Thursday, May 10, 2012

గుమ్మడికాయతో ఎరుస్సెరి


కావలసిన పదార్థాలు

  • గుమ్మడికాయ. 1/4కేజీ
  • అలసందలు. 1/2కప్పు
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • కారం. 2 టీస్పూ//.
  • కొబ్బరి తురుము. 3 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • ఆవాలు. 1/2టీస్పూ//
  • కరివేపాకు. 4 రెమ్మలు
  • గుజ్జుకోసం కొబ్బరి తురుము. 1కప్పు
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • కొబ్బరినూనె. తగినంత

తయారు చేయు విధానం :

గుమ్మడికాయ ముక్క తొక్కు తీసి చిన్న ముక్కల్లా కోసుకోవాలి.
ఈ ముక్కల్లో పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఉడకగా, నీళ్లు మిగిలితే వంపేయాలి.
అలసందలను కూడా ఉడికించి ఉంచుకోవాలి. కొబ్బరి, జీలకర్రలను మెత్తగా రుబ్బి ఉంచాలి. ఉడికించిన అలసందల్నీ, రుబ్బిన కొబ్బరి గుజ్జునీ. గుమ్మడి ముక్కల్లో వేసి తక్కువ మంటపై 5 నిమిషాలపాటు ఉడికించాలి.
విడిగా మరో బాణెలిలో కొబ్బరినూనె, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటమన్నాక. కొబ్బరి తురుము వేసి వేయించి అందులో గుమ్మడి ముక్కల మిశ్రమం కలిపితే ఎంతో ఇష్టంగా తినే గుమ్మడికాయ ఎరుస్సెరి రెడీ. 

No comments:

Post a Comment