Friday, May 18, 2012

ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త

వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆహారం తీసుకోవడం మంచిదని న్యూట్రిషన్లు పేర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని సానుకూల స్థాయిలో నియంత్రించడం, మనదేహంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల్లో 25 శాతాన్ని చెమట ద్వారా బయటికి పంపడానికి అధికంగా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. అదీనూ వేసవిలో తీసుకుంటే చర్మవ్యాధులు, విరేచనాలు, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు దరికి చేరవని వైద్యులు పేర్కొంటున్నారు.

అయితే వర్షాకాలంలో ఈ కొబ్బరి బోండాలను తీసుకోవడంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయలను తీసుకుంటే జలుబు చేసే అవకాశాలు మెండు. వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ సీజన్‌‌లో ఆపిల్ వంటి పండ్లను తీసుకోవడం మంచిది. అదే విధంగా శీతాకాలంలోనూ ఆపిల్, బొప్పాయి పండ్లను తీసుకోవచ్చు. పుచ్చకాయ జ్యూస్‌ను తాగితే చర్మం ఛాయ మెరుగవుతుంది.

అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషక పదార్థాలు సమకూరుతాయి. పుచ్చకాయను వేసవిలో ఎక్కువగానూ, మిగిలిన సీజన్లలో కాస్త తక్కువ మోతాదులో తీసుకుంటే అయొడిన్, సిలికాన్, సోడియం వంటి ఖనిజపదార్థాలు సమకూరుతాయి. పుచ్చకాయ జ్యూస్ మూత్రసంచిలోని రాళ్లను తొలగించేందుకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.  

No comments:

Post a Comment