Thursday, May 10, 2012

కారంమసాలా వంకాయ


కావలసిన పదార్థాలు


  • చిన్న వంకాయలు. 10
  • ఆవనూనె. 1/2 కప్పు
  • లవంగాలు. 4
  • పులావు ఆకులు. 2
  • ఇంగువ. చిటికెడు
  • జీలకర్రపొడి. 1 టీస్పూ//.
  • మెంతిపొడి. 1 1/2 టీస్పూ//.
  • ఆవపొడి. 1.1/2 టీస్పూ//.
  • సోంపు పొడి. 1 టీస్పూ//.
  • కొత్తిమీర పొడి. 1 టీస్పూ//.
  • కారం. 2 టీస్పూ//.
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • ఎండుమామిడి పొడి. 2 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానము :


వంకాయల్ని బాగా కడిగి తుడవాలి. వాటిని గుత్తివంకాయకూరకు కోసినట్లుగా కాయవిడకుండా నిలువుగా చిలికలు చేసి పక్కనుంచాలి.

ఓ గిన్నెలో పైన చెప్పుకున్న పొడులన్నీ వేసి కలిపి అందులోనే ఉప్పు, కారం కూడా వేసి ఈ మిశ్రమాన్ని చిల్చిన వంకాయల్లో కూరాలి.

ఓ పాన్‌లో ఆవనూనె వేసి కాగిన తరువాత లవంగాలు, పలావు ఆకులు, ఇంగువ వేసి వేగాక మిశ్రమం నింపిన వంకాయల్ని కూడా వేసి కొద్దిగా వేయించాలి.

తరవాత మూతపెట్టి మధ్యమధ్యలో కదుపుతూ తక్కువ మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే కారం మసాలా వంకాయ రెఢీ.

No comments:

Post a Comment