Friday, May 18, 2012

సంపూర్ణ ఆరోగ్యానికి ఇవే...

గుండె ఆరోగ్యానికి కింది ఉదహరించిన వంటకాలవంటివాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా హృద్రోగాలకు దూరం కావచ్చును. రోజులో ఆయా వేళల్లో తీసుకోవాల్సిన పదార్థాలను, తయారీ విధానాలు దిగువ ఇవ్వబడ్డాయి.

ఉదయపు ఫలహారంగా బీట్‌రూట్, ఆరంజ్ సలాడ్ తీసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు...
1 కిలో బీట్‌రూట్ (చిన్నవి), 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాలు, 20 ఉల్లిపాయలు తరిగినవి, 2 ఆరంజ్‌లు తొనలు, 2 స్పూన్ హేజల్‌నట్ ఆయిల్, 1 స్పూన్ తరిగిన కొత్తిమీర, 1/2 కప్ ఆరంజ్ జూస్, 2 స్పూన్ హేజల్‌నట్స్ వేయించినవి

తయారీ విధానం: ఒవెన్‌ను 400 డిగ్రీల ఫారన్‌హీట్‌లో ఉంచాలి. బీట్స్ తరిగి ఉంచుకోవాలి. పాన్‌లో బీట్స్ ఉంచి ఆయిల్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 25 నిమిషాల వరకు వేయించాలి. ఉల్లిపాయలను ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 15 నిమిషాలు వేయించాలి.

ఆరంజ్‌లను చిన్నని తొనలుగా చేసి ఉంచాలి. చిన్న పాత్రలో హేజల్‌నట్ ఆయిల్, కొత్తిమీర మరియు ఆరంజ్ జూస్‌ను కలిపి ఉంచుకోవాలి. పాత్రలో బీట్‌రూట్, ఆరంజ్ తొనలను ఉంచి, వాటిపై వేయించిన ఉల్లిపాయలు ఉంచి, చివరగా కొత్తిమీర, హేజల్‌నట్స్ మరియు తురిమిన చీస్‌తో అలంకరించండి.

ఇక మధ్యాహ్న భోజనంగా గోధుమ పాస్తాను తీసుకోవచ్చు. దీనితయారీకి కావలసినవి... 1 ఉల్లిపాయ, 1 బంచ్ కాబేజీ, 1 ముల్లంగి సన్నగా తరిగినవి, 1 స్పూన్ చెర్రీ వైన్ వినిగర్, 1/2 స్పూన్ ఆరంజ్ రసం, 3/4 స్పూన్ ఉప్పు, వేయించి పొడి చేసిన మిరియాలు, 3 స్పూన్ ఆలివ్ ఆయిల్, 7 ఔన్స్ చీస్

తయారీ విధానం: ఒక పాత్రలో ఉల్లిపాయలను ఉంచి వాటిలో చల్లటి నీరు పోసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. మరో పాత్రలో నీరు పోసి వాటిని ఉడికించాలి. కాబేజీని కూడా ముందు చల్లని నీటిలో ఉంచి ఆ తరువాత ఉడికించాలి. అందులో ముల్లంగి ముక్కలు వేసి 30 సెకన్లకు ఉడికించాలి. వాటిని వడగట్టి వెంటనే చల్లటి నీటిలో వేయాలి.

పాస్తాను కూడా 8 నుంచి 9 నిమిషాల వరకు ఉడికించి, నీటిని వడగట్టి పక్కనే ఉంచాలి. పెద్ద పాత్రలో వినిగర్, ఆరంజ్ రసం, ఉప్పు మరియు మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. అందులో ఉడికించి ఉంచిన కాయకూరలు, పాస్తా, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. కాబేజీ, ముల్లంగి మరియు ఉల్లిపాయలతో అలంకరించి వడ్డించాలి.

సాయంత్రంవేళల్లో స్నాక్స్‌గా మామిడి స్ట్రాబెర్రీ కోన్స్ వంటివాటిని భుజించవచ్చు....
కావలసినవి: 2 మామిడి పండ్లు తరిగినవి, 1 స్పూన్ స్ట్రాబెర్రీలు తరిగినవి, 1 స్పూన్ నిమ్మరసం, 8 కప్స్ ఐస్, పుదీనా

తయారీ విధానం: మామిడి పండ్లు మరియు స్ట్రాబెర్రీలను బాగా చిలక్కొట్టి, అందులో నిమ్మరసాన్ని కలపాలి. ఐస్ క్యూబ్‌లను చిన్న ముక్కలుగా చేసి అందులో పండ్ల రసాన్ని కలిపి పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించాలి.

ఇక రాత్రి భోజనంగా వాల్‌నట్ ఆపిల్ సలాడ వంటివి గుండెకు బలాన్ని, అదే సమయంలో హానిచేయని పదార్థాలను తీసుకోవచ్చు. కావలసినవి: 1/2 కప్ వాల్‌నట్ బద్దలు, 1/2 కప్ పెరుగు, 2 స్పూన్ మమనీస్, 2 స్పూన్ పార్‌స్లీ, ఆకులు, 1 స్పూన్ తేనె, 1/2 నిమ్మకాయ తరిగినది, వేయించి పొడి చేసిన నల్ల మిరియాలు, 2 ఆపిల్, 2 రిబ్స్ సెలరీ,
1/4 కప్ కిస్‌మిస్, 1/2 స్పూన్ నిమ్మరసం

తయారీ విధానం: ఒవెన్‌ను 350 డిగ్రీ ఫారన్‌హీట్‌లో ఉంచాలి. బేకింగ్ షీట్‌లో వాల్‌నట్స్‌ వేసి 8 నుంచి 10 నిమిషాల వరకు వేయించాలి. పాత్రలో పెరుగు, మయనీస్, పార్‌స్లీ, తేనె మరియు నిమ్మకాయ మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. వాటిలో కట్ చేసి ఉంచిన ఆపిల్‌, సెలరీని వేసి వాటిపై నిమ్మరసం చల్లి, వడ్డించాలి.

No comments:

Post a Comment