Thursday, May 10, 2012

ఆమ్‌చూర్, జీలకర్రలతో మసాలా కాకర


Picture  Recipe  

కావలసిన పదార్థాలు


  • కాకరకాయలు (చిన్నసైజువి). 1/2కేజీ
  • ఆమ్‌చూర్. 1/2టీస్పూ//
  • జీలకర్రపొడి. 1/2టీస్పూ//
  • ఉల్లిపాయలు. 1/4 కేజీ
  • కారం. తగినంత
  • ఉప్పు. తగినంత
  • నూనె. వేయించేందుకు సరిపడా

తయారు చేయు విధానం :


కాకరకాయలను కడిగి చాకుతో వాటి పొట్టను నిలువుగా చీల్చాలి. కోసేటప్పుడు పైనా కిందా విడిపోకుండా జాగ్రత్తపడాలి.

తరువాత కాయలోపలి గింజలను తీసి వేయాలి. ఓ గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆమ్‌చూర్‌, జీలకర్ర. అన్నీ వేసి ఉల్లిమసాలా తయారుచేయాలి.

ఇప్పుడు ఈ మసాలాను కాకరకాయల్లో కూరి బయటకు రాకుండా, కాయల్ని లావుపాటి దారంతో కుట్టివేయాలి.

మందపాటి బాణెలిలో నూనె పోసి కాగుతుండగా కాకరకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే ఆమ్‌చూర్, జీలకర్రలతో మసాలా కాకర రెడీ.

No comments:

Post a Comment