ్‌ రెడ్‌ ఫుడ్‌ కలర్‌, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి.
గుజ్జులా తయారైన దీన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనివ్వాలి.
బాణెలి లో నూనె పోసి, బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి.
వేగిన ముక్కల్ని నూనె వార్చి ఉంచుకోవాలి. బాణిలి లో కొద్దిగా నూనె ఉంచి, మిగిలిన దాన్నంతా వేరే పాత్రలోకి వంపేయాలి.
ఇప్పుడు ఈ బాణిలి ని వేడి చేసి పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించాలి. చివరగా కరివేపాకు చల్లి, గరిటెతో కలిపి దించేయాలి. 

అరటికాయ పిట్టూ


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • అరటికాయలు. 2
  • నూనె. 50 గ్రా.
  • పచ్చికొబ్బరి తురుము. 1 కప్పు
  • ఉల్లికాడ తురుము. 1 కప్పు
  • కొత్తిమీర తురుము. 1 కప్పు
  • పచ్చిమిర్చి. 4
  • నిమ్మరసం. 2 టీస్పూ//
  • కరివేపాకు. 1 రెమ్మ
  • ఛాయ మినప్పప్పు. 1 టీస్పూ//
  • ఆవాలు. 1/2 టీస్పూ//
  • జీలకర్ర. 1/4 టీస్పూ//
  • కారం. 1/2 టీస్పూ//
  • పసుపు. 1/4 టీస్పూ//
  • ఉప్పు. తగినంత
  • ఎండుమిర్చి. 1
  • ఇంగువపొడి. 1/4 టీస్పూ//

తయారు చేయు విధానం :


అరటికాయల్ని రెండుగా కోసి ఆవిరి మీద ఉడికించి, తొక్క తీసి, పొడిపొడిగా చిదపాలి.
దీంట్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కారం, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, ఉల్లికాడ తురుము వేసి కలపాలి.
బాణెలి లో నూనె పోసి కాగిన వెంటనే మినప్పప్పు వేసి కొద్దిగా వేయించాలి.
ఆ తరువాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ కూడా వేసి దోరగా వేయించి, ఆపై అరటికాయ మిశ్రమాన్ని కూడా వేసి అట్లకాడతో కదుపుతూ వేయించి దించేయాలి.
అంతే అరటికాయ పిట్టూ రెడీ. 

బచ్చలి.. కంద కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • బచ్చలి కూర. 2 కట్టలు
  • కంద. 1/4 కేజీ
  • చింతపండు. కాస్తంత
  • ఉప్పు. సరిపడా
  • ఆవాలు. 4 టీస్పూ//
  • నూనె. 4 టీస్పూ//
  • పచ్చిమిర్చి. 4
  • ఎండుమిర్చి. 4
  • శెనగపప్పు. 1 టీస్పూ//
  • మినప్పప్పు. 1 టీస్పూ//
  • కరివేపాకు. 2 రెమ్మలు

తయారు చేయు విధానం :


కంద చెక్కు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి కూరని సన్నగా తరగాలి.
రెండింటినీ శుభ్రంగా కడిగి పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించి దించి, చిల్లుల పళ్లెంలో వేసి నీరు పిండాలి.
చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి ఉంచాలి.
బాణెలి లో నూనె వేసి కాగాక శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు వేయాలి.
అవి ఎర్రగా అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే కూర తయార్‌. 

బగారా బైంగన్


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • లేత గుండ్రని వంకాయలు.1/4 కేజీ
  • టొమోటోలు. 5
  • ఉల్లిపాయలు. 4
  • కొత్తిమీర. 1 కట్ట
  • అల్లం. కొద్దిగా
  • వెల్లుల్లి. 5 రేకలు
  • కారం. 1 టీస్పూ//.
  • ధనియాలు. 2 టీస్పూ//.
  • దాల్చిన చెక్క. 4
  • లవంగాలు... 4
  • పసుపు.. 1/2 టీస్పూ//.
  • గసగసాలు. 2 టీస్పూ//.
  • నూనె. 2 కప్పులు
  • తేజ్‌పత్తా (మసాలా ఆకులు). 6

తయారు చేయు విధానం :


వంకాయలు విడిపోకుండా గుత్తివంకాయ మాదిరిగానే కోసి, నీళ్లలో వేయాలి.
బాణెలిలో నూనె వేసి కాగాక నీటిలోంచి వంకాయల్ని తీసి పొడి బట్టతో తుడిచి మెత్త బడేదాకా వేయించి తీసేయాలి.
ఉల్లి, వెల్లుల్లి, అల్లం, మసాలా దినుసులన్నింటినీ మెత్తగా రుబ్బి. వంకాయలు వేయించిన నూనె లోనే కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి.
రుబ్బిన టొమోటో మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి.. ఉప్పు, పసుపు, కారం, రెండు గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించి గ్రేవీ తయారు చేయాలి.
ఈ గ్రేవీలో వేయించి ఉంచిన వంకాయల్ని వేసి మరికాసేపు ఉడికించి.. దించేముందు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. చివర్లో తేజ్‌పత్తాను వేస్తే బగారా బైంగన్ సిద్ధమైనట్లే. 

కాకర బగారా


Picture  Recipe

కావలసిన పదార్థాలు


  • కాకరకాయలు. 1/2 కేజీ
  • ఉల్లిపాయలు. 4
  • ఆవాలు. 1/4 టీస్పూ//
  • ఎండుమిర్చి.. 2
  • నువ్వులు.. 2 టీస్పూ//
  • వేరుశెనగపప్పు.. 50 గ్రా.
  • ఎండుకొబ్బరి.. 50 గ్రా.
  • ధనియాలపొడి. 1 టీస్పూ//
  • కారం. 1 టీస్పూ//
  • కరివేపాకు. 1 కట్ట
  • నూనె.. సరిపడా
  • చింతపండురసం.. 2 కప్పులు
  • బెల్లం.. కాస్తంత
  • ఉప్పు.. తగినంత

తయారు చేయు విధానం :


కాకరకాయ ముక్కలను కోసి నూనెలో వేయించి తీసి పక్కనపెట్టాలి.
నువ్వులు, వేరుశెనగపప్పు, ఎండుకొబ్బరిలను విడివిడిగా వేయించి చల్లారాక ముద్దలా నూరి పక్కన ఉంచాలి.
ఓ గిన్నెలో సుమారుగా అరకప్పు నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు వేయాలి.
తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
ఇప్పుడు కారం, ధనియాలపొడి, మసాలా ముద్ద కూడా వేసి బాగా కలిపి, నూనె పైకి తేలేవరకూ వేయించాలి.
ఆపై చింతపండురసం, ఉప్పు, బెల్లం అన్నీ వేసి సన్నని మంటమీద ఉడికించాలి.
చివరగా, వేయించి తీసిన కాకరముక్కల్ని కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించేయాలి. అంతే బగారా కరెలా సిద్ధం.

కొబ్బరి కాకరకాయ


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • కాకరకాయలు. పెద్దవి 2
  • కొబ్బరితురుము. 6 టీస్పూ//.
  • పుట్నాలపప్పు. 5 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//
  • ఉప్పు.. తగినంత
  • చింతపండు గుజ్జు.. 1 టీస్పూ//
  • పోపుకోసం. నూనె. 2 టీస్పూ//
  • ఆవాలు. 1 టీస్పూ//
  • మినప్పప్పు. 1 టీస్పూ//
  • శెనగపప్పు. 1 టీస్పూ//

తయారు చేయు విధానము :


బాణెలి లో నూనె వేసి ఆవాలు వేసి చిటపటమన్నాక మిగిలిన పోపుగింజలు కూడా వేసి వేయించాలి.
తరువాత సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ ఉడికించాలి.
పుట్నాలపప్పు, చింతపండు గుజ్జు, కొబ్బరి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.
ముక్కలు ఉడికిన తరువాత ఈ పేస్టుని అందులో వేసి కొద్దిగా వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉప్పూకారం వేసి కూర చిక్కబడేవరకూ ఉడికించి దించితే రుచికరమైన కాకర కర్రీ రెడీ.

పచ్చిబఠాని( క్యారెట్ ) కూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • ఎర్రటి క్యారెట్. 350 గ్రా.
  • పచ్చిబఠాణీ. 200 గ్రా.
  • ఉల్లిపాయలు. 2
  • అల్లంవెల్లుల్లి. 2 టీస్పూ//
  • టొమోటో గుజ్జు. 1 కప్పు
  • కారం. 1/2 టీస్పూ//
  • ఉప్పు. తగినంత
  • నూనె. 2 టీస్పూ//
  • జీలకర్ర. 1 టీస్పూ//
  • ఎండుమిర్చి. 2
  • ధనియాలపొడి. 1 టీస్పూ//

తయారు చేయు విధానం :


క్యారెట్ ను చిన్న సైజు ముక్కలుగా తరిగి నీళ్లలో వేసి ఉడికించి, నీటిని వంపేయాలి.
క్యారెట్ ముక్కల మాదిరిగానే బఠాణీలను కూడా విడిగా ఉడికించి ఉంచాలి.
ఓ బాణెలిలో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి దోరగా వేయించాలి.
అందులోనే అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, టొమాటో గుజ్జు వేసి దగ్గరగా ఉడికించాలి.
ఆపై దాంట్లో ఉడికించిన గాజర్‌ ముక్కలు, బఠాణీలను కూడా వేసి కలపాలి.
చివరగా ధనియాల పొడి చల్లి, ఉప్పు సరిచూసి కాసేపు ఉడికించి దించాలి. అంతే రెడ్ క్యారెట్ మటర్ రెడీ. 

వంకాయ కొబ్బరికూర


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • వంకాయలు. 1/4 కేజీ
  • పచ్చికొబ్బరి చిప్ప. 1
  • తెల్ల నువ్వులు. 50 గ్రా.
  • గసగసాలు. 2 టీస్పూ//
  • పచ్చిమిరపకాయలు. 8
  • నూనె. 1/2 కప్పు
  • పసపు. చిటికెడు
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానం :


వంకాయల్ని గుత్తివంకాయ కూరలో మాదిరిగా కోసి నీళ్లలో వేయాలి.
కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్‌ చేసి కాయల్లో కూరాలి.
తరువాత బాణెలి లో నూనె వేసి వంకాయలు సమానంగా సర్దాలి. పైన పసుపు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టాలి. మూత మీద కూడా నీళ్లు పోయాలి.
అలా చేయడం వల్ల కూరలో నేరుగా నీళ్లు పోయకపోయినా ఆవిరి లోపలికి వెళ్లి తక్కువ నూనెతో బాగా ఉడుకుతుంది.
మధ్యమధ్యలో కడాయిని రెండు చేతులతో పట్టుకుని కిందికీ పైకీ కుదపాలి. అలాచేస్తే కాయలు విడిపోకుండా ఉంటాయి.
మెత్తగా ఉడికిన తరువాత దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

వంకాయ కూటు


Picture  Recipe

కావలసిన పదార్థాలు :


  • వంకాయలు. 1/4 కేజీ
  • పెసరపప్పు.. 1 కప్పు
  • పచ్చికొబ్బరి చిప్ప.. 1
  • ఉప్పు.. తగినంత
  • కరివేపాకు.. కాస్తంత
  • పోపుకోసం.
  • నూనె.. 2 టీస్పూ//
  • మినప్పప్పు.. 1 టీస్పూ//
  • జీలకర్ర. కాస్తంత
  • ఎండుమిరపకాయలు.. 3
  • ఇంగువ.. కొద్దిగా
  • వెల్లుల్లి రేకలు. 10

తయారు చేయు విధానం :


వంకాయలు చిన్న ముక్కలుగా కోసి నీళ్లలో వేయాలి.
వాటిని పెసరపప్పుతో కలిపి మెత్తగా ఉడికించాలి.
ఉప్పు వేసి కిందకి దించాలి. ఇప్పుడు స్టవ్‌ మీద బాణెలి ని పెట్టి నూనె వేసి పోపు సామాను అన్నీ వేసి ఎర్రగా వేయించాలి.
పచ్చికొబ్బరి వేసి బాగా కలిపి కరివేపాకు కూడా వేసి, ఉడికించి దించిన వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపితే వంకాయ కూటు రెడీ!

కలగూరగంప


కావలసిన పదార్థాలు


  • పచ్చి క్యారట్లు.. 2
  • పచ్చిబఠాణీలు. 1 కప్పు
  • నూనె.. 2 టీస్పూ//.
  • ఇంగువ. 1/3 టీస్పూ//.
  • ఆవాలు.. 1/2 టీస్పూ//.
  • జీలకర్ర.. 1 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • కర్రీ పౌడర్.. 1 టీస్పూ//
  • ధనియాలపొడి.. 1 టీస్పూ//
  • మంచినీరు. తగినన్ని
  • పొట్టు తీయని బియ్యంతో చేసిన జావ.. 2 టీస్పూ//.
  • పచ్చిమిరియాలు.. 1/4 టీ.
  • పెరుగు.. 1 కప్పు

తయారీ విధానం


ఒక బాణెలి తీసుకుని అందులో నూనె వేసి వేడిచేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేయాలి.
ఇవి వేగిన తరువాత కర్రీ పౌడర్, ఉప్పుతోపాటు ధనియాలపొడి, కేరట్ ముక్కలు, పచ్చిబఠానీలను వేసి సన్నటి సెగపై ఐదు నిమిషాలపాటు వేయించాలి.
తరువాత అందులో నీళ్లు పోసి మూతపెట్టి మరో ఐదు నిమిషాల తరువాత రెండు టీస్పూన్ల్ బియ్యం జావ,పచ్చిమిరియాల పేస్ట్, పెరుగు వేసి కలియబెట్టి కాసేపు ఉడికించి తీసేయాలి.
అంతే.. ఘుమఘుమలాడే వెజిటబుల్ కర్రీ రడీ.

Thursday, May 10, 2012

జీలకర్ర సొరకాయ


కావలసిన పదార్థాలు


  • సొరకాయ ముక్కలు. 2 కప్పులు
  • శనగపిండి. 1 కప్పు
  • జీలకర్ర.1 టీస్పూ//.
  • వాము. 1 టీస్పూ//.
  • ఉప్పు. రుచికి సరిపడా
  • వేరుశెనగపప్పు. 1/4 కప్పు
  • పచ్చిమిర్చి. 2
  • కారం. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • కొత్తిమీర. 4 రెమ్మలు
  • నూనె. తగినంత

తయారీ విధానం


సొరకాయ ముక్కల్లో శనగపిండి, జీలకర్ర, వాము, ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించి, పకోడీల పిండిలాగా కలుపుకోవాలి.
బాణీలి లో నూనె వేసి కాగాక మిశ్రమాన్ని పలుకులుగా పడేటట్లు వేసి దోరగా కాలాక తీసి పక్కన ఉంచాలి.
ఒక్కొక్క సొరకాయ ముక్క విడిగా పడేటట్లు వేసుకుంటే, సమంగా కాలి వేపుడు రుచిగా ఉంటుంది.
బాణీలి లో ఒక టీస్పూన్ నూనె ఉంచి మిగిలినదాన్ని ఓ గిన్నెలోకి తీసేయాలి.
అందులో వేరుశెనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత ముందుగా వేయించి పక్కన ఉంచిన సొరకాయ పకోడీలను వేసి కలపాలి.
అవసరమైతే మరికొంత ఉప్పు, కారం చల్లుకోవచ్చు. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
అంతే జీలకర్ర సొరకాయ తయార్.

బజ్జీ మిర్చి వేపుడు


కావలసిన పదార్థాలు :


  • బజ్జీ మిర్చీ. 100 గ్రా.
  • ఉల్లిపాయ. 1
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • వాము. 1 టీస్పూ//.
  • శనగపిండి. 100 గ్రా.
  • ఉప్పు. తగినంత
  • కరివేపాకు. 6 రెమ్మలు
  • కొత్తిమీర. చిన్న కట్ట
  • నూనె. సరిపడా

తయారు చేయు విధానం :


ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరగాలి.
శనగపిండిలో వాము, జీలకర్ర, ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి.
మిరపకాయల తొడిమ అలాగే ఉంచి మధ్యలోకి చీరాలి. ముందుగా కలిపి ఉంచిన పిండి మిశ్రమాన్ని కాయలలో కూరాలి.
మూకుదడు లో నూనె వేసి కాగిన తరువాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగా దోరగా వేయించి తీసేయాలి. అంతే వేడి బజ్జీ మిర్చి వేపుడు రెడీ.

మెట్ట వంకాయ కూర


కావలసిన పదార్థాలు


  • పచ్చ వంకాయలు. 1/2 కేజీ
  • కారంపొడి. 2 టీస్పూ//.
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • మసాలాపొడి. 4 టీస్పూ//.
  • పోపు కోసం.
  • నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు... తగినంత

తయారు చేయు విధానం :


ముందుగా వంకాయలను ముక్కలుగా తరిగి, ఉప్పునీటిలో వేసి కడిగి పక్కన ఉంచాలి.
బాణీలి లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేయాలి.
అవి వేగిన తరువాత వంకాయ ముక్కలు, పసుపు, కారంపొడి, ఉప్పువేసి మూతపెట్టాలి. నీరు పోయాల్సిన అవసరం లేదు.
సన్నటి మంటమీద వంకాయ ముక్కలను ఆవిరిమీదనే మగ్గించాలి.
వంకాయ ముక్కలు మెత్తబడిన తరువాత మసాలాపొడి వేసి బాగా కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మెట్టవంకాయ కూర రెడీ.

పెసరపప్పు పాలకూర


కావలసిన పదార్థాలు


  • పెసరపప్పు. 1/4 కేజీ
  • పాలకూర.4 కట్టలు
  • అల్లంవెల్లుల్లి. 1 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 2
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • కొత్తిమీర. కాస్తంత
  • నూనె. 4 టీస్పూ//.
  • నిమ్మకాయ. 1
  • తాలింపు కోసం
  • ఆవాలు. 1/2 టీస్పూ//.
  • జీలకర్ర. 1/2 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 4
  • కరివేపాకు. 4 రెమ్మలు
  • వెల్లుల్లి. 6 రెబ్బలు
  • నూనె లేదా నెయ్యి. 4 టీస్పూ//.

తయారీ విధానం


పెసరపప్పులో ఉప్పు, పసుపు, 4 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి.
బాణీలి లో నూనె పోసి వేడయ్యాక అల్లంవెల్లుల్లి వేసి ఓ రెండు నిమిషాలు వేయించి, ఆపై సన్నగా తరిగిన పాలకూరను వేసి ఉడికించాలి.
పాలకూర బాగా ఉడికిన తరువాత ఉడికించిన పెసరపప్పునూ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోయాలి.
అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసి మరో 10 నిమిషాలు తక్కువ మంటమీద ఉడికించాలి.
ఆ తరువాత కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండితే సరి. చివర్లో.విడిగా బాణీలి పెట్టి నూనె లేదా నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులతో పోపు వేసి పప్పులో కలపితే వేడి వేడి పెసరపప్పు పాలకూర రెడీ అయినట్లే.

శెనగపిండి పొడి కూర


కావలసిన పదార్థాలు


  • శెనగపిండి.2 కప్పులు
  • పచ్చికొబ్బరి తురుము. 1 కప్పు
  • నూనె. 1 కప్పు
  • పచ్చిమిర్చి తురుము. 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత కారం. 1 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • కరివేపాకు. కొద్దిగా
  • ఎండుమిర్చి. 2
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • ఆవాలు. 1/2 టీస్పూ//.
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు

తయారీ విధానం


బాణీలి లో నూనె పోసి ముందుగా మినప్పప్పు వేసి దోరగా వేగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, శెనగపిండి వేసి సన్నసెగమీద కలుపుతూ వేయించాలి. కొబ్బరి తురుము కూడా కలపాలి.
ఒక నిమిషం తరువాత పై మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపితే పొడి కూర తయార్‌. 

సార్సన్ కా సాగ్(ఆవాకు కూర )


కావలసిన పదార్థాలు


  • ఆవ ఆకులు. 1/4 కేజీ
  • పాలకూర. 100 గ్రా
  • ఉల్లిపాయలు. 25 గ్రా.
  • ముల్లంగి. 2
  • వెల్లుల్లి. 5 రెబ్బలు
  • అల్లం. చిన్న ముక్క
  • పచ్చిమిర్చి. 2
  • ఉప్పు. తగినంత
  • పోపు కోసం.
  • అల్లం. చిన్న ముక్క
  • పచ్చిమిర్చి. 2
  • నెయ్యి లేదా నూనె. 2 టీస్పూ//.
  • కారంపొడి. 1/2 టీస్పూ//.

తయారీ విధానం


ఆవ ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి, చల్లార్చి... మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి.
అల్లం, వెల్లుల్లిపాయలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్టు వేసి దోరగా వేయించాలి.
తరువాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న ఆవకూర మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి.
చివర్లో పైన చెప్పుకున్న పోపు సామానులతో పోపుపెట్టి ఆవకూరకు కలపాలి. అంతే రుచికరమైన సార్సన్ కా సాగ్ తయారైనట్లే. 

వంకాయ చిక్కుడు గింజల కూర


కావలసిన పదార్థాలు


  • వంకాయలు. 1/2 కేజీ
  • చిక్కుడు గింజలు. 1/2 కప్పు
  • ఉల్లిపాయలు. 2
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • ధనియాలపొడి. 1/2 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//.
  • నూనె. 2 టీస్పూ//.
  • అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 8
  • కొత్తిమీర. 2 టీస్పూ//.
  • ఆవాలు, జీలకర్ర. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 4 రెబ్బలు
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం


ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీరలను గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చిక్కుడు గింజలను ఉప్పు వేసిన నీటిలో ఉడికించి ఉంచాలి.
ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టాలి.
అందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లను జతచేసి బాగా కలిపి ఐదు నిమిషాలపాటు వేయించాలి.
పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, సరిపడా ఉప్పును కూడా కలిపి ఉడికించాలి.
ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి కలిపి, సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి.
దాంట్లోనే కాసిన్ని నీళ్లు చిలకరించి మరికొంతసేపు ఉడికించాలి.
చివర్లో ఉడికించిన చిక్కుడు గింజల్ని కూడా జతచేసి ఐదు నిమిషాల తరువాత దించేయాలి.

కాయగూరల చౌగ్రా


కావలసిన పదార్థాలు


  • బంగాళాదుంపలు. 2
  • పచ్చిబఠాణీలు.1/2 కప్పు
  • క్యారెట్లు. 3
  • కాలీఫ్లవర్. 1 చిన్నది
  • వంకాయలు. 4
  • ఉల్లిపాయలు. 3
  • అల్లంవెల్లుల్లి.. 2 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//.
  • పెరుగు. 1/2 కప్పు
  • నిమ్మకాయ. 1 ఉప్పు.
  • తగినంత నూనె. సరిపడా
  • మసాలా పొడి కోసం..
  • యాలకులు. 2
  • లవంగాలు..4
  • పలావు ఆకు. 1
  • దాల్చినచెక్క. 1/4 అంగుళం
  • షాజీరా. 1/4 టీస్పూ//.

తయారీ విధానం


కూరగాయల్ని కడిగి రెండు లేదా రెండున్నర అంగుళాల సైజులో కోసుకోవాలి.
బాణీలిలో నూనె పోసి ఒక్కో రకం కూరగాయ ముక్కల్నీ వేసి అవి సగం వేగేవరకూ వేయించి తీయాలి.
బాణీలి లో అరకప్పు నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనెను తీసేయాలి.
అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి వేయాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు చల్లి సిమ్‌లో పెట్టి వేయించిన కూరగాయ ముక్కలన్నీ వేయాలి.
ఆపై పెరుగు కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడికేవరకూ ఉంచాలి.
అవసరమైతే మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లాలి. చివరగా మసాలా పొడి చల్లి దించి నిమ్మరసం పిండితే సరి.

బంగాళదుంప - కాలిఫ్లవర్ కూర


కావలసిన పదార్థాలు :


  • బంగాళాదుంపలు. 4
  • కాలీఫ్లవర్ ముక్కలు. 4 కప్పులు
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ//.
  • నూనె. 3 టీస్పూ//.
  • కారం. 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • ఇంగువ. 1/2 టీస్పూ//.
  • ధనియాలపొడి. 2 టీస్పూ//.
  • గరంమసాలా. 2 టీస్పూ//.
  • ఆమ్‌చూర్ పౌడర్. 1/2 టీస్పూ//.
  • పసుపు. 1/2 టీస్పూ//.

తయారు చేయు విధానం :


నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కాలీఫ్లవర్ ముక్కలను వేసి పది నిమిషాల తరువాత నీరంతా పోయేలా వడగట్టి పెట్టుకోవాలి.
బాణెలి లో నూనె వేడయ్యాక.. అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాలపొడి, కారం, పసుపు, నాలుగు టీస్పూ// నీటిని కలిపి వేయించాలి.
అందులోనే కాలీఫ్లవర్ ముక్కలను, ఉప్పును వేసి కలియబెట్టి మూతపెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి.
ఆ తరువాత ఆలూ ముక్కల్ని కూడా వేసి కలిపి మూతపెట్టి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి.
అయితే మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
ఆపై గరంమసాలా, ఆమ్‌చూర్ పౌడర్‌ని కూడా వేసి కలియబెట్టి మూతలేకుండా మరో రెండు నిమిషాలు ఉడికించి.. చివర్లో కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి దించేయాలి. అంతే వేడి వేడి ఆలూ గోబీ కర్రీ రెడీ.

వంకాయ మసాల కూర


కావలసిన పదార్థాలు :


  • పొడవు వంకాయలు. 1/2 కేజీ
  • ఎండుమిర్చి. 10
  • మినప్పప్పు. 4 టీస్పూ//.
  • ధనియాలు. 1 టీస్పూ//..
  • ఉల్లిపాయలు. 4
  • వెన్న. 100 గ్రా.
  • ఉప్పు. తగినంత
  • నూనె. 3 టీస్పూ//.

తయారు చేయు విధానం :


వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి.
ఓ బాణెలి లో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి గరుకుపొడిలా చేయాలి.
తరువాత ఉల్లిముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి.
ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి.
తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదానిపక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే.

మసాలా బీరకాయ


కావలసిన పదార్థాలు


  • బీరకాయలు. 1 కేజీ
  • కారం. 1 టీస్పూ//.
  • ఉల్లిపాయలు. 2
  • నూనె. తగినంత
  • లవంగాలు. 2
  • పచ్చిబఠాణీలు. 100 గ్రా.
  • టమోటోలు. 2
  • ధనియాలు. 2 టీస్పూ//.
  • అల్లం వెల్లుల్లి ముద్ద. 2 టీస్పూ//.
  • పసుపు... 1/2 టీస్పూ//.
  • యాలకులు... 2
  • దాల్చిన చెక్క... కొద్దిగా

తయారు చేయు విధానం :


బీరకాయలకు చెక్కుతీసి చిన్న ముక్కలుగా చేయాలి. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలను పొడి చేసుకోవాలి.
ఉల్లిపాయలను సన్నగా తరగాలి. స్టవ్‌పై బాణెలి పెట్టి నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయ తరుగు, బీరకాయ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠాణీలు వేసి కాసేపు వేయించి తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి.
కూర ఉడికాక, పైన నూరుకున్న పొడిని చల్లాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే మసాలా బీరకాయ రెడీ అయినట్లే.

మెంతాకు-పనీర్ కూర


కావలసిన పదార్థాలు


  • పనీర్. 400 గ్రా.
  • శెనగపిండి. 1 కప్పు
  • నూనె. 2 టీస్పూ//.
  • మెంతి ఆకులు. 2 కప్పులు
  • మిరియాలపొడి. 1/2టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • టొమోటో గుజ్జు. 1/2 కప్పు
  • నీళ్లు. తగినన్ని
  • తాజా మీగడ. 1 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా

తయారు చేయు విధానం :


శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి.
వెడల్పాటి బాణెలి లో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి.
ఇప్పుడు అదే బాణెలి లో మిగిలి ఉన్న నూనెలోనే టొమోటో గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి అరగంటసేపు తక్కువ మంటమీద ఉడికించాలి.
తరువాత పనీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి పైన మీగడ వేసి కలిపి వడ్డించాలి. 

పనీర్తో బెండకాయ


కావలసిన పదార్థాలు


  • లేత బెండకాయలు. 1/2 కేజీ
  • పనీర్. 2 కప్పులు
  • టొమోటోలు. 2
  • కారం. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • నూనె. 6 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా
  • కొత్తిమీర. కొద్దిగా

తయారీ విధానం


బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక మంచి గుడ్డతో తుడవాలి. వాటికి మొదలు, చివర్లను కట్ చేసి, గాట్లను పెట్టాలి.
ఒక బాణెలి లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక టొమోటో గుజ్జు, కారం, జీలకర్ర, ఉప్పు, పనీర్ ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి.
అన్ని పదార్థాలను రెండు నిమిషాలు వేయించి దించేయాలి. గాట్లు పెట్టిన బెండకాయల్లో పై మిశ్రమాన్ని నింపాలి.
అడుగు మందంగా ఉండే మరో పాన్‌లో మిగతా నూనె వేసి వేడయ్యాక స్టఫ్డ్ బెండకాయల్ని వేసి మూతపెట్టి, సన్నటి మంటమీద పదిహేను నిమిషాలపాటు వేయించాలి.
మాడకుండా జాగ్రత్తపడుతూ వేయించి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పనీర్ స్టఫ్డ్ బెండీ సిద్ధమైనట్లే.

టొమోటో మసాలా కూర


కావలసిన పదార్థాలు


  • టొమోటోలు. 1/2 కేజీ
  • నూనె. సరిపడా
  • గసగసాలు. 2 టీస్పూ//.
  • జీడిపప్పులు. 20
  • నువ్వులు. 2 టీస్పూ//.
  • చింతపండు. 2 నిమ్మకాయలంత
  • ఉల్లిపాయలు. 4
  • ఉప్పు, కారం. తగినంత
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ.
  • మసాలాపౌడర్. 2 టీస్పూ.
  • కొత్తిమీర. 2 కట్టలు

తయారీ విధానం


ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, రెండు ఉల్లిపాయల తరుగు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి.
చల్లారిన తరువాత ముందే నానబెట్టి ఉంచిన చింతపండుతో సహా ఉప్పు, కారం జతచేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
స్టవ్‌పై బాణీలి పెట్టి.. రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి.
తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
కాసేపటి తరువాత ముందే నూరి ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి.
దించేముందు మసాలాపొడి వేసి కలిపి. పైన కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతేటొమోటో మసాలా కర్రీ సిద్ధమైనట్లే.

బంగాళాదుంప-వంకాయ కూర


కావలసిన పదార్థాలు


  • వంకాయలు. 2
  • బంగాళాదుంపలు. 4
  • పసుపు. 1 టీస్పూ//.
  • కారం. 2 టీస్పూ//.
  • నూనె. వేయించేందుకు సరిపడా
  • గరంమసాలా. 2 టీస్పూ//.
  • నిమ్మరసం. 1 టీస్పూ//.
  • కొత్తిమీర తురుము. కొద్దిగా
  • ఉప్పు. తగినంత
  • నూనె. నాలుగు టీస్పూ//.

తయారు చేయు విధానము :


వంకాయని పలుచని గుండ్రని ముక్కలుగా కోసి. వాటిమీద ఉప్పు, కారం, పసుపు చల్లి పక్కన ఉంచాలి. బాణెలిలో నూనె పోసి ఈ ముక్కల్ని వేయించి తీయాలి.
బంగాళాదుంప ముక్కల్ని ఉడికించి తొక్క తీసి, ఉప్పు, గరంమసాలా వేసి మెత్తగామెదపాలి.
వంకాయ ముక్కల్ని చిన్నపాటి చిప్పల్లా చేసి అందులో ఉడికించిన బంగాళాదుంప ముక్కల మిశ్రమాన్ని పెట్టాలి.
స్టవ్‌మీద బాణెలి పెట్టి 2 టీస్పూన్ల నూనెని చిలకరించి బంగాళాదుంపల మిశ్రమం పెట్టిన వంకాయ ముక్కల్ని బాణలిలో పెట్టి తక్కువ మంటమీద 2 నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి.
చివరగా కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండి వడ్డించాలి. అంతే ఆలూ వంకాయ స్పెషల్ రెడీ .

పచ్చిబఠాణీ కర్రీ


కావలసిన పదార్థాలు :


  • పచ్చి బఠాణీలు. 1/4 కేజీ
  • నెయ్యి. 2 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • కారం. 1/4 టీస్పూ//.
  • మంచినీళ్ళు. 3/4 కప్పు
  • ఎండుమామిడి పొడి. 1/4 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • కొత్తిమీర తురుము కొద్దిగా

తయారు చేయు విధానము :


బాణెలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరవాత ఇంగువ, జీలకర్ర, పసుపు, కారం వేసి పచ్చిబఠాణీలు వేసి తిప్పాలి.
సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి.
బఠాణీలు ఉడికిన తరవాత ఉప్పు, ఎండుమామిడికాయ పొడి వేసి కలిపి, కొత్తిమీర వేసి దించితే మటర్‌ కీ బఠానీ సబ్జీ రెఢీ!