Thursday, May 10, 2012

బూడిద గుమ్మడికాయ కూర


కావలసిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ. 1/2కేజీ
  • అరటికాయ. 1
  • కంద లేదా బంగాళాదుంపలు. 100 గ్రా.
  • గోరుచిక్కుడు లేదా బీన్స్. 100 గ్రా.
  • క్యారెట్లు. 2
  • ములక్కాడలు. 2
  • పచ్చికొబ్బరి చిప్ప. 1
  • ఉప్పు. తగినంత
  • నూనె లేదా నెయ్యి. 4 టీస్పూ//.
  • పెరుగు. 1 కప్పు
  • పచ్చిమిరపకాయలు. 8

తయారు చేయు విధానం :

ముందుగా కూరగాయలన్నింటినీ కడిగి, చెక్కుతీసి సన్నగా తరిగి ఉప్పువేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి.
ఆవిరి అంతా పోయిన తరువాత కుక్కర్ మూత తీసివేసి అందులో మెత్తగా రుబ్బుకున్న పచ్చికొబ్బరి, పచ్చిమిరపకాయల ముద్దను వేసి మరికాసేపు ఉడికించాలి.
ఈ కూర కాసేపు చల్లారిన తరువాత పెరుగు, నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నూనె ఇష్టం లేనివారు నెయ్యి వాడవచ్చు. ఆంతే బూడిద గుమ్మడికాయ కూర రెడీ.

No comments:

Post a Comment