Friday, May 18, 2012

వేసవిలో కొత్త శక్తిని పొందాలంటే.. నిమ్మరసం తీసుకోండి!

వేసవిలో నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేడికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు బలాన్నిచ్చే టానిక్ నిమ్మరసం. నిమ్మరసానికి చల్లని నీటిని కలిపి చిటికెడు ఉప్పు, రెండు చెంచాల తేనె కలిపి తాగితే వేసవిలో కొత్త శక్తిని పొందగలుగుతారు.

ఇంకా నిమ్మకాయలో సి విటమిన్ విరివిగా లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సి విటమిన్ అవసరం. అనారోగ్యంతో వున్నవారు, కోలుకుంటున్నవారు నిమ్మకాయ వాడాలి.

అలాగే కాలిన గాయాలతో బాధపడేవారు నిమ్మకాయ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. నిమ్మరసాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. సి విటమిన్‌ను శరీరం గ్రహించేందుకు కొంత సమయం పడుతుంది.

ఆహారంలో కొవ్వు పదార్థాన్ని అధికంగా తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా వుంటే.. ఆ ఇబ్బంది నుంచి బయట పడేందుకు నీళ్ళలో కలిపిన తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

No comments:

Post a Comment